PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-new-districtse0d51ca6-2ff6-4319-b5fc-296c93ef1e98-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-new-districtse0d51ca6-2ff6-4319-b5fc-296c93ef1e98-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి గట్టిగా ఉంది. ఎలా అయినా వీలయినన్ని ఏకగ్రీవాలు జరిపించాలని ఒక పక్క అధికార పక్షం ప్రయత్నిస్తుంటే బలవంతపు ఏకగ్రీవాలను అడ్డగించాలని ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. పట్టు నిలుపుకోవడానికి టిడిపి, శక్తి పెంచుకోవడానికి బీజేపీ-జనసేనలు తమ సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పరిస్థితి చెప్పనవసరం లేదు ఆ పార్టీకి కనీసం అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి.. అయితే ఇలాంటి సమయంలో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ఒక భారీ కుట్ర ఛేదించడం ఇప్పుడు సంచలనంగా మారింది. కొద్ది రnimmagadda jagan elections;kumaar;aishwarya;maya;prasad;bharatiya janata party;godavari river;andhra pradesh;congress;mp;district;east;east godavari;police;media;mandalam;muni;wife;letter;tdp;traffic police;rajahmundry;party;shatru1;shaktiజగడ్డ : భారీ కుట్రను చేధించిన ఏపీ పోలీసులు.. ఎవరి ప్లానో ?జగడ్డ : భారీ కుట్రను చేధించిన ఏపీ పోలీసులు.. ఎవరి ప్లానో ?nimmagadda jagan elections;kumaar;aishwarya;maya;prasad;bharatiya janata party;godavari river;andhra pradesh;congress;mp;district;east;east godavari;police;media;mandalam;muni;wife;letter;tdp;traffic police;rajahmundry;party;shatru1;shaktiSat, 06 Feb 2021 15:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి గట్టిగా ఉంది. ఎలా అయినా వీలయినన్ని ఏకగ్రీవాలు జరిపించాలని ఒక పక్క అధికార పక్షం ప్రయత్నిస్తుంటే బలవంతపు ఏకగ్రీవాలను  అడ్డగించాలని ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. పట్టు నిలుపుకోవడానికి టిడిపి, శక్తి పెంచుకోవడానికి బీజేపీ-జనసేనలు తమ సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నాలు చేస్తున్నాయి.  కాంగ్రెస్ పరిస్థితి చెప్పనవసరం లేదు ఆ పార్టీకి కనీసం అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి.. అయితే ఇలాంటి సమయంలో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ఒక భారీ కుట్ర ఛేదించడం ఇప్పుడు సంచలనంగా మారింది. కొద్ది రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని మునికూడలికి చెందిన ఒక దళిత యువకుడికి శిరోముండనం చేయించడం సంచలనంగా మారింది.

ఆ యువకుడు తనకు శిరోముండనం చేయించిన వారి మీద చర్యలు తీసుకోలేదని తాను నక్సలైట్స్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నా అని ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాయడంతో వార్తల్లో నిలిచాడు. అలాంటి యువకుడు ఇంటిలో నుండి మాయమైపోవడం సంచలనం రేపింది. ఎన్నికల సమయంలో ఆయన మాయం కావడంతో భార్య ఐశ్వర్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయనకు అధికార పార్టీ వారితో శత్రుత్వం ఉన్న కారణంగా వారేమైనా చేశారేమో అనే ఉద్దేశంతో ఆమె ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు లు సీరియస్ గా తీసుకుని ఈ విషయం జిల్లా మొత్తం పోలీస్ స్టేషన్లకు పంపించారు. ఈ దెబ్బతో ప్రసాద్ అదృశ్యం కేసుని మిస్టరీ చేధించారు పోలీసులు.

ఈనెల 3వ తేదీన ముని కూడలి గ్రామం నుంచి ప్రసాదు అదృశ్యం కావడం వెనుక ఒక కుట్ర కోణం ఉందని పోలీసులు గుర్తించారు. ఎన్నికల సమయం కావడంతో అజ్ఞాతంలో ఉంటూ సోషల్ మీడియా ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని బాధితుడు ప్రసాద్ ప్లాన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఉద్దేశ పూర్వకంగా మిస్సయిన ప్రసాద్ తో పాటు అందుకు సహకరించిన మరో వ్యక్తిని కాకినాడలో రాజమండ్రి నార్త్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు.

అయితే ఈ ప్లాన్ ప్రసాద్ మాత్రమే చేశాడా లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజానికి ప్రసాద్ విషయంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రసాద్ మిస్సయిన విషయం తెలుసుకుని కూడా ఆయన మాత్రమే స్పందించారు. సో ఆయనకు కూడా ఏమైనా హ్యాండ్ ఇందులో ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి పోలీసులు ప్రసాద్ ను పట్టుకో బట్టి సరిపోయింది లేకుంటే అజ్ఞాతంలో ఉండి ఎలాంటి అల్లర్లకు కారణం అయ్యేవాడో ఊహించడం కష్టమే. 


మోకాళ్ళ నొప్పులా.. ఈ వంటింటి చిట్కా తో చెక్ పెట్టండి..?

జగడ్డ : సర్పంచ్ పదవి కోసం ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా.. చీటింగ్ తో హర్ట్ ?

టాలీవుడ్ హీరో సుమంత్ అశ్విన్ కాబోయే భార్య గురించి ఆసక్తికర విషయాలు

అల్లరి నరేష్ కోసం సాయం చేయడానికి మరోసారి ముందుకు వచ్చిన మహేష్ బాబు

అక్క‌డ టీడీపీని కొట్టేందుకు జ‌గ‌న్ న‌యా స్కెచ్... ఆ నేత‌కు ఎమ్మెల్సీ క‌న్‌ఫార్మ్ ?

ఆచార్య బిజినెస్ లెక్క‌లు అన్నీ త‌ప్పులే... వెన‌క ఇంత క‌థ ఉందా ?

వామ్మో....రమ్యకృష్ణతో పోటీకి వస్తున్న సీరియల్ నటి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>