PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla65dded8e-2572-4a11-9dae-007bc131a3f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla65dded8e-2572-4a11-9dae-007bc131a3f9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు టీడీపీ నేతలు, బిజెపి నేతలు అధికార పార్టీని టార్గెట్ గా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న బిజెపి నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. తాజాగా... బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్నికలపై మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతం గా జరిగే పరిస్ధితులు కనిపించలేదు అని ఆయన అనుమానం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ఐపిసి లేదు.. వైసిపి పీనల్ కోడ్ నడుస్తోంది అని ఆయన ఆరysrcp;hari;hari music;delhi;bharatiya janata party;andhra pradesh;district;panchayati;collector;air;press;tdp;local language;ycp;reddy;rayachoty;partyవైసీపీ గాలి తీసిన బిజెపి నేతవైసీపీ గాలి తీసిన బిజెపి నేతysrcp;hari;hari music;delhi;bharatiya janata party;andhra pradesh;district;panchayati;collector;air;press;tdp;local language;ycp;reddy;rayachoty;partySat, 06 Feb 2021 17:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు టీడీపీ నేతలు, బిజెపి నేతలు అధికార పార్టీని టార్గెట్ గా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.  ఇక ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న బిజెపి నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. తాజాగా...  బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్నికలపై మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతం గా జరిగే పరిస్ధితులు కనిపించలేదు అని ఆయన అనుమానం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ఐపిసి లేదు.. వైసిపి పీనల్ కోడ్ నడుస్తోంది అని ఆయన ఆరోపించారు.

రాయచోటి నియోజకవర్గ పరిధి లోని నల్లగుట్ట పల్లె గ్రామ పంచాయతీ లో గంప సుబ్బ రాయుడు నామినేషన్ ను అనైతికంగా తిరస్కరించారు అని ఆయన ఆరోపణలు చేసారు. నామినేషన్ ఉపసంహరించు కోవాలని ఒత్తిడి తెచ్చిన ఎస్సై మైనుద్దీన్, సిఐ యుగంధర్ లను సస్పెండ్ చేయాలి అని విష్ణు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసారు. సమస్య పై ఫిర్యాదు చేస్తే  జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులు ఎవరూ స్పందించడం లేదు అని ఆవేదన వ్యక్తం చేసారు. ఎన్నికల కమిషన్ వెంటనే నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి అని విష్ణు వర్ధన్ రెడ్డి డిమాండ్ చేసారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మాట్లాడే నైతిక హక్కు వైసీపీ కి లేదు అని ఆయన ఆరోపణలు చేసారు. వైసీపీ లాంటి బుడ్డ పార్టీలు చాలా చూసాము అని అన్నారు. బిజెపి నేతలు, కార్యకర్తల పట్ల వైసీపీ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదు అన్నారు. బీజేపీ ఓట్ల గురుంచి మాట్లాడే వైసీపీ, టీడీపీ నేతలు ఢిల్లీ లో బీజేపీ నేతల అపాయింట్మెంట్ కోసం క్యూ కడుతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రానికి వెళ్తే వైసీపీ పార్టీ అనేది ఎవరికి తెలియదు అన్నారు.


Breaking :అల్లు అర్జున్ క్యారవాన్ కు ప్రమాదం..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు

ఆరు గదులు.. రెండు బెడ్ రూమ్లు.. గంగవ్వ కొత్తిల్లు ఎలా ఉండబోతుంది..!

అఖిల్ ష్యూర్ షాట్ హిట్ కొడుతున్నాడా.. అంత కాన్ఫిడెన్స్ ఎందుకో..!

సుకుమార్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు లకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టిన దేవిశ్రీప్రసాద్..!!

వావ్.. మహేశ్‘సర్కారు వారి పాట’ హాలీవుడ్ లెవెల్లో ఉండబోతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>