Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/aabaranalu49cf5a9f-7fad-492f-8200-91384d67ad48-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/aabaranalu49cf5a9f-7fad-492f-8200-91384d67ad48-415x250-IndiaHerald.jpg ఆభరణాలు అంటే ఇష్టపడని మహిళలు ఉండరు. స్త్రీలకు అన్నిటికన్నా ఆభరణాలంటే ఇష్టం. ఆభరణాలపై దుమ్ము,ధూళి అలాంటివి ఏవైనా ఉంటే వాటిని శుభ్రం చేయడానికి కొన్ని చిట్కాలు ఉపయోగిస్తే వాటిని శుభ్రం చేయవచ్చు. ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.. aabaranalu;oil;silver;makeupఈ చిట్కాలు ఉపయోగించి ఆభరణాలను శుభ్రం చేయవచ్చు.. ఎలా అంటే..?ఈ చిట్కాలు ఉపయోగించి ఆభరణాలను శుభ్రం చేయవచ్చు.. ఎలా అంటే..?aabaranalu;oil;silver;makeupSat, 06 Feb 2021 06:00:00 GMT
 వెండి ఆభరణాలు నల్లగా మారితే వాటిని అగర్బత్తి ల బూడిదతో తోమడం వల్ల శుభ్రపడటమే కాకుండా,తల తల మెరుస్తూ ఉంటాయి.

 ముత్యాలను ఆలివ్ ఆయిల్ లో ముంచిన దూదితో తుడవడం వల్ల ముత్యాలు మెరుస్తూ ఉంటాయి.                       

 బంగారు గొలుసు చిక్కుబడి విడదీయడానికి రాకుంటే గొలుసు మీద పౌడర్ చెల్లి తేలికగా విడగొట్టవచ్చు.

 పాతబడిన బంగారు నగలను టూత్ బ్రష్ తీసుకొని సబ్బును ఉపయోగించి శుభ్రం చేయడం వల్ల తళతళా మెరుస్తాయి.

 ముత్యాల ఆభరణాలను ఎక్కువగా వాడేవాళ్ళు వాడిన తర్వాత తీసి వేసేటప్పుడు మెత్తటి వస్త్రము తీసుకొని తుడిచి పెట్టడం వల్ల ఆభరణాలపై చెమట, మేకప్ లో వాడే రసాయనాలు అంటిన ముత్యాలు రంగు మారకుండా ఉంటాయి.

 వెండి ఆభరణాలు నల్లగా మారిన పుడు ఉప్పు కలిపిన నీటిలో బాగా ఉడకబెట్టాలి.తర్వాత చల్లని నీటితో కడగాలి. అప్పుడు ఆభరణాలు మెరుస్తూ ఉంటాయి.

 ముత్యాల ఆభరణాలు మెరుపు పోకుండా ఉండాలంటే ఎరుపు పట్టు వస్త్రంలో పెట్టి ఉంచడం వల్ల మెరుపు తగ్గకుండా ఉంటాయి.

 ముత్యాలను ఎత్తి పెట్టకుండా తరచూ వాడడం వల్ల రంగు మారకుండా ఉంటాయి. ఎందుకంటే చర్మము దానికి కావలసిన తేమను, నూనెను అందిస్తుంది.

 బంగారు ఆభరణాలను శుభ్రం చేయడానికి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకొని ఒక గిన్నెలో పోసి బాగా మరగనివ్వాలి. ఎక్కువ వేడి లేకుండా చూసుకోవాలి. అందులోకి షాంపు వేసి ఆ నీటిలో కి బంగారు ఆభరణాలు వేయాలి. నీరు చల్లబడిన తర్వాత ఆ నగలను టూత్ బ్రష్ తో శుభ్రం చేయడం వల్ల మెరుస్తూ ఉంటాయి.


ఒక్క గ్లాస్ నిమ్మరసం తాగడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!?

అన్నయ్య రంగంలోకి దిగితే.. రికార్డులన్ని సైడ్ ఇవ్వాల్సిందే..!

RRR సీక్వల్ రాజమౌళి మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!

అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>