PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-on-vizag-steel-plantef6e3cf5-4442-4fe5-adc7-135c6c92f0e6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-on-vizag-steel-plantef6e3cf5-4442-4fe5-adc7-135c6c92f0e6-415x250-IndiaHerald.jpgవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాసారు. 28 మంది వైకాపా ఎంపీలు ఉండి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో విఫలమయ్యారు అని ఆయన ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారు అని అన్నారు. 28 మంది ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి కనీస కేటాయింపులు సాధించలేకపోయారు అని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోకపోవడం విస్మయానికి గురిచేసింnara lokesh;lokesh;jagan;nara lokesh;andhra pradesh;vishakapatnam;chief minister;iron;letter;tdp;central government;lokesh kanagaraj;reddyజగన్ కు లోకేష్ బిగ్ రిక్వస్ట్... లెటర్ కూడాజగన్ కు లోకేష్ బిగ్ రిక్వస్ట్... లెటర్ కూడాnara lokesh;lokesh;jagan;nara lokesh;andhra pradesh;vishakapatnam;chief minister;iron;letter;tdp;central government;lokesh kanagaraj;reddySat, 06 Feb 2021 14:00:00 GMTవిశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాసారు. 28 మంది వైకాపా ఎంపీలు ఉండి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో విఫలమయ్యారు అని ఆయన ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి న్యాయం జరుగుతుందని  ప్రజలు భావించారు అని అన్నారు. 28 మంది ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి కనీస కేటాయింపులు సాధించలేకపోయారు అని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను అడ్డుకోకపోవడం విస్మయానికి గురిచేసింది అని ఆయన అన్నారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ రాష్ట్ర ప్రజలు విశాఖ స్టీల్ ప్లాంట్ ని పోరాడి సాధించుకున్నారు అని ఆయన తెలిపారు. ఎంతో మంది త్యాగాల ప్రతిఫలం విశాఖ స్టీల్ ప్లాంట్ అని ఆయన అన్నారు. సుమారుగా 40 వేలమంది  ప్రత్యక్షంగానూ,లక్షలాదిమంది పరోక్షంగానూ ఉపాధి పొందుతున్నారు అని ఆయన అన్నారు. 2000 సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నప్పుడు నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో సంప్రదింపులు చేసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ పోరాడారు అని లేఖలో ప్రస్తావించారు.

ఛత్తీస్ ఘడ్ లోని నాగర్నార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కొనుగోలు చెయ్యడానికి అసెంబ్లీలో  ఏకగ్రీవ తీర్మానం చేసింది అని ఆయన తెలిపారు. అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందంటూ  అని అసెంబ్లీలో  ఏకగ్రీవ తీర్మానం చేసి స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్న లక్షలాదిమందికి భరోసా కల్పించాలి అన్నారు. ఇంత పెద్ద ఉక్కు ఫ్యాక్టరీకి సొంత కాప్టివ్ ఐరన్ ఓర్ ఖనిజ వ్యవస్థ లేకపోవడం వలనే నష్టాలు వస్తున్నాయన్నారు.


జగడ్డ : విశాఖలో తొలి విడతకు కౌంట్ డౌన్...!

అల్లరి నరేష్ కోసం సాయం చేయడానికి మరోసారి ముందుకు వచ్చిన మహేష్ బాబు

అక్క‌డ టీడీపీని కొట్టేందుకు జ‌గ‌న్ న‌యా స్కెచ్... ఆ నేత‌కు ఎమ్మెల్సీ క‌న్‌ఫార్మ్ ?

ఆచార్య బిజినెస్ లెక్క‌లు అన్నీ త‌ప్పులే... వెన‌క ఇంత క‌థ ఉందా ?

వామ్మో....రమ్యకృష్ణతో పోటీకి వస్తున్న సీరియల్ నటి...?

ప్రభాస్ చెల్లి ని ఎప్పుడైనా చూశారా..

త‌మ్ముళ్ల‌కు బాబోరి బంప‌ర్ ఆఫ‌ర్‌... నామినేష‌న్ వేస్తే భారీ న‌జ‌రానా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>