PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yellow-media-even-did-not-spare-rajbhavan-for-its-cooked-up-stories92ff293a-9f27-4ec4-a285-587be21cfa60-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yellow-media-even-did-not-spare-rajbhavan-for-its-cooked-up-stories92ff293a-9f27-4ec4-a285-587be21cfa60-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం అయ్యాయి. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి పై గవర్నర్ హరిచందన్ కు టీడీపీ నేతలు వర్ల రామయ్య, బొండా ఉమా, బుద్ద వెంకన్న, గద్దే రామ్మోహనరావు ఫిర్యాదు చేసారు. ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా, అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యల చేశారని గవర్నర్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేసారు. అయితే వారికి గవర్నర్ అందుబాటులోకి రాలేదు. ఈ నేపధ్యంలో గవర్నర్ దర్శనం లభించకపోవడంపై టిడిపి నేతల ఆగ్రహం వ్యక్తం చేసారు. biswabhushan harichandh;darshana;jagan;andhra pradesh;sri venkateswara swamy;court;chief minister;minister;governor;arrest;tdp;reddy;v;varla ramaiah;party;bonda umamaheswara raoషాకింగ్: ఏపీ గవర్నర్ పై కోర్ట్ కు టీడీపీషాకింగ్: ఏపీ గవర్నర్ పై కోర్ట్ కు టీడీపీbiswabhushan harichandh;darshana;jagan;andhra pradesh;sri venkateswara swamy;court;chief minister;minister;governor;arrest;tdp;reddy;v;varla ramaiah;party;bonda umamaheswara raoSat, 06 Feb 2021 15:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం అయ్యాయి. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి పై  గవర్నర్ హరిచందన్  కు టీడీపీ నేతలు వర్ల రామయ్య, బొండా ఉమా, బుద్ద వెంకన్న, గద్దే రామ్మోహనరావు ఫిర్యాదు చేసారు. ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా, అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యల చేశారని గవర్నర్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేసారు. అయితే వారికి గవర్నర్ అందుబాటులోకి రాలేదు. ఈ నేపధ్యంలో గవర్నర్ దర్శనం లభించకపోవడంపై టిడిపి నేతల ఆగ్రహం వ్యక్తం చేసారు.

దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడారు. నాలుగవ సారి గవర్నర్ ను కలువలేకపోయామని ఆయన అన్నారు. సెక్రెటరీ ని కలిసి ఫిర్యాదు చేశాం  అని ఆయన తెలిపారు. మూలవిరాట్ గవర్నర్ దర్శనం దొరకలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. పూజారి సెక్రెటరీ దర్శనం కూడా దొరక లేదు అని విమర్శించారు. అసిస్టెంట్ పూజారి అసిస్టెంట్ సెక్రెటరీ దర్శనం లభించింది అన్నారు. ప్రధాన ప్రతిపక్షం అయిన మాకు అపాయింట్మెంట్ గవర్నర్ ఇవ్వడం లేదు అని మండిపడ్డారు. పార్టీ అధ్యక్షులు వస్తేనే కలుస్తానని గవర్నర్ రాసి ఇస్తే కోర్టుకు వెళ్తాం అన్నారు.

మంత్రి పెద్దిరెడ్డ పిచ్చివాడు లాగా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. ఎస్ఇసి మాట వింటే అధికారులను బ్లాక్ ‌లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు అని ఆయన అన్నారు. ఈ గవర్నర్‌ ఈ ముఖ్యమంత్రి ప్రజలను ఏం చేస్తారు అని నిలదీశారు. దేశంలో అందరు సిఎంలు‌ ఏం చేస్తారో ప్రజలకు తెలుసు అని ఆయన అన్నారు. కానీ లో ఏపీలో సిఎం జగన్ రహస్య పాలన చేస్తున్నారు అని మండిపడ్డారు. డిజిపి మంత్రి పెద్దిరెడ్డి పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ మంచి రాజ్యాంగం రాస్తే వీరు చిన్నాభిన్నం చేస్తున్నారు అని మండిపడ్డారు.


మోకాళ్ళ నొప్పులా.. ఈ వంటింటి చిట్కా తో చెక్ పెట్టండి..?

జగడ్డ : సర్పంచ్ పదవి కోసం ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా.. చీటింగ్ తో హర్ట్ ?

టాలీవుడ్ హీరో సుమంత్ అశ్విన్ కాబోయే భార్య గురించి ఆసక్తికర విషయాలు

అల్లరి నరేష్ కోసం సాయం చేయడానికి మరోసారి ముందుకు వచ్చిన మహేష్ బాబు

అక్క‌డ టీడీపీని కొట్టేందుకు జ‌గ‌న్ న‌యా స్కెచ్... ఆ నేత‌కు ఎమ్మెల్సీ క‌న్‌ఫార్మ్ ?

ఆచార్య బిజినెస్ లెక్క‌లు అన్నీ త‌ప్పులే... వెన‌క ఇంత క‌థ ఉందా ?

వామ్మో....రమ్యకృష్ణతో పోటీకి వస్తున్న సీరియల్ నటి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>