PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-modi4a5a48dd-db9c-4cc2-931c-a716645d491f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-modi4a5a48dd-db9c-4cc2-931c-a716645d491f-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం మీద ఎట్టకేలకు జగన్ నోరు విప్పారు. ఈ అంశం మీద కొద్దిసేపటి క్రితం ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని ఆయన లేఖలో మోడీని కోరారు. ప్లాంట్ ను బలోపేతం చేయడానికి మార్గాల్ని అన్వేషించాలని జగన్ కోరారు. విశాఖ ఉక్కు ద్వారా సుమారు 20వేలమంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని, అలానే పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లారు. విశాఖ ఉక్కు – ఆంధ్రు హక్కjagan modi;modi;jagan;andhra pradesh;vishakapatnam;prime minister;letter;central governmentబ్రేకింగ్ : విశాఖ స్టీల్ అంశం మీద మోడీకి జగన్ లేఖబ్రేకింగ్ : విశాఖ స్టీల్ అంశం మీద మోడీకి జగన్ లేఖjagan modi;modi;jagan;andhra pradesh;vishakapatnam;prime minister;letter;central governmentSat, 06 Feb 2021 21:36:56 GMTఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం మీద ఎట్టకేలకు జగన్ నోరు విప్పారు. ఈ అంశం మీద కొద్దిసేపటి క్రితం ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని ఆయన లేఖలో మోడీని కోరారు. ప్లాంట్ ను బలోపేతం చేయడానికి మార్గాల్ని అన్వేషించాలని జగన్ కోరారు. విశాఖ ఉక్కు ద్వారా సుమారు 20వేలమంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని, అలానే పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లారు. విశాఖ ఉక్కు – ఆంధ్రు హక్కు నినాదంతో దశాబ్దం కాలంపాటు ప్రజలు పోరాటం చేశారని అలా ప్రజల పోరాట ఫలితంగా స్టీల్‌ఫ్యాక్టరీ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 

ఈ  ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారనే విషయాన్ని జగన్ మోడీ దృష్టికి తీసుకు వెళ్లారు. 2002–2015 మధ్య వైజాగ్‌స్టీల్‌ మంచి పనితీరు కనపరిచిందని కానీ ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్లాంటుకు కష్టాలు వచ్చాయని అన్నారు.  ప్లాంటు పరిధిలో 19700 ఎకరాల విలువైన భూములున్నాయని, ఈ భూముల విలువే దాదాపు రూ.లక్ష కోట్లు ఉంటుందని ఆయన ప్రధాని దృష్టికి తీసుకు వెళ్ళారు. స్టీల్‌ ప్లాంటుకు సొంతంగా గనులు లేవని పెట్టుబడుల ఉపసంహరణకు బదులు అండగా నిలబడ్డం ద్వారా ప్లాంటును మళ్లీ ప్రగతిబాటలోకి తీసుకెళ్లవచ్చని ఆయన సూచించారు.

7.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యం ఉన్నప్పటికీ 6.3 మిలియన్నులు మాత్రమే ఏడాదికి ఉత్పత్తిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్‌ 2020లో రూ.200 కోట్ల లాభం కూడా వచ్చిందని వచ్చే రెండేళ్లలో ఇదే పరిస్థితి కొనసాగితే... ప్లాంట్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని జగన్ పేర్కొన్నారు. బైలదిల్లా గనుల నుంచి మార్కెట్‌ ఖరీదుకు ముడి ఖనిజాన్ని ప్లాంటు కొనుగోలు చేస్తోందని దాదాపు టన్ను ముడి ఖనిజాన్ని రూ. 5,260 చొప్పున కొనుగోలు చేస్తోందని ఆయన అన్నారు.

దీనివల్ల వైజాగ్‌ స్టీల్స్‌కు టన్నుకు అదనంగా రూ. 3,472లు చొప్పున భారం పడుతోందని ఆయన అన్నారు. సెయిల్‌ కు సొంతంగా గనులు ఉన్నాయన్న ఆయన దాదాపు 200 ఏళ్లకు సరిపడా నిల్వలు సెయిల్‌కు ఉన్నాయని అన్నారు. వైజాగ్‌ స్టీల్స్‌ కు సొంతంగా గనులు కేటాయించడంద్వారా పోటీ పరిశ్రమలతో సమాన స్థాయికి తీసెకెళ్లొచ్చని ఆయన జగన్ పేర్కొన్నారు. ఇక ఇప్పటి దాకా జగన్ ప్రోద్బలంతోనే కేంద్రం ఇలా చేస్తోందని విమర్శల నేపధ్యంలో జగన్ సమాధానం ఇచ్చినట్టయింది. 


కే‌టి‌ఆర్ ట్వీట్ పై సెటైర్లు వేస్తున్న నెటిజన్స్ ..!!

పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?

విడుదలకు ముందే 'బాహుబలి 2' రికార్డ్స్ బ్రేక్ చేసిన 'RRR'...!!

మహాభారత కాలంలొ అక్రమ సంభందాలు

ఉప్పెనకు మెగా బూస్టింగ్.. రంగంలోకి దిగుతున్న మెగాస్టార్..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>