Crimeyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/police-arrested-a-43-year-old-person-for-posting-threatening-post-on-prime-minister76c551d2-1735-4c36-b456-cb98d738d17f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/police-arrested-a-43-year-old-person-for-posting-threatening-post-on-prime-minister76c551d2-1735-4c36-b456-cb98d738d17f-415x250-IndiaHerald.jpg5 కోట్లిస్తారా.. ప్రధాని మోదీని చంపేస్తా..' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధానిని అవమానిస్తూ పోస్టులు పెట్టడం వల్లే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. పుదుచ్చేరిలోని అరియన్‌కుప్పం గ్రామంలో..narendra modi;patti;police;facebook;village;court;prime minister;chennai;local language'5 కోట్లిస్తే మోదీని చంపేస్తా..' అంటూ.. పోస్టు.. పోలీసులు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారుగా..'5 కోట్లిస్తే మోదీని చంపేస్తా..' అంటూ.. పోస్టు.. పోలీసులు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారుగా..narendra modi;patti;police;facebook;village;court;prime minister;chennai;local languageSat, 06 Feb 2021 14:01:10 GMT

చెన్నై: '5 కోట్లిస్తారా.. ప్రధాని మోదీని చంపేస్తా..' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధానిని అవమానిస్తూ పోస్టులు పెట్టడం వల్లే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. పుదుచ్చేరిలోని అరియన్‌కుప్పం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 


పాపులారిటీ కోసం, ఒక్కసారిగా గుర్తింపు తెచుకోడం కోసం ఈ మధ్య కాలంలో ఇలాంటి పోస్టులు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా సెలెబ్రిటీలను టార్గెట్ చేస్తూ కొంతమంది ఇలాంటి పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలొనే ఓ వ్యక్తి ఎకంగా ప్రధానినే టార్గెట్ చేశాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కి జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.


వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరిలోని అరియన్‌కుప్పం గ్రామంలోని మణ్‌వెళి ప్రాంతంలో సత్యానందంగా (43) అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఉంటున్నాడు. అతడు ఎప్పుడూ బీజేపీకి వ్యతిరేకంగా, మోదీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య ‘ఎవరైనా నాకు రూ.5 కోట్లు ఇస్తే ప్రధాని మోదీని చంపేందుకు నేను సిద్ధంగా ఉన్నా. రూ.5 కోట్లు ఇచ్చేందుకు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా?’ అని అతడు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేశాడు. 


ఈ పోస్టును ఓ కారు డ్రైవరు గుర్తించాడు. వెంటనే సత్యానందంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ పోస్టును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సత్యానందంను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. అతడిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. నిందితుడిని జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంచాలని పోలీసులను ఆదేశించింది.


ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. రూ.5 కోట్లిస్తే మోదీని చంపుతానని 43ఏళ్ల సత్యానంద పోస్టు చేశాడని, దానిపై తమకు ఫిర్యాదు రావడంతో దర్యాప్తు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. సత్యానంద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని, అతడి ఇతర పోస్టులపై కూడా దృష్టి సారించామని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన అనంతరం సత్యానందను గురువారం స్థానిక కోర్టులో హాజరుపరిచామని తెలిపారు.




జగడ్డ : విశాఖలో తొలి విడతకు కౌంట్ డౌన్...!

అల్లరి నరేష్ కోసం సాయం చేయడానికి మరోసారి ముందుకు వచ్చిన మహేష్ బాబు

అక్క‌డ టీడీపీని కొట్టేందుకు జ‌గ‌న్ న‌యా స్కెచ్... ఆ నేత‌కు ఎమ్మెల్సీ క‌న్‌ఫార్మ్ ?

ఆచార్య బిజినెస్ లెక్క‌లు అన్నీ త‌ప్పులే... వెన‌క ఇంత క‌థ ఉందా ?

వామ్మో....రమ్యకృష్ణతో పోటీకి వస్తున్న సీరియల్ నటి...?

ప్రభాస్ చెల్లి ని ఎప్పుడైనా చూశారా..

త‌మ్ముళ్ల‌కు బాబోరి బంప‌ర్ ఆఫ‌ర్‌... నామినేష‌న్ వేస్తే భారీ న‌జ‌రానా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>