PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-nimmagadda-elections58a409d7-55ce-4cb5-9e73-f49783f75de3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-nimmagadda-elections58a409d7-55ce-4cb5-9e73-f49783f75de3-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరింది. మూడో దశకు సంబంధించిన ప్రక్రియ కూడా మొదలవుతుంది. అయితే ఈ ఎన్నికలు ఇప్పుడు అధికారులు కొంప ముంచేలా కనిపిస్తున్నాయి. ఒక పక్క ఎన్నికల సంఘం ఆదేశించిన పనులు చేయకపోతే ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సరే అని ఆయన చెప్పిన పనులు చేస్తుంటే మీ సంగతి చూస్తాను అని అధికార పార్టీ మంత్రులు బెదిరిస్తున్న వైనం వారికి ఇబ్బందిగా మారింది. నిన్న అధికార పార్టీకి చెందిన మంత్రి పెద్దిరెడ్nimmagadda jagan elections;kumaar;tara;andhra pradesh;district;peddireddy ramachandra reddy;kadapa;kanna lakshminarayana;media;panchayati;minister;ycp;march;party;mantraజగడ్డ : దారుణంగా మారిన ఏపీ అధికారుల పరిస్థితి !జగడ్డ : దారుణంగా మారిన ఏపీ అధికారుల పరిస్థితి !nimmagadda jagan elections;kumaar;tara;andhra pradesh;district;peddireddy ramachandra reddy;kadapa;kanna lakshminarayana;media;panchayati;minister;ycp;march;party;mantraSat, 06 Feb 2021 13:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరింది. మూడో దశకు సంబంధించిన ప్రక్రియ కూడా మొదలవుతుంది. అయితే ఈ ఎన్నికలు ఇప్పుడు అధికారులు కొంప ముంచేలా కనిపిస్తున్నాయి. ఒక పక్క ఎన్నికల సంఘం ఆదేశించిన పనులు చేయకపోతే ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సరే అని ఆయన చెప్పిన పనులు చేస్తుంటే మీ సంగతి చూస్తాను అని అధికార పార్టీ మంత్రులు బెదిరిస్తున్న వైనం వారికి ఇబ్బందిగా మారింది. నిన్న అధికార పార్టీకి చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మేరకు బహిరంగ హెచ్చరికలు చేశారు. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పినట్లు పనిచేసిన వారందరినీ మార్చి 31 తర్వాత బ్లాక్ లిస్టులో పెడతామని ఆయన హెచ్చరించారు. మార్చి 31 తరవాత నిమ్మగడ్డ రిటైర్ అవుతారు ఆ తరువాత మాదే రాజ్యం అన్నట్టుగా ఆయన అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇంత ఇబ్బంది ఎందుకు వచ్చింది అంటే భారీగా ఏకగ్రీవాలు జరిగిన చిత్తూరు, గుంటూరు జిల్లాల ఏకగ్రీవాలు తాత్కాలికంగా నిలిపివేయాలని అక్కడ ఏకగ్రీవాలు జరిగిన గ్రామాలకు వెళ్లి అధికారులు విచారించి తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తన సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో కూడా ఇలాంటి ఆదేశాలు జారీ చేయడంతో ఎంతో కష్టపడి ఎవరూ చేయని ఏకగ్రీవాలు చేయిస్తే ఇప్పుడు అన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితి రావడంతో ఎవరైతే అధికారులు వెళ్లి విచారణ చేసి నివేదికలు ఇవ్వాలో వారిని బెదిరిస్తూ నిన్న మంత్రి గారి ప్రెస్మీట్ సాగింది.  

మంత్రి గారి లెక్కప్రకారం అన్ని ఏకగ్రీవాలు ప్రజల ఆమోదంతోనే జరిగి పోయాయి అని ఆయా అధికారులు నివేదిక ఇవ్వాలన్న మాట. ఒక రకంగా చిత్తూరు జిల్లా కూడా కడప జిల్లాతో పోటీ పడుతూ అత్యధిక ఏకగ్రీవాలు చేయించే స్థాయికి వెళ్లింది. ఈ ఏకగ్రీవాలు బాధ్యత జిల్లా మంత్రిగా తలకెత్తుకున్న పెద్దిరెడ్డి పెద్ద ఎత్తున బలవంతపు ఏకగ్రీవాలు చేయించారనే ఆరోపణలు ప్రధాన మీడియా ఎత్తి చూపింది. ఇప్పుడు ఒక వేళ అధికారులు వెళ్లి అక్కడ విచారణ జరిపి బలవంతపు ఏకగ్రీవాలు అని తేలితే ఎన్నికల సంఘం ఎక్కడ చర్యలు తీసుకుంటుందో అనే కారణంతో అధికారులను బెదిరించే ధోరణిలో పెద్దిరెడ్డి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.

అయితే అధికార పార్టీ ఎలా ఉన్నా సరే నిమ్మగడ్డ మాత్రం ఎక్కడా నోరు జారకుండా తాను చేయాలనుకున్నది చేసుకుంటూ పోతున్నారు. అధికారులకు కూడా అభయం ఇవ్వడంతో అధికారులు కూడా వైసీపీ నేతల మాట వినడం కన్నా నిమ్మగడ్డ మాట విని రూల్స్ ప్రకారం నడుచుకుంటే తర్వాత లీగల్ ఇష్యూస్ కూడా ఉండవని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఒక రకంగా అధికారులు అటు ప్రభుత్వానికి ఇటు ఎన్నికల సంఘానికి మధ్య నలిగిపోతున్నారు అనేది మాత్రం చెప్పక తప్పదు. 


ముక్కుదిబ్బడతో ఇబ్బంది పడుతున్నారా.. చిన్ని చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి..?

అల్లరి నరేష్ కోసం సాయం చేయడానికి మరోసారి ముందుకు వచ్చిన మహేష్ బాబు

అక్క‌డ టీడీపీని కొట్టేందుకు జ‌గ‌న్ న‌యా స్కెచ్... ఆ నేత‌కు ఎమ్మెల్సీ క‌న్‌ఫార్మ్ ?

ఆచార్య బిజినెస్ లెక్క‌లు అన్నీ త‌ప్పులే... వెన‌క ఇంత క‌థ ఉందా ?

వామ్మో....రమ్యకృష్ణతో పోటీకి వస్తున్న సీరియల్ నటి...?

ప్రభాస్ చెల్లి ని ఎప్పుడైనా చూశారా..

త‌మ్ముళ్ల‌కు బాబోరి బంప‌ర్ ఆఫ‌ర్‌... నామినేష‌న్ వేస్తే భారీ న‌జ‌రానా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>