PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janasenatho-ycp-potthuku-prayathnamf2ee134a-110e-45ed-b9e3-b25b0aedde80-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janasenatho-ycp-potthuku-prayathnamf2ee134a-110e-45ed-b9e3-b25b0aedde80-415x250-IndiaHerald.jpgవిశాఖ ఉక్కు విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక నియోజకవర్గ పరిధిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నా సరే ఆయన కనీసం స్పందించడం లేదు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి జనసేన పార్టీ మద్దతు ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో చెప్పడం చూసి చాలా మంది షాక్ అయ్యారు. దీనితో జనసేన పార్టీ అభిమానులు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు అయిపోయిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక పnadendla;pawan;modi;amit shah;hari;hari music;kalyan;bharatiya janata party;nadendla manohar;amith shah;janasena;telugu;vishakapatnam;central government;janasena party;party;gajuwakaదెబ్బకు మాట మార్చిన నాదెండ్ల...!దెబ్బకు మాట మార్చిన నాదెండ్ల...!nadendla;pawan;modi;amit shah;hari;hari music;kalyan;bharatiya janata party;nadendla manohar;amith shah;janasena;telugu;vishakapatnam;central government;janasena party;party;gajuwakaSat, 06 Feb 2021 07:12:00 GMTవిశాఖ ఉక్కు విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక నియోజకవర్గ పరిధిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నా సరే ఆయన కనీసం స్పందించడం లేదు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి జనసేన పార్టీ మద్దతు ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో చెప్పడం చూసి చాలా మంది షాక్ అయ్యారు. దీనితో జనసేన పార్టీ అభిమానులు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు అయిపోయిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించడం, బిజెపి మేము పోరాటం చేస్తామని చెప్పడం వంటివి హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నేపధ్యంలో జనసేన పార్టీ కీలక నేత జనసేన పిఎసి కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి జనసేన కృషి చేస్తుంది అని ఆయన వెల్లడించారు. విశాఖ ఉక్కు కర్మాగారం... తెలుగువారి ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకు ప్రతీక అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇటువంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నుంచి పెట్టుబడుల ఉపసంహరణ బాధాకరం అని ఆయన ఆరోపించారు. 

22 వేల ఎకరాల్లో విస్తరించి 17 వేల మంది పర్మినెంట్, 16 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులుతో కంపెనీ ఉందని ఆయన తెలిపారు. లక్షమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తున్న ఉక్కు ప్లాంటు అని వెల్లడించారు. ఎందరో త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన ఈ కర్మాగారం అని అన్నారు. చేతులు మారుతుందంటే తెలుగువారందరికీ ఆమోదయోగ్యం కాదు అని, ఉక్కు కర్మాగారాన్ని ఇప్పటి పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి జనసేన పార్టీ తనవంతు కృషి చేస్తుంది అని తెలిపారు. కేంద్రం తన ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని మోడీ, అమిత్ షా, నడ్డాలను పవన్ కళ్యాణ్ త్వరలో కలుస్తారు అని తెలిపారు. కాగా పత్రికా ప్రకటనను నాదెండ్ల విడుదల చేసిన సంగతి తెలిసిందే.



హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!

టీడీపీలో కొత్త జోష్‌.. ఈ నేత‌ల్లో ఇంత స‌డెన్ చేంజ్ ఏంటి ?

హెరాల్డ్ స్మ‌రామీ : దేశం గ‌ర్వించ‌ద‌గిన‌ చిత్ర‌కారుడు దామెర్ల‌... తెలుగువాడ‌ని మీకు తెలుసా..?!

ఆ కమ్మ నేతలు వైసీపీకి డ్యామేజ్ చేస్తారా ?

జగడ్డ: విజయనగరం జిల్లాలో గెలుపు కోసం బొత్స మాస్టర్‌ ప్లాన్..?

ఆ మూడు చోట్ల జగన్‌ని కాపు కాస్తారా ? పవన్‌ని కాచుకుంటారా ?

హెరాల్డ్ సెటైర్ : ప్రభుత్వం Vs నిమ్మగడ్డ..సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులుండవేమో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>