Politicskurapati Dileep Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpgతమిళనాడు ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు గానూ.. రూ.12వేల 110కోట్లు ప్రకటించింది. కోఆపరేటివ్ బ్యాంకుల్లో 16.43లక్షల రైతులు లబ్ధి పొందనున్నట్లు వెల్లడైంది. రాష్ట్ర అసెంబ్లీ వేదికగా సీఎం కే పళనిస్వామి అనౌన్స్ చేశారు. స్కీం వెంటనే అమల్లోకి రానున్నట్లు ఈ మేర కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు.తమిళనాడు;amala akkineni;india;rbi;assembly;tamilnadu;central government;april;partyతమిళనాడు లో....రైతు రుణాలు మాఫీ.!!!తమిళనాడు లో....రైతు రుణాలు మాఫీ.!!!తమిళనాడు;amala akkineni;india;rbi;assembly;tamilnadu;central government;april;partySat, 06 Feb 2021 00:33:41 GMTతమిళనాడు లో....రైతు రుణాలు మాఫీ.!!!

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

తమిళనాడు ప్రభుత్వం రైతులు భారీ ఊరట కల్పించింది. పెద్ద మొత్తంలో వ్యవసాయ రుణాలను రద్దు చేస్తూ రైతులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ 2వ వారంలో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ భావిస్తోందన్న అంచనాల నడుమ సీఎం ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తమిళనాడు ప్రభుత్వం పలు తాయిలాలను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్లు ఏఐఏడీఎంకే అధికారంలోని ప్రభుత్వం ప్రకటించింది.
తమిళనాడు ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు గానూ.. రూ.12వేల 110కోట్లు ప్రకటించింది. కోఆపరేటివ్ బ్యాంకుల్లో 16.43లక్షల రైతులు లబ్ధి పొందనున్నట్లు వెల్లడైంది. రాష్ట్ర అసెంబ్లీ వేదికగా సీఎం కే పళనిస్వామి అనౌన్స్ చేశారు. స్కీం వెంటనే అమల్లోకి రానున్నట్లు ఈ మేర కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు.

చేసిన వాగ్దానాలను నెరవేర్చేది కేవలం ఏఐఏడీఎంకే పార్టీ ఒక్కటేనని తాజా సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ అన్నారు. ప్రతిపక్ష పార్టీ డీఎంకేను టార్గెట్ చేస్తూ.. వారంతా రెండెకరాల వ్యవసాయ భూమిని ఇస్తామని చేసిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోలేక విఫలమైనట్లు తెలిపారు.దీంతో సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న దాదాపు 16.43లక్షల మంది రైతులకు రుణమాఫీ ప్రయోజనం దక్కనుంది. ఈ పథకం వెంటనే అమలులోకి వస్తుందని వెల్లడించారు. దీనికి అవసరమైన నిధులను తమ ప్రభుత్వం వెంటనే సమకూరుస్తుందన్న ఆయన తెలిపారు. రైతు రుణమాఫీనే కాకుండా మరిన్ని నూతన సంక్షేమ పథకాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

కాగా అకాలవర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న పంటలకు రూ.1,117 కోట్ల పరిహారాన్ని సీఎం ఇంతకుముందే ప్రకటించారు. దీంతో సుమారు 11 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. తమిళనాడులో ఎడతెరిపి లేని వర్షాలతో భారీగా పంట నష్టానికి దారితీసింది. గతేడాది సాధారణ స్థాయిలతో పోలిస్తే రాష్ట్రంలో 708 శాతం అధిక వర్షపాతం నమోదైంది. పంటకోత దశలో ఉండగా కురిసిన వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు అతలాకుతలమైన సంగతి తెలిసిందే.

ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి. 





అన్నయ్య రంగంలోకి దిగితే.. రికార్డులన్ని సైడ్ ఇవ్వాల్సిందే..!

RRR సీక్వల్ రాజమౌళి మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!

అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?

ఆచార్య నిజంగా నైజాంలో అంత రాబడుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kurapati Dileep Kumar]]>