PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsf8cdeb53-d929-431a-8be1-9bf2c37526a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsf8cdeb53-d929-431a-8be1-9bf2c37526a9-415x250-IndiaHerald.jpgపంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగునకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల 9వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం ఆరింటి నుంచే పోలింగ్ మొదలుకానుంది. మధ్యాహ్నం మూడున్నర దాకా ఎన్నికలు జరుగుతాయి. ఇదిలా ఉంటే తొలి విడత పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. jagan-nimmagadda-elections;view;rachana;anakapalle;district;vishakapatnam;panchayati;tdp;ycp;party;paruguజగడ్డ : విశాఖలో తొలి విడతకు కౌంట్ డౌన్...!జగడ్డ : విశాఖలో తొలి విడతకు కౌంట్ డౌన్...!jagan-nimmagadda-elections;view;rachana;anakapalle;district;vishakapatnam;panchayati;tdp;ycp;party;paruguSat, 06 Feb 2021 14:04:48 GMTపంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగునకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల 9వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం ఆరింటి నుంచే పోలింగ్ మొదలుకానుంది. మధ్యాహ్నం మూడున్నర దాకా ఎన్నికలు జరుగుతాయి. ఇదిలా ఉంటే తొలి విడత పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే  పూర్తి చేశారు.

పంచాయతీ ఎన్నికలలో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లి రెవిన్యూ డివిజన్ లోని పన్నెండు మండలాలలో తొలి దశ జరగనుంది. జిల్లాలో ఏకగ్రీవ పంచయతీలను మినహాయించి మిగిలిన మూడు వందల పంచాయతీలలో పోలింగ్ ఈ నెల 9న నిర్వహిస్తారు.

విశాఖ జిల్లాలో తొలి విడత ఎన్నికల కోసం మొత్తం 2,960 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ పటిష్టమైన బందోబస్తుని కూడా నిర్వహిస్తున్నారు. మరో వైపు చూస్తే అభ్యర్ధుల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల సంహరణ  పూర్తి కావడంతో ఎక్కడికక్కడ అభ్యర్ధులు గెలుపు కోసం ప్రజల వద్దకు  పరుగులు పెడుతున్నారు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం నాలుగు గంటలతో తొలి విడత ప్రచారం సమాప్తం అవుతుంది.

ఇక అధికార వైసీపీ ఎక్కువగా ఏకగ్రీవాలను సొంతం చేసుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు రూరల్ జిల్లా అంతటా ఉన్నారు. దాంతో గెలుపు కోసం అధికార పార్టీ వ్యూహ రచన చేస్తోంది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతంలో బలం ఉన్న టీడీపీ కూడా విజయానికి బాటలు వేసుకుంటోంది. తనకు ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటోంది. టీడీపీ తన మద్దతుదారులను పెద్ద ఎత్తున గెలిపించుకోవడం ద్వారా రూరల్ జిల్లాలో పట్టుని నిలుపుకోవాలని చూస్తోంది. మొత్తానికి రూరల్ జిల్లా జనాలు తమ తీర్పు ఎటు వైపు ఇస్తారు ఎవరు అసలైన విజేతలు అన్నది చూడాలి. రూరల్ జిల్లాలో ప్రజానీకం తీర్పు రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా సంకేతంగా మారనుంది. దాంతో ఈ ఎన్నికల నుంచే ప్రత్యర్ధులను కట్టడి చేయాలని రెండు వైపులా కూడా గట్టిగానే ప్రయత్నాలు సాగుతున్నాయి.






అల్లరి నరేష్ కోసం సాయం చేయడానికి మరోసారి ముందుకు వచ్చిన మహేష్ బాబు

అక్క‌డ టీడీపీని కొట్టేందుకు జ‌గ‌న్ న‌యా స్కెచ్... ఆ నేత‌కు ఎమ్మెల్సీ క‌న్‌ఫార్మ్ ?

ఆచార్య బిజినెస్ లెక్క‌లు అన్నీ త‌ప్పులే... వెన‌క ఇంత క‌థ ఉందా ?

వామ్మో....రమ్యకృష్ణతో పోటీకి వస్తున్న సీరియల్ నటి...?

ప్రభాస్ చెల్లి ని ఎప్పుడైనా చూశారా..

త‌మ్ముళ్ల‌కు బాబోరి బంప‌ర్ ఆఫ‌ర్‌... నామినేష‌న్ వేస్తే భారీ న‌జ‌రానా ?

కేటీఆర్ సీఎం కాదు... కేసీఆర్ ముందు రెండు అగ్నిప‌రీక్ష‌లు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>