MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan6960e9fb-0050-49f4-8d48-02a17e82edc8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan6960e9fb-0050-49f4-8d48-02a17e82edc8-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే మాస్ కి పూనకాలు వస్తాయి. ఆయన ఫ్యాన్స్ కి పేరు వింటేనే పరవశం కలుగుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నాడు అంతే అది హిట్టా మరోటా అన్నది ఫ్యాన్స్ కి అసలు అవసరం లేదు. తమ హీరో తెర మీద అలా కనిపిస్తే చాలు వారి కళ్ళు ఒక్కసారిగా వేయి వెలుగులతో నిండిపోతాయి. pawan;pawan;venkatesh;rana;kalyan;pawan kalyan;srinivas;tara;trivikram srinivas;cinema;remake;director;hero;daggubati venkateswara rao;traffic police;v;massపవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?pawan;pawan;venkatesh;rana;kalyan;pawan kalyan;srinivas;tara;trivikram srinivas;cinema;remake;director;hero;daggubati venkateswara rao;traffic police;v;massSat, 06 Feb 2021 20:30:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే మాస్ కి పూనకాలు వస్తాయి. ఆయన ఫ్యాన్స్ కి పేరు వింటేనే పరవశం కలుగుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నాడు అంతే అది హిట్టా మరోటా అన్నది ఫ్యాన్స్ కి అసలు అవసరం లేదు. తమ హీరో తెర మీద అలా కనిపిస్తే చాలు వారి కళ్ళు ఒక్కసారిగా వేయి వెలుగులతో నిండిపోతాయి.

ఇక పవన్ కళ్యాణ్ తో నటించాలని చాలా మంది భావిస్తారు. ఆయన్ని డైరెక్ట్ చేయాలని కూడా చాలా మంది కోరిక వెళ్లబుచ్చుతారు. అలాటిది పవన్ తో పాటు ఒక సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ట్రావెల్ చేయడం అంటే అది రికార్డే. అంతకంటే పవన్ కళ్యాణ్ క్రెడిట్ అని కూడా చెప్పాలి.

ఇక పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్. ఈ మూవీని తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్ ని తయారు చేయడమే కాదు పవర్ ఫుల్ డైలాగ్స్ రాస్తున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నది  సాగర్ చంద్ర. ఈ మూవీ గురించి ఇపుడు ఇంకో ఇంటెరెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది.

ఈ మూవీలో ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ ఉందిట. ఆ క్యారెక్టర్ కి అందరికీ తెలిసిన ముఖం అయితే బాగా తెర మీద  పండుతుంది అని భావించి చిత్ర యూనిట్ డైరెక్టర్ వీ వీ వినాయక్ ని సెలెక్ట్ చేశారట. అలా ఈ మూవీలో పవన్ కళ్యాణ్ తో పాటు స్క్రీన్ చేసుకుంటూ వినాయక్ కనిపిస్తారు అంటున్నారు. అంటే ఈ మూవీకి సంబంధించి ముగ్గురు డైరెక్టర్లు తెర ముందు వెనకాల పనిచేస్తున్నారు అన్న మాట.

ఇక ఈ సినిమా కధ మళయాళం నుంచి తీసుకున్నది. రీమేక్ చేస్తున్నది అన్నది తెలిసిన విషయమే. ఇక  పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ ఇందులో నటిస్తున్నారు. ఇక మరో  పవర్ ఫుల్ పాత్రలో దగ్గుబాటి  రానా నటిస్తున్నాడు. అన్ని హంగులతో ఈ మూవీ రెడీ అవుతోంది. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో ఈ మూవీని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.




వారి సూచనల మేరకే 'వైజాగ్ స్టీల్ ప్లాంట్' ప్రైవేటీకరణ - కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి

విడుదలకు ముందే 'బాహుబలి 2' రికార్డ్స్ బ్రేక్ చేసిన 'RRR'...!!

మహాభారత కాలంలొ అక్రమ సంభందాలు

ఉప్పెనకు మెగా బూస్టింగ్.. రంగంలోకి దిగుతున్న మెగాస్టార్..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు

ఆరు గదులు.. రెండు బెడ్ రూమ్లు.. గంగవ్వ కొత్తిల్లు ఎలా ఉండబోతుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>