PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ganta-srinivas-raode908e2e-1c20-402e-a8d0-e0353115060a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ganta-srinivas-raode908e2e-1c20-402e-a8d0-e0353115060a-415x250-IndiaHerald.jpgగంటా శ్రీనివాస రావు రాజీనామాపై భిన్న వాదనలు వస్తున్నాయి. రాజీనామా లేఖను లెటర్ ప్యాడ్‌పై స్వయంగా రాసి, స్పీకర్ తమ్మినేని సీతారాంకు పంపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ పరిరక్షణ కోసం రాజీనామా చేస్తున్నానని, ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత రాజీనామాను ఆమోదించాలని కోరారుganta srinivas rao;amala akkineni;tammineni sitaram;andhra pradesh;thammineni seetharam;రాజీనామా;vishakapatnam;assembly;mla;minister;letter;tdp;central government;partyగంటా రాజీనామా ఉత్తదేనా?గంటా రాజీనామా ఉత్తదేనా?ganta srinivas rao;amala akkineni;tammineni sitaram;andhra pradesh;thammineni seetharam;రాజీనామా;vishakapatnam;assembly;mla;minister;letter;tdp;central government;partySat, 06 Feb 2021 19:31:21 GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీలో నిరసన జోరందుకున్నాయి. విశాఖ వాసులైతే రగిలిపోతున్నారు. ఆంధ్రుల హక్కుగా పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం మానుకోవాలంటూ రోడ్డెక్కుతున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతుగా విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు  రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాశారు. గంటా రాజీనామాతో ఏపీ రాజకీయాలు గరంగరంగా మారాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్తిగా గెలిచిన గంటా శ్రీనివాస రావు... కొంత కాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. టీడీపీకి రాజీనామా చేయకున్నా.. ఆ పార్టీ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనడం లేదు.

  అయితే గంటా శ్రీనివాస రావు రాజీనామాపై భిన్న వాదనలు వస్తున్నాయి. రాజీనామా లేఖను లెటర్ ప్యాడ్‌పై స్వయంగా రాసి, స్పీకర్ తమ్మినేని సీతారాంకు పంపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ పరిరక్షణ కోసం రాజీనామా చేస్తున్నానని, ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత రాజీనామాను ఆమోదించాలని కోరారు. అయితే రాజీనామా చేయాలంటే దానికి ఓ ఫార్మాట్ ఉంటుంది. లేఖలో ఎలాంటి కారణాలు చెప్పకూడదు. తాను రాజీనామా చేస్తున్నట్లు ఆ ఒక్క వ్యాక్యం మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. కానీ గంటా మాత్రం తాను స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అది సాంకేతికంగా చెల్లుబాటు కాదని నిపుణులు అంటున్నారు.

    రాజీనామా లేఖ ఎలా ఉన్నా అసెంబ్లీ స్పీకర్ విచక్షాధికారంతో నిర్ణయం తీసుకోవచ్చని కొందరు చెబుతున్నారు. స్పీకర్ కార్యాలయానికి లేఖ అందిన తర్వాత... గంటాను స్పీకర్ ప్రత్యక్షంగా కలిసి, అభిప్రాయం తెలుసుకునే అవకాశం ఉంది. అప్పుడు కూడా రాజీనామాకు కట్టుబడి ఉంటే.. రాజీనామాను ఆమోదిస్తారు. లేదా అక్కడి వరకు అవసరం లేదుకుంటే ఫార్మాట్‌లో లేని కారణంగా రాజీనామాను తిరస్కరించవచ్చు. అయితే గంటా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే కావున,  ఉప ఎన్నిక కావాలని అధికార పార్టీ అనుకంటే స్పీకర్ విచక్షణాధికారంతో రాజీనామాను ఆమోదించే అవకాశం ఉంది. తన లేఖలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పూర్తైన తర్వాత ఆమోదించాలని గంటా కోరారు. అది  అంత త్వరగా జరిగే పనికాదని చెబుతున్నారు. మొత్తంగా గంటా రాజీనామా ఉత్తదిగానే మిగిలిపోయే అవకాశం ఉందంటున్నారు.





పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?

ఉప్పెనకు మెగా బూస్టింగ్.. రంగంలోకి దిగుతున్న మెగాస్టార్..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు

ఆరు గదులు.. రెండు బెడ్ రూమ్లు.. గంగవ్వ కొత్తిల్లు ఎలా ఉండబోతుంది..!

అఖిల్ ష్యూర్ షాట్ హిట్ కొడుతున్నాడా.. అంత కాన్ఫిడెన్స్ ఎందుకో..!

సుకుమార్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు లకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టిన దేవిశ్రీప్రసాద్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>