MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/actually-mahesh-babu-got-so-much-damage-compared-to-raviteja-236533f0-171a-4010-a85b-44374410d6cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/actually-mahesh-babu-got-so-much-damage-compared-to-raviteja-236533f0-171a-4010-a85b-44374410d6cb-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమలో అక్కడక్కడ కొన్ని సినిమాల విషయమై జరిగే ఊహించని ఘటనలు ఎప్పటికీ అటు సినిమా పరిశ్రమ వారితో పాటు,ఇటు ప్రేక్షకుల మనసుల్లో కూడా నిలిచిపోతాయి అనే చెప్పాలి. ఇక ఇప్పుడు మనం ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, సరిగ్గా పదిహేనేళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సైనికుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అప్పట్లో ఎంతో భారీ ఖర్చుతో ఈ మూవీ ని అశ్వినీ దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.mahesh babu latest;mahesh;ravi;gunasekhar;rajani;ravi anchor;ravi teja;vyjayanthi;industries;cinema;rajani kanth;audience;industry;success;pokiri;aswani dutt;krackప్చ్, పాపం.. రవితేజ కు జరిగిన నష్టంతో పోలిస్తే...... మహేష్ కి జరిగింది చాలా ఎక్కువ ......??ప్చ్, పాపం.. రవితేజ కు జరిగిన నష్టంతో పోలిస్తే...... మహేష్ కి జరిగింది చాలా ఎక్కువ ......??mahesh babu latest;mahesh;ravi;gunasekhar;rajani;ravi anchor;ravi teja;vyjayanthi;industries;cinema;rajani kanth;audience;industry;success;pokiri;aswani dutt;krackSat, 06 Feb 2021 04:00:00 GMTసినిమా పరిశ్రమలో అక్కడక్కడ కొన్ని సినిమాల విషయమై జరిగే ఊహించని ఘటనలు ఎప్పటికీ అటు సినిమా పరిశ్రమ వారితో పాటు,ఇటు ప్రేక్షకుల మనసుల్లో కూడా నిలిచిపోతాయి అనే చెప్పాలి. ఇక ఇప్పుడు మనం ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, సరిగ్గా పదిహేనేళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సైనికుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అప్పట్లో ఎంతో భారీ ఖర్చుతో ఈ మూవీ ని అశ్వినీ దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

అయితే ఈ సినిమా సరిగ్గా రిలీజ్ రోజున బాక్స్ లు సమయానికి థియేటర్స్ కి చేరకపోవడంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. అంతకుముందు పోకిరి మూవీతో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన మహేష్ బాబు ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలనే ఆలోచనతోనే కొందరు అప్పట్లో సైనికుడు మూవీ బాక్స్ లు టైం కు రాకుండా ఆపేశారు అంటూ ఆ సమయంలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. అయితే బాక్స్ లు లేట్ గా రావడం, అలానే సినిమా కూడా ఆశించిన రేంజ్ లో లేకపోవడంతో ఆ మూవీని ఆడియన్స్ ఒక్కసారిగా భారీగా త్రిప్పికొట్టారు. ఇక ఇటీవల రవితేజ నటించిన క్రాక్ మూవీ విషయంలో కొద్దిపాటి సమస్యల వలన ఆ సినిమా కూడా లేట్ గా సాయంత్రం షోల నుండి ప్రదర్శితం అయింది.

అయితే అది మాత్రం మంచి కంటెంట్ తో తెరకెక్కడంతో బాగా సక్సెస్ సాధించింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని, అటు మహేష్, ఇటు రవితేజ సినిమాల విషయమై ఎవరు అలా చేశారు, ఎందుకు చేశారు అనే విషయాలు ప్రక్కన పెడితే, ఆ రెండిటి లో అప్పట్లో మహేష్ పై మాత్రం భారీగా కొంత ఇండస్ట్రీ లో కుట్ర జరిగిందని, అందుకే ఆ మూవీ ని టైంకి కావాలనే రిలీజ్ కానివ్వలేదని, దానితో ఒకింత యావరేజ్ కంటెంట్ కలిగిన సైనికుడు మూవీ భారీ ఫ్లాప్ కావలసి వచ్చిందని, ఈ విధంగా రవితేజ కంటే మహేష్ కె ఎక్కువగా డ్యామేజ్ జరిగిందని ఇప్పటికీ కొందరు మహేష్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా అభిప్రాయపడుతున్నారు.......!!


హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు, నిమ్మగడ్డపై తమ్ముళ్ళు మండిపోతున్నారా ?

అన్నయ్య రంగంలోకి దిగితే.. రికార్డులన్ని సైడ్ ఇవ్వాల్సిందే..!

RRR సీక్వల్ రాజమౌళి మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!

అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>