PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/india-sets-new-record-in-covid-vaccination9b1d5eff-8e1e-4259-b0fd-3a789df984b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/india-sets-new-record-in-covid-vaccination9b1d5eff-8e1e-4259-b0fd-3a789df984b0-415x250-IndiaHerald.jpgకరోనా వ్యాప్తి నేపథ్యంలో తమ దగ్గర మరణాల రేటు తక్కువగా ఉందని, తమ రాష్ట్రంలో కోలుకుని ఇంటికెళ్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉందని ప్రభుత్వాలు ప్రచారం చేసుకున్నాయి. రికార్డులకోసం పోటీ పడ్డాయి. ఇక ఇప్పుడు కొవిడ్ కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిన నేపథ్యంలో వ్యాక్సినేషన్ విషయంలో పోటీ మొదలైంది. వ్యాక్సినేషన్లో భారత్ దూసుకుపోతోందని ప్రకటించింది కేంద్రం. ప్రపంచ వ్యాప్తంగా 11.9కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకోగా.. అందులో 50లక్షలమంది భారతీయులేనంటున్నారు. covid vaccination;india;american samoa;january;central government;international;lieటీకా విషయంలోనూ రికార్డులా? ఇదెక్కడి చోద్యం..టీకా విషయంలోనూ రికార్డులా? ఇదెక్కడి చోద్యం..covid vaccination;india;american samoa;january;central government;international;lieSat, 06 Feb 2021 11:00:00 GMTభారత్ దూసుకుపోతోందని ప్రకటించింది కేంద్రం. ప్రపంచ వ్యాప్తంగా 11.9కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకోగా.. అందులో 50లక్షలమంది భారతీయులేనంటున్నారు.

భారత్ లో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ ఇప్పుడిప్పుడే వేగాన్ని పుంజుకుంటోందని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 50లక్షల మందికి టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. జనవరి 16న దేశంలో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం కాగా, కేవలం 20రోజుల్లోనే 50లక్షల మందికి ఇవ్వగలిగామని తెలిపింది. అంతేకాకుండా ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ ఇస్తున్న దేశాల్లో భారత్‌ ముందుందని కేంద్రం తెలిపింది.

భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన తొలి రోజుల్లో ఈ ప్రక్రియ కాస్త మందకొడిగానే సాగింది. ప్రస్తుతం రోజూవారీ డోసుల సంఖ్య 5లక్షలకు పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 11,814 కేంద్రాల్లో 5,09,893 మందికి టీకా అందించారు. 8 రాష్ట్రాల్లో 61శాతం మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్‌ అందజేసినట్టు తెలిపారు అధికారులు. ఉత్తర ప్రదేశ్‌లో మాత్రం తక్కువగా 11.9శాతం మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తొలిడోసు తీసుకున్న వారికి త్వరలోనే రెండో డోసు ఇచ్చే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. జులై నాటికి దేశవ్యాప్తంగా 30కోట్ల మందికి టీకా అందించే లక్ష్యంగా భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ఇప్పటి వరకు 67 దేశాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం మొదలు కాగా.. మొత్తం 7 వ్యాక్సిన్లు వినియోగంలోకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో  11కోట్ల 90లక్షల మంది టీకాలు తీసుకున్నారు. ప్రతి రోజూ 45లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో అమెరికా అన్ని దేశాలకంటే ముందుంది. ఆ తర్వాత భారత్ ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది.




జగడ్డ : జగనోరు మీ మాట వల్ల ప్రజలకు ఒరిగిందేంటి ??

నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్..!

జగడ్డ: మూడో విడత ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసుకోండి...?

ఎన్టీఆర్ 30 వ కోసం కొత్త హీరోయిన్?

జగడ్డ: జగనోరి మంత్రినా మజాకా..దెబ్బకు నిమ్మగడ్డ ఔట్..!

జగడ్డ : టోటల్ గా లెక్క తేల్చనున్న నిమ్మగడ్డ ?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>