MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/short-film-infod42e8e6b-b3c4-4167-8ec0-015efe6bec6a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/short-film-infod42e8e6b-b3c4-4167-8ec0-015efe6bec6a-415x250-IndiaHerald.jpgఇక విద్యా బాలన్ నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. భారత దేశం గర్వించదగ్గ అద్భుతమైన గొప్ప నటీమణుల్లో ఈమె కూడా ఒకరు. ఏ క్యారక్టర్ లోనైనా ఇట్టే లీనమై పోవడం.. పాత్ర తగ్గట్టు అన్ని భావాలు పలికించి ప్రేక్షకులను మెప్పించగల ప్రతిభ విద్యా బాలన్ సొంతం. short film info;ronnie screwvala;vidya balan;vidya;india;2019;cinema;2020;industry;international;sardar vallabhai patel;father;indian;nijam;oscar;santosham;chitramఈ షార్ట్ ఫిలింలో అంతగా ఏముందో...ఆస్కార్ కు ఎంపికయింది...?ఈ షార్ట్ ఫిలింలో అంతగా ఏముందో...ఆస్కార్ కు ఎంపికయింది...?short film info;ronnie screwvala;vidya balan;vidya;india;2019;cinema;2020;industry;international;sardar vallabhai patel;father;indian;nijam;oscar;santosham;chitramSat, 06 Feb 2021 13:00:00 GMTఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే..?? విద్యాబాలన్ నటించిన ఓ షార్ట్ ఫిల్మ్ కు గొప్ప అదృష్టం  వరించింది. "నట్కాట్" అనే లఘుచిత్రంలో విద్యాబాలన్ తో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ సానికా పటేల్ నటించారు. అయితే
ఈ షార్ట్ ఫిల్మ్ ఈ ఏడాది ఆస్కార్ కు నామినేట్ అయింది. 2019 లో రూపొందించబడిన ఈ లఘు చిత్రం ప్రేక్షకుల ఆదరణతో పాటు, ఇంత అరుదైన అవకాశం లభించడం గొప్ప విశేషం.

అన్నూకాంప హార్స్  ఈ షార్ట్ ఫిల్మ్ ను రచించగా..షాన్ వ్యాస్ మరియు రోనీ స్క్రూవాలా సంయుక్తంగా ఈ షార్ట్ ఫిల్మ్ ను నిర్మించారు. కాగా ఈ లఘు చిత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఈ సంతోషకరమైన విషయాన్ని తెలుపుతూ విద్యాబాలన్ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎంతో గర్వంగాను చెప్పలేనంత సంతోషంగాను ఉంది.. "మేం చేసిన నట్కాట్ షార్ట్ ఫిల్మ్ 2020 ముగిసిన తర్వాత 2021 ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుక ఆస్కార్ బరిలో నిలిచింది" అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు  విద్యా బాలన్.  

ఈ పోస్ట్ తో పాటుగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక చిన్న వీడియోను కూడా షేర్ చేశారు విద్య. ఇక ఆవీడియోలో ఏముందంటే..అందులో తల్లి క్యారెక్టర్ లో ఉన్న విద్యాబాలన్ తన బిడ్డకు.. పితృస్వామ్యం మరియు పురుషాహంకారం జెండర్ ఈక్వాలిటీ గురించి పాప నిద్రించే ముందు కథలుగా చెబుతుంది. అయితే ఈ ఏడాది 93వ ఆస్కార్ అకాడమీ అవార్డుల వేడుకలు ఏప్రిల్ 25న జరగనున్నాయి. నట్కాట్ జర్మన్ స్టార్ ఆఫ్ ఇండియా అవార్డును  గెలుచుకుంది.. అదేవిధంగా ఆస్కార్ బరిలో కూడా విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నారు మేకర్స్ మరియు అభిమానులు.

ఇక విద్యా బాలన్ నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. భారత దేశం గర్వించదగ్గ అద్భుతమైన గొప్ప నటీమణుల్లో ఈమె కూడా ఒకరు. ఏ క్యారక్టర్ లోనైనా ఇట్టే లీనమై పోవడం.. పాత్ర తగ్గట్టు అన్ని భావాలు పలికించి ప్రేక్షకులను మెప్పించగల ప్రతిభ  విద్యా బాలన్ సొంతం. ఇటు గ్లామర్‌గా కనపడుతూనే అటు సీరియస్ పాత్రల్లో పెద్దరికాన్ని  చూపెడుతుంది విద్య...!


ముక్కుదిబ్బడతో ఇబ్బంది పడుతున్నారా.. చిన్ని చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి..?

అల్లరి నరేష్ కోసం సాయం చేయడానికి మరోసారి ముందుకు వచ్చిన మహేష్ బాబు

అక్క‌డ టీడీపీని కొట్టేందుకు జ‌గ‌న్ న‌యా స్కెచ్... ఆ నేత‌కు ఎమ్మెల్సీ క‌న్‌ఫార్మ్ ?

ఆచార్య బిజినెస్ లెక్క‌లు అన్నీ త‌ప్పులే... వెన‌క ఇంత క‌థ ఉందా ?

వామ్మో....రమ్యకృష్ణతో పోటీకి వస్తున్న సీరియల్ నటి...?

ప్రభాస్ చెల్లి ని ఎప్పుడైనా చూశారా..

త‌మ్ముళ్ల‌కు బాబోరి బంప‌ర్ ఆఫ‌ర్‌... నామినేష‌న్ వేస్తే భారీ న‌జ‌రానా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>