Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/tdp-mla-ganta-sreenivasa-rao-resignation23966ea9-4e80-4227-919e-329e2b519ab3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/tdp-mla-ganta-sreenivasa-rao-resignation23966ea9-4e80-4227-919e-329e2b519ab3-415x250-IndiaHerald.jpgవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీరుపై అనేకమంది నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఈ నిర్ణయం..ganta sreenivaas;amala akkineni;srinivas;amaravati;andhra pradesh;రాజీనామా;vishakapatnam;assembly;mla;tdp;local language;central government;kavuru srinivasగంటా రాజీనామా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై పెరుగుతున్న హీట్గంటా రాజీనామా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై పెరుగుతున్న హీట్ganta sreenivaas;amala akkineni;srinivas;amaravati;andhra pradesh;రాజీనామా;vishakapatnam;assembly;mla;tdp;local language;central government;kavuru srinivasSat, 06 Feb 2021 16:43:00 GMT

అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీరుపై అనేకమంది నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది. అంతే కాదు తన రాజీనామా లేఖను ఆయనే స్వయంగా స్పీఎకర్ కు అందజేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కు సంబంధించి కేంద్రం నిర్ణయం అమలులోకి రాగానే తన రాజీనామాను ఆమోదించాలని అసెంబ్లీ స్పీకర్‌ను గంటా కోరారు.



జిల్లాకే గొప్ప పేరు తెచ్చిన స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నిర్ణయాన్ని నిరసిస్తూనే పదవి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజకీయేతర జేఏసీని ఏర్పాటు చేస్తానని గంటా శ్రీనివాస్ ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా పోరాటం చేస్తానని గంటా తెలిపారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని గంటా శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

     

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను 100 శాతం ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ పేరుతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటీకరించేందుకు ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ ప్రతిపక్షాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక యూనియన్లు, ప్రజలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నిరసనలు తెలుపుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం ఏకంగా స్థానిక ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.





Breaking :అల్లు అర్జున్ క్యారవాన్ కు ప్రమాదం..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు

ఆరు గదులు.. రెండు బెడ్ రూమ్లు.. గంగవ్వ కొత్తిల్లు ఎలా ఉండబోతుంది..!

అఖిల్ ష్యూర్ షాట్ హిట్ కొడుతున్నాడా.. అంత కాన్ఫిడెన్స్ ఎందుకో..!

సుకుమార్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు లకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టిన దేవిశ్రీప్రసాద్..!!

వావ్.. మహేశ్‘సర్కారు వారి పాట’ హాలీవుడ్ లెవెల్లో ఉండబోతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>