MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/sumanth-ashwin-would-be-unknown-factsa6bc0054-29ca-4b1c-8256-6901142f8d55-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/sumanth-ashwin-would-be-unknown-factsa6bc0054-29ca-4b1c-8256-6901142f8d55-415x250-IndiaHerald.jpgకొన్ని నెలలుగా టాలీవుడ్ లో నటీనటులు పెళ్లిపై దృష్టి పెట్టారు. తాజాగా ఆ జాబితాలోకి నిర్మాత ఎం ఎస్ రాజు కొడుకు హీరో సుమంత్ అశ్విన్ కూడా చేరిపోయాడు. త్వరలో సుమంత్ బ్యాచ్ లర్ లైఫ్ నుంచి ఫ్యామిలీ మ్యాన్ గా మారబోతున్నాడు. ఈ విషయన్ని స్వయంగా ఎం ఎస్ రాజు ప్రకటించాడు. సుమంత్ పెళ్లి గురించి ప్రకటన చేశాడుsumanth ashwin;sushant singh;chakravarthy;deepika;mithra;naga;raj;suma;suma kanakala;sumanth;sumanth ashwin;sushanth;hyderabad;tollywood;cinema;naga aswin;marriage;producer;wife;producer1;hero;girl;heroine;fashion;house;fatherటాలీవుడ్ హీరో సుమంత్ అశ్విన్ కాబోయే భార్య గురించి ఆసక్తికర విషయాలుటాలీవుడ్ హీరో సుమంత్ అశ్విన్ కాబోయే భార్య గురించి ఆసక్తికర విషయాలుsumanth ashwin;sushant singh;chakravarthy;deepika;mithra;naga;raj;suma;suma kanakala;sumanth;sumanth ashwin;sushanth;hyderabad;tollywood;cinema;naga aswin;marriage;producer;wife;producer1;hero;girl;heroine;fashion;house;fatherSat, 06 Feb 2021 14:00:00 GMT
కొన్ని నెలలుగా టాలీవుడ్ లో నటీనటులు పెళ్లిపై దృష్టి పెట్టారు. తాజాగా ఆ జాబితాలోకి నిర్మాత ఎం ఎస్ రాజు కొడుకు హీరో సుమంత్ అశ్విన్  కూడా చేరిపోయాడు. త్వరలో సుమంత్ బ్యాచ్ లర్ లైఫ్ నుంచి ఫ్యామిలీ మ్యాన్ గా మారబోతున్నాడు. ఈ విషయన్ని స్వయంగా ఎం ఎస్ రాజు ప్రకటించాడు. సుమంత్ పెళ్లి గురించి ప్రకటన చేశాడు. త్వరలో హీరో సుమంత్ పెళ్లి వేడుక జరగనుందని చెప్పాడు. హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్ హౌస్ లో ఈ పెళ్లి వేడుక జరగనుందని అన్నారు.

పెళ్లి వేడుక పనులన్నీ తానే స్వయంగా చూసుకుంటున్నారని ఎం ఎస్ రాజు తెలిపారు. కేవలం వంద మంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి వేడుకలు నిర్వహించనున్నామని చెప్పారు. తన కోడలు వివరాలు కూడా చెప్పారు. కాబోయే కోడలి పేరు దీపిక అని వివరించారు. ఆమె లాంటి మంచి అమ్మాయి తన ఇంటి కోడలుగా రావడం తమ అదృష్టమని చెప్పారు. ఆమె అమెరికాలోని డల్లాస్ లో రీసెర్చ్ సైంటిస్టుగా పనిచేస్తుందని చెప్పారు.

హీరో సుమంత్ అశ్విన్ తన తండ్రి రాజు దర్శకత్వంలోనే హీరోగా పరిచయమయ్యాడు. పదేళ్ల కిందట వచ్చిన తూనీగ తూనీగ సినిమాలో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే సినిమా ద్వారా సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ప్రియురాలు రియా చక్రవర్తి హీరోయిన్ గా పరిచయమయ్యింది. ఆ తర్వాత వచ్చిన కేరింత సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అంతకు ముందు ఆ తర్వాత, లవర్స్ వంటి సినిమాలతో పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ తర్వాత సినిమాలకు దూరమయ్యాడు. ఒకటి రెండు సినిమాలు చేసినా కరోనా కారణంగా అవి విడుదలకు నోచుకోలేదు. కరోనా లాక్ డౌన్ తర్వాత మెల్లగా అన్ని సర్దుకుని సాధారణ పరిస్థితులు నెలకొంటున్న సమయంలో  సుమంత్ అశ్విన్ పెళ్లి కబురు చాలా చల్లగా చెప్పాడు. మొత్తానికి సుమంత్ కూడా ఓ ఇంటి వాడవుతున్నాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


జగడ్డ : విశాఖలో తొలి విడతకు కౌంట్ డౌన్...!

అల్లరి నరేష్ కోసం సాయం చేయడానికి మరోసారి ముందుకు వచ్చిన మహేష్ బాబు

అక్క‌డ టీడీపీని కొట్టేందుకు జ‌గ‌న్ న‌యా స్కెచ్... ఆ నేత‌కు ఎమ్మెల్సీ క‌న్‌ఫార్మ్ ?

ఆచార్య బిజినెస్ లెక్క‌లు అన్నీ త‌ప్పులే... వెన‌క ఇంత క‌థ ఉందా ?

వామ్మో....రమ్యకృష్ణతో పోటీకి వస్తున్న సీరియల్ నటి...?

ప్రభాస్ చెల్లి ని ఎప్పుడైనా చూశారా..

త‌మ్ముళ్ల‌కు బాబోరి బంప‌ర్ ఆఫ‌ర్‌... నామినేష‌న్ వేస్తే భారీ న‌జ‌రానా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>