PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsdded5b03-5891-43a9-aade-2890d2f9f612-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsdded5b03-5891-43a9-aade-2890d2f9f612-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల వేడి మామూలుగా లేదు. ఎలా అయినా ఎక్కువగా ఏకగ్రీవాలు చేయాలన్నా సర్కార్ దానిని సాధించలేకపోయింది అనే చెప్పాలి. నిన్నటితో మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో దాదాపుగా ఎన్ని ఏకగ్రీవాలు అయ్యాయి అనే విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తంగా చూసుకుంటే కేవలం 9 శాతం లోపు ఏకగ్రీవాలు ఉన్నట్టు చెబుతున్నారు. ఇక జిల్లాల వారీగా ఎన్ని ఏకగ్రీవమయ్యాయి అనే విషయాన్ని పరిశీలిస్తే.. చిత్తూరు,గుంటూరు, కడప జిల్లాల్లో ఏకగ్రీవాల అధిక స్థాయిలో నమోదు అయినట్లు తెలుస్తోంది.ఎన్నికల నేపథ్యంలో జరుగjagan-nimmagadda-elections;cbn;prasad;andhra pradesh;peddireddy ramachandra reddy;kadapa;panchayati;minister;tdp;mantraజగడ్డ: జగనోరి మంత్రినా మజాకా..దెబ్బకు నిమ్మగడ్డ ఔట్..!జగడ్డ: జగనోరి మంత్రినా మజాకా..దెబ్బకు నిమ్మగడ్డ ఔట్..!jagan-nimmagadda-elections;cbn;prasad;andhra pradesh;peddireddy ramachandra reddy;kadapa;panchayati;minister;tdp;mantraSat, 06 Feb 2021 10:00:00 GMTఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల వేడి మామూలుగా లేదు. ఎలా అయినా ఎక్కువగా ఏకగ్రీవాలు చేయాలన్నా సర్కార్ దానిని సాధించలేకపోయింది అనే చెప్పాలి. నిన్నటితో మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో దాదాపుగా ఎన్ని ఏకగ్రీవాలు అయ్యాయి అనే విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తంగా చూసుకుంటే కేవలం 9 శాతం లోపు ఏకగ్రీవాలు ఉన్నట్టు చెబుతున్నారు. ఇక జిల్లాల వారీగా ఎన్ని ఏకగ్రీవమయ్యాయి అనే విషయాన్ని పరిశీలిస్తే.. చిత్తూరు,గుంటూరు, కడప జిల్లాల్లో ఏకగ్రీవాల అధిక స్థాయిలో నమోదు అయినట్లు తెలుస్తోంది.ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న దాడులు తారాస్థాయికి చేరుతుంది. 



జగనోరి మంత్రులు మాత్రం ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్నా కూడా నిమ్మగడ్డ పై మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మరోసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ రమేష్ ప్రసాద్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.ఓటు నమోదు చేసుకోవడం చేత కాని వ్యక్తి రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా ఉండటం తమ దౌర్భాగ్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. తన పరిధిలోని అధికారాలపై లెక్చర్లు దంచికొట్టే నిమ్మగడ్డకు ఓటు ఎలా, ఎక్కడ నమోదు చేసుకోవాలో తెలీకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. టీడీపీ మేనిఫెస్టో ప్రకటించడంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన ఎస్‌ఈసీని నిలదీశారు. 



చంద్రబాబుకు మేలు చేస్తే ఎమ్మెల్యేనో, ఎంపీనో చేస్తారని నిమ్మగడ్డ ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్ని అడ్డుకున్నా కూడా తొలిదశ నామినేషన్ లో 500లకుపైగా సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని ఆయన గుర్తు చేశారు.ఏకగ్రీవమైన అభ్యర్థులు డిక్లరేషన్‌ పత్రాలు తీసుకున్నాక రిజల్ట్‌ను హోల్డ్‌లో పెట్టే అధికారం నిమ్మగడ్డకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ఏకగ్రీవాలు జరగకూడదని ఏ చట్టంలోనైనా ఉందా అని ఎస్‌ఈసీని నిలదీశారు. రిటర్నింగ్‌ అధికారి అధికారాల్లో జోక్యం చేసుకునే ఆయనకు లేదని వెల్లడించారు. ఇకపోతే నిమ్మగడ్డ అధికారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆయన మాటలు విని అధికారులు ఎవరూ కూడా అక్రమాలకు పాల్పడవద్దని సూచించారు. అధికారం ఉంది కదా అని రెచ్చపోతున్నారు. ఎన్నికల నియమావళి దుర్వినియోగం చేస్తున్న అధికారులకు భవిష్యత్తులో సరైన బుద్ది చెప్తామని హెచ్చరించారు. 





ఉధృత‌మ‌వుతున్న ఉక్కు సంక‌ల్పం.. భారీ ఉద్య‌మానికి టీడీపీ ఏం చేస్తోందంటే...?

నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్..!

జగడ్డ: మూడో విడత ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసుకోండి...?

ఎన్టీఆర్ 30 వ కోసం కొత్త హీరోయిన్?

జగడ్డ : టోటల్ గా లెక్క తేల్చనున్న నిమ్మగడ్డ ?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!

టీడీపీలో కొత్త జోష్‌.. ఈ నేత‌ల్లో ఇంత స‌డెన్ చేంజ్ ఏంటి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>