PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections9a36bb90-5976-4de0-86f7-4cf0a2baf2a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections9a36bb90-5976-4de0-86f7-4cf0a2baf2a8-415x250-IndiaHerald.jpgటీడీపీని నిలబెట్టేందుకు నిమ్మగడ్డ ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పిన ఆయన అధికారంలో ఉన్నమంత్రులు తప్పు చేస్తే సీఎం లేదా సీఎస్‌కు లేఖ రాయాలి. కానీ నిమ్మగడ్డ గవర్నర్‌కు లేఖ రాయడం ఆశ్చర్యంగా ఉంది అన్నారు. ప్రివిలేజ్ కమిటీ ఆదేశిస్తే నిమ్మగడ్డ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. jagan-nimmagadda-elections;cbn;kumaar;choudary actor;andhra pradesh;రాజీనామా;peddireddy ramachandra reddy;panchayati;minister;election;letter;tdp;reddy;partyజగడ్డ: ఎస్ఈసి పదవికి నిమ్మగడ్డ రాజీనామా చెయ్యాలి...?జగడ్డ: ఎస్ఈసి పదవికి నిమ్మగడ్డ రాజీనామా చెయ్యాలి...?jagan-nimmagadda-elections;cbn;kumaar;choudary actor;andhra pradesh;రాజీనామా;peddireddy ramachandra reddy;panchayati;minister;election;letter;tdp;reddy;partySat, 06 Feb 2021 09:00:00 GMTఆంధ్ర ప్రదేశ్ అధికార పార్టీ వర్సెస్ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి వైరం కొనసాగుతోంది. ఈ వివాదానికి తెర తీసిన పంచాయతీ ఎలక్షన్స్ ఘాటు ఇప్పట్లో తగ్గేలా లేదు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నిమ్మగడ్డ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ.. చంద్రన్న కనుసైగ లో నడుస్తున్నారన్న నిజాన్ని మరోసారి రుజువు చేశారన్నారు. టీడీపీని  బతికించేందుకు నిమ్మగడ్డ శతవిధాలా ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు పెద్ది రెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోని ఇప్పుడు రద్దు చేయడం వల్ల ప్రయోజనం ఏంటి అని సూటిగా ప్రశ్నించారు.

చర్యలు తీసుకోవాల్సిన సమయంలో సహనంగా ఆలోచించడం ఎంతవరకు సమంజసమన్నారు. మేనిఫెస్టో అంశంపై ఎస్ఈసి అధికారిగా చంద్రబాబు పై వెంటనే చర్యలు తీసుకోవడం నిమ్మగడ్డ  కర్తవ్యం. కానీ అలా చేయకుండా మేనిఫెస్టో రద్దు చేయడం వల్ల ఉపయోగం ఏమిటో చెప్పాలన్నారు. మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని ప్రశ్నించారు పెద్ది రెడ్డి. ఎస్‌ఈసీ యాప్‌ను వాడొద్దని హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓటు కూడా నమోదు చేయడం తెలియని వ్యక్తి ఎస్ఈసి ఎలా అయ్యారో..?? అర్థం కావడం లేదు అంటూ ఎద్దేవా చేశారు.

కోర్టు తీర్పుతో ఎస్‌ఈసీ పదవికి నిమ్మగడ్డ రాజీనామా చేయాలి అని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. ఏకగ్రీవాలను పలు రకాలుగా తప్పు పడుతున్నారు. కానీ ఏకగ్రీవాలు చట్టవిరుద్ధమని ఏ చట్టంలో ఉందో చెప్పాలంటూ ధ్వజ మెత్తారు పెద్ది రెడ్డి. ఏకగ్రీవాలన్నవి ఎప్పటినుండో వస్తున్నాయి.. మా స్వార్థం కోసం సృష్టించబడింది కాదు. ప్రజల క్షేమమే మా ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు ఆయన. చంద్రబాబుకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేందుకే నిమ్మగడ్డ పని చేస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. గుంటూరు, చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలు ఏ  ఆధారంగా ఆపేస్తారు.

టీడీపీని నిలబెట్టేందుకు నిమ్మగడ్డ ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పిన ఆయన అధికారంలో ఉన్నమంత్రులు తప్పు చేస్తే సీఎం లేదా సీఎస్‌కు లేఖ రాయాలి. కానీ నిమ్మగడ్డ గవర్నర్‌కు లేఖ రాయడం ఆశ్చర్యంగా ఉంది అన్నారు. ప్రివిలేజ్ కమిటీ ఆదేశిస్తే నిమ్మగడ్డ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ సందర్భంగా అధికారులను హెచ్చరించారు పెద్ది రెడ్డి. నిమ్మగడ్డ మాటలు విని అక్రమాలకు సహకరిస్తే సహించేది లేదన్నారు. మనం పని చేయాల్సింది ప్రజల కోసం అన్న విషయాన్ని ప్రతిక్షణం గుర్తు పెట్టుకోవాలని సూచించారు పెద్ది రెడ్డి. దీనిపై నిమ్మగడ్డ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.


బీజేపీకి కోలుకోని దెబ్బ ప‌డిపోయిందిగా.. మొఖం ఎక్క‌డ పెట్టుకుంటారు ?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!

టీడీపీలో కొత్త జోష్‌.. ఈ నేత‌ల్లో ఇంత స‌డెన్ చేంజ్ ఏంటి ?

హెరాల్డ్ స్మ‌రామీ : దేశం గ‌ర్వించ‌ద‌గిన‌ చిత్ర‌కారుడు దామెర్ల‌... తెలుగువాడ‌ని మీకు తెలుసా..?!

ఆ కమ్మ నేతలు వైసీపీకి డ్యామేజ్ చేస్తారా ?

జగడ్డ: విజయనగరం జిల్లాలో గెలుపు కోసం బొత్స మాస్టర్‌ ప్లాన్..?

ఆ మూడు చోట్ల జగన్‌ని కాపు కాస్తారా ? పవన్‌ని కాచుకుంటారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>