PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections9c4d2b0f-31e6-4ff6-a313-c5ee30c72d1d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections9c4d2b0f-31e6-4ff6-a313-c5ee30c72d1d-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో పంచాయతీలు వాటి కధలు వేరేగా ఉంటాయి. మరి అలాంటిది అసలైన పంచాయతీ ఎన్నికలు వస్తే కధ పూర్తిగా కొత్తగానే ఉంటుంది. అందునా ఆయన పంచాయతీ శాఖ మంత్రి. దాంతో వెరీ పవర్ ఫుల్. మొత్తానికి చిత్తూరు పెద్దిరెడ్డి ఇపుడు టాక్ ఆఫ్ ద ఎలెక్షన్ అయిపోయారు. jagan-nimmagadda-elections;cbn;amala akkineni;2019;panchayati;court;minister;arrest;tdp;ycpజగడ్డ : చిత్తూరు పెద్దిరెడ్డి...వెరీ పవర్ ఫుల్ ?జగడ్డ : చిత్తూరు పెద్దిరెడ్డి...వెరీ పవర్ ఫుల్ ?jagan-nimmagadda-elections;cbn;amala akkineni;2019;panchayati;court;minister;arrest;tdp;ycpSat, 06 Feb 2021 13:38:08 GMTపంచాయతీ ఎన్నికలు వస్తే కధ పూర్తిగా కొత్తగానే ఉంటుంది. అందునా ఆయన పంచాయతీ శాఖ మంత్రి. దాంతో వెరీ పవర్ ఫుల్. మొత్తానికి చిత్తూరు పెద్దిరెడ్డి ఇపుడు టాక్ ఆఫ్ ద ఎలెక్షన్ అయిపోయారు.

ఏపీలో మొత్తం పంచాయతీలలో 525 ఏకగ్రీవం అయితే అందులో మేజర్ వాటా పెద్దిరెడ్డిదే. ఇక రాయలసీమలో వైసీపీకి పెద్ద దిక్కు కూడా ఆయనే. అంతెందుకు చంద్రబాబుకు కంట్లో నలుసు ఆయనే. చంద్రబాబు బ్యాచ్ కి చెందిన పెద్దిరెడ్డి 1978 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకు బాబు పట్లూ గుట్లూ మొత్తం తెలుసు. ఇద్దరూ చిత్తూరు వారే. దాంతో టీడీపీని చిత్తు చేసే పనిలో 2019 ఎన్నిలలో ఘన విజయం సాధించిన పెద్దిరెడ్డి పంచాయతీ పోరులో కూడా అదే దూకుడు చూపుతున్నారు.

ఈ నేపధ్యంలో ఆయన్ని హౌజ్ అరెస్ట్ చేయాలంటూ ఎన్నికల సంఘం తాజాగా  ఆదేశాలు జారీ చేయడంతో  సంచలనం రేపుతోంది.  పెద్దిరెడ్డిని ఈ నెల 21 వరకూ ఇంటి గడప దాటకుండా చూడాలని ఎన్నికల సంఘం రాష్ట్ర డీజీపీని  ఆదేశించింది. మరి ఈ ఆదేశాలు చాలా పెద్ద  సంచలనం అనే చెప్పాలి. ఒక రాష్ట్ర మంత్రిని అందునా ఆయన శాఖకు సంబంధించి జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో గృహ నిర్బంధం చేయమనడం అంటే ఇది అతి పెద్ద నిర్ణయమే అని చెప్పాలి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తుందా, లేక హై కోర్టులో సవాల్ చేస్తుందా అన్నది చూడాలి. మొత్తానికి పెద్దిరెడ్డి వెరీ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారా. మరో వైపు చూసుకుంటే ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా కధ సాగుతోంది. ఈ పంచాయతీ ఎన్నికలు రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కచ్చితంగా తమదే కావాలి అన్న పంతంతో సాగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ రూపంలో భారీ షాక్ వైసీపీ సర్కార్ కి తగిలింది అని చెప్పాలి.







జగడ్డ : విశాఖలో తొలి విడతకు కౌంట్ డౌన్...!

అల్లరి నరేష్ కోసం సాయం చేయడానికి మరోసారి ముందుకు వచ్చిన మహేష్ బాబు

అక్క‌డ టీడీపీని కొట్టేందుకు జ‌గ‌న్ న‌యా స్కెచ్... ఆ నేత‌కు ఎమ్మెల్సీ క‌న్‌ఫార్మ్ ?

ఆచార్య బిజినెస్ లెక్క‌లు అన్నీ త‌ప్పులే... వెన‌క ఇంత క‌థ ఉందా ?

వామ్మో....రమ్యకృష్ణతో పోటీకి వస్తున్న సీరియల్ నటి...?

ప్రభాస్ చెల్లి ని ఎప్పుడైనా చూశారా..

త‌మ్ముళ్ల‌కు బాబోరి బంప‌ర్ ఆఫ‌ర్‌... నామినేష‌న్ వేస్తే భారీ న‌జ‌రానా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>