PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-on-vizag-steel-plantef6e3cf5-4442-4fe5-adc7-135c6c92f0e6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-on-vizag-steel-plantef6e3cf5-4442-4fe5-adc7-135c6c92f0e6-415x250-IndiaHerald.jpgవిశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. చివరకు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకోసం కట్టుబడి ఉన్నామని చెబుతోంది. మరి ఏపీ సీఎం జగన్ ఇంతవరకూ ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పోనీ జగన్ సరే.. కనీసం విశాఖలోని వైసీపీ ప్రజా ప్రతినిధులైనా దీనిపై స్పందించాలి కదా. విశాఖకు రాజధాని తీసుకెళ్తాం, అభివృద్ధి చేస్తామంటూ కబుర్లు చెబుతున్న నేతలు.. కీలకమైన ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తామంటూ కేంద్రం అjagan on vizag steel plant;lokesh;bharatiya janata party;jagan;nara lokesh;andhra pradesh;janasena;botcha satyanarayana;vishakapatnam;government;huzur nagar;capital;minister;tdp;central government;ycp;lokesh kanagaraj;janasena party;parliamentవిశాఖ ఉక్కుపై జగన్ మౌనం.. అసలేంటి కథ..?విశాఖ ఉక్కుపై జగన్ మౌనం.. అసలేంటి కథ..?jagan on vizag steel plant;lokesh;bharatiya janata party;jagan;nara lokesh;andhra pradesh;janasena;botcha satyanarayana;vishakapatnam;government;huzur nagar;capital;minister;tdp;central government;ycp;lokesh kanagaraj;janasena party;parliamentSat, 06 Feb 2021 09:00:00 GMTవిశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. చివరకు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకోసం కట్టుబడి ఉన్నామని చెబుతోంది. మరి ఏపీ సీఎం జగన్ ఇంతవరకూ ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పోనీ జగన్ సరే.. కనీసం విశాఖలోని వైసీపీ ప్రజా ప్రతినిధులైనా దీనిపై స్పందించాలి కదా. విశాఖకు రాజధాని తీసుకెళ్తాం, అభివృద్ధి చేస్తామంటూ కబుర్లు చెబుతున్న నేతలు.. కీలకమైన ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తామంటూ కేంద్రం అంటుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు..?

జగన్ లాలూచీ పడ్డారు..
తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విషయంలో కేంద్రంతో జగన్ లాలూచీ పడ్డారని, అందుకే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తున్నా నోరు మెదపలేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఫ్యాక్టరీ ప్రైవేటు పరం అవుతుంటే.. పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు నారా లోకేష్. చత్తీస్ గఢ్ ‌లో నగర్ ‌నార్‌ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం సిద్ధపడితే, తామే కొంటామంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని లోకేష్ గుర్తు చేశారు. ఇక్కడ కూడా రాష్ట్ర సర్కారే కొనుగోలు చేస్తామంటూ అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని, టీడీపీ మద్దతిస్తుందని స్పష్టం చేశారు.

వైసీపీలో గందరగోళం..
అయితే వైసీపీ నేతలు మాత్రం దీనిపై నోరు తెరవడానికి ఇబ్బంది పడుతున్నారు. అధిష్టానం ఆదేశం రాకపోవడంతో కిక్కురుమనకుండా ఉన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రజల మనోభావాలతో కూడుకున్నదని.. దీనిపై ప్రభుత్వంలో చర్చించాక తమ నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు కొంత నష్టాలొచ్చాయని, సుమారు రూ.25వేల నుంచి రూ.30వేల కోట్ల వరకు నష్టముందని, దాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం వారికున్న పారిశ్రామిక విధానాన్ని తీసుకుందని చెప్పారు. ఏదేమైనా ఇది ప్రజల సెంటిమెంట్‌తో కూడుకున్న అంశం కాబట్టి ఏవిధంగా ఉక్కు కర్మాగారాన్ని బలోపేతం చేసేందుకు అవకాశాలు ఉన్నాయనే దానిపై ప్రభుత్వంలో చర్చించాక మాట్లాడతామని అన్నారు బొత్స. అంటే వైసీపీ నిర్ణయం ఇంకా చర్చల దశలోనే ఉందనమాట. 


బీజేపీకి కోలుకోని దెబ్బ ప‌డిపోయిందిగా.. మొఖం ఎక్క‌డ పెట్టుకుంటారు ?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!

టీడీపీలో కొత్త జోష్‌.. ఈ నేత‌ల్లో ఇంత స‌డెన్ చేంజ్ ఏంటి ?

హెరాల్డ్ స్మ‌రామీ : దేశం గ‌ర్వించ‌ద‌గిన‌ చిత్ర‌కారుడు దామెర్ల‌... తెలుగువాడ‌ని మీకు తెలుసా..?!

ఆ కమ్మ నేతలు వైసీపీకి డ్యామేజ్ చేస్తారా ?

జగడ్డ: విజయనగరం జిల్లాలో గెలుపు కోసం బొత్స మాస్టర్‌ ప్లాన్..?

ఆ మూడు చోట్ల జగన్‌ని కాపు కాస్తారా ? పవన్‌ని కాచుకుంటారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>