MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monarkh-movie-release-on-may-ending-e235ab1e-8728-423b-a71d-3361429068aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monarkh-movie-release-on-may-ending-e235ab1e-8728-423b-a71d-3361429068aa-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా చరిత్రలో పోటాపోటీగా సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. అటు ఫ్యాన్స్ కూడా వీటి మీద చర్చించుకోవడం, వివాదాలు చెలరేగడం కూడా టాలీవుడ్ మరచిపోదు. అది ఎప్పటి నుంచో వస్తోంది. ఇకపైన కూడా మళ్ళీ మళ్ళీ కూడా వస్తుంది. ఇదిలా ఉంటే 2021 సినిమా పండుగ అని చెప్పాలా జాతర అని చెప్పాలా కూడా అర్ధం కాని పరిస్థితి. monark;chiranjeevi;ravi;venkatesh;balakrishna;boyapati srinu;chinna;tara;tollywood;cinema;festival;industry;blockbuster hit;hero;success;mass;krack;narappaమోనార్క్.. ఖిలాడీ...ఎవరూ తగ్గనంటున్నారు...?మోనార్క్.. ఖిలాడీ...ఎవరూ తగ్గనంటున్నారు...?monark;chiranjeevi;ravi;venkatesh;balakrishna;boyapati srinu;chinna;tara;tollywood;cinema;festival;industry;blockbuster hit;hero;success;mass;krack;narappaSat, 06 Feb 2021 12:00:00 GMTసినిమా చరిత్రలో పోటాపోటీగా సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి.  అటు ఫ్యాన్స్ కూడా వీటి మీద చర్చించుకోవడం, వివాదాలు చెలరేగడం కూడా టాలీవుడ్ మరచిపోదు. అది ఎప్పటి నుంచో వస్తోంది.  ఇకపైన కూడా మళ్ళీ మళ్ళీ కూడా వస్తుంది. ఇదిలా ఉంటే 2021 సినిమా పండుగ అని చెప్పాలా జాతర అని చెప్పాలా కూడా అర్ధం కాని పరిస్థితి.

ఎందుకంటే వరసపెట్టి సినిమాలు అలా క్యూ కట్టేస్తున్నాయి. ధియేటర్లకు సరిపడా సినిమాలు వచ్చేస్తున్నాయి. పెద్దా చిన్నా సినిమాలు అన్నీ కలసి ఈ ఏడాది వందకు పైగా రిలీజ్ అయ్యేలా ఉన్నాయి. వీటిలో అందరి చూపు స్టార్ హీరో సినిమాల మీద పడుతోంది. ఇక మే నెలలో ఓ వైపు సమ్మర్ ఉంటుంది. వేసవి ఎండలతో హీటెక్కిస్తుంది. దానిని రెట్టింపు చేస్తూ మే నేలలో సినిమాలు క్యూ కడుతున్నాయి. అందులో మెగాస్టార్ ఆచార్య, విక్టరీ వెంకటేష్ నారప్ప, బాలయ్య మోనార్క్, రవితేజా ఖిలాడీ మూవీస్ జనాలను అలరించనున్నాయి.

ఇందులో మోనార్క్, ఖిలాడీ మూవీల మధ్య గట్టి పోటీయే నెలకొంది. ఈ రెండు సినిమాలు కూడా ఒకే డేట్ మీద రిలీజ్ అవుతున్నాయి. మే 28న ఈ సినిమాలు రానున్నాయి. మరి ఈ సినిమాల్లో ఏది హిట్టు మరేది సూపర్ హిట్ అవుతుంది అన్న చర్చ అపుడే ఫ్యాన్స్ మధ్యన వస్తోంది. ఇక రవితేజా మాస్ మహారాజా ఆయనకు ఈ ఏడాది క్రాక్ మూవీతో సూపర్ హిట్ పడింది. దాంతో మరో హిట్ కోసం ఖిలాడీగా వస్తున్నాడు. అన్ని రసాలు మేళవించి మరీ మూవీని వదులుతున్నాడు.

మరో వైపు బోయపాటి, బాలయ్యల కాంబో అంటే ఇండస్ట్రీ హిట్ అని అంతా చెబుతారు. వీరిద్దరిదీ సక్సెస్ ఫుల్ జోడీ. అందుకే మోనార్క్ మూవీ మీద అంచనాలు అంబరాన్ని అంటుతున్నాయి.దాంతో ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కూడా ఎక్కడా తగ్గడంలేదు. మరి ఒకే రోజున థియేటర్లను టచ్ చేస్తున్న ఈ మూవీస్ బ్లాక్ బస్టర్ కావాలని ఇండస్ట్రీ కూడా కోరుకుంటోంది.




జగడ్డ: చిత్తూరులో టీడీపీ బంఫర్ ఆఫర్..ఒక్క నామినేషన్ కు అంతనా?

వామ్మో....రమ్యకృష్ణతో పోటీకి వస్తున్న సీరియల్ నటి...?

త‌మ్ముళ్ల‌కు బాబోరి బంప‌ర్ ఆఫ‌ర్‌... నామినేష‌న్ వేస్తే భారీ న‌జ‌రానా ?

కేటీఆర్ సీఎం కాదు... కేసీఆర్ ముందు రెండు అగ్నిప‌రీక్ష‌లు...!

జగడ్డ : జగనోరు మీ మాట వల్ల ప్రజలకు ఒరిగిందేంటి ??

త్రివిక్రమ్‌ పై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ గుర్రు అందుకేనా ?

నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>