MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/mahesh-babu-helping-his-friend-allari-naresh34210225-1dab-4def-ac72-fdfbc3c7ebd1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/mahesh-babu-helping-his-friend-allari-naresh34210225-1dab-4def-ac72-fdfbc3c7ebd1-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో కామెడీ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగల హీరో. ఒకప్పుడు వరుస సినిమాలతో విజయాలను అందుకుంటూ అదరగొట్టేవాడు. ఆయన సినిమాలు ఈ మధ్య పెద్దగా అలరించలేకపోతున్నాయిmahesh babu;mahesh;ravi;naresh;kumaar;allari naresh;geetha;maharshi;priyadarshi;rajani;ravi anchor;sathish;sharath;cinema;sangeetha;rajani kanth;maharshi 1;producer;music;comedy;producer1;hero;sharrath marar1;allariఅల్లరి నరేష్ కోసం సాయం చేయడానికి మరోసారి ముందుకు వచ్చిన మహేష్ బాబుఅల్లరి నరేష్ కోసం సాయం చేయడానికి మరోసారి ముందుకు వచ్చిన మహేష్ బాబుmahesh babu;mahesh;ravi;naresh;kumaar;allari naresh;geetha;maharshi;priyadarshi;rajani;ravi anchor;sathish;sharath;cinema;sangeetha;rajani kanth;maharshi 1;producer;music;comedy;producer1;hero;sharrath marar1;allariSat, 06 Feb 2021 13:00:00 GMT
చిత్ర పరిశ్రమలో కామెడీ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగల హీరో. ఒకప్పుడు వరుస సినిమాలతో విజయాలను అందుకుంటూ అదరగొట్టేవాడు . ఆయన సినిమాలు ఈ మధ్య పెద్దగా అలరించలేకపోతున్నాయి. ఇక ఈ మధ్య అల్లరి నరేష్ బంగారు బుల్లోడు అనే సినిమాతో వచ్చాడు . ఈ సినిమా కూడా పెద్దగా అలరించలేకపోయింది. తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసిన ఈ టాలెంటెడ్ నటుడు ఇప్పుడు ఒక సరైన హిట్ కోసం ఏంతగానో ఎదురు చూస్తున్నాడు.

ఇక అల్లరి నరేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘నాంది’ . విజయ్‌ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు . సతీష్‌ వేగేశ్న నిర్మాత. ప్రస్తుతం  నిర్మాణ కార్యక్రమాలు నిర్మాణాంతర కార్యక్రమాలు  జరుగుతున్నాయి. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాంది ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయనున్నాడు. మహేష్ అల్లరి నరేష్ కలిసి ‘మహర్షి’లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మహేష్ నరేష్ నాంది సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నాడు. 'నాంది’ ట్రైలర్‌ను మహేష్ శనివారం ఉదయం 10:08 గంటలకు విడుదలచేయనున్నాడు

ఇక ఈ సినిమా నరేష్ గతంలో ‘నేను, గమ్యం’ లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేసి ఉండటంతో ఈ సినిమా కూడ ఆ తరహాలోనే వాస్తవికతకు దగ్గరగా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సినిమాను సతీష్ వేగేశ్న నిర్మించాడు. వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియదర్శిలు కీలక పాత్రలు చేశారు. ఇక సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, నవమి, హరీష్‌ ఉత్తమన్‌, ప్రవీణ్‌, ప్రియదర్శి, దేవీప్రసాద్‌, వినయ్‌వర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరాసిద్‌, సంగీతంశ్రీచరణ్‌  పాకాల, కథ తూమ్‌ వెంకట్‌, సంభాషణలు అబ్బూరి రవి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం విజయ్‌ కనకమేడల వ్యవహరిస్తున్నారు.


ముక్కుదిబ్బడతో ఇబ్బంది పడుతున్నారా.. చిన్ని చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి..?

అక్క‌డ టీడీపీని కొట్టేందుకు జ‌గ‌న్ న‌యా స్కెచ్... ఆ నేత‌కు ఎమ్మెల్సీ క‌న్‌ఫార్మ్ ?

ఆచార్య బిజినెస్ లెక్క‌లు అన్నీ త‌ప్పులే... వెన‌క ఇంత క‌థ ఉందా ?

వామ్మో....రమ్యకృష్ణతో పోటీకి వస్తున్న సీరియల్ నటి...?

ప్రభాస్ చెల్లి ని ఎప్పుడైనా చూశారా..

త‌మ్ముళ్ల‌కు బాబోరి బంప‌ర్ ఆఫ‌ర్‌... నామినేష‌న్ వేస్తే భారీ న‌జ‌రానా ?

కేటీఆర్ సీఎం కాదు... కేసీఆర్ ముందు రెండు అగ్నిప‌రీక్ష‌లు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>