PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/high-court-sensational-decision-on-ewatch-app99650249-696b-4a6f-995d-5e01d4f06e62-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/high-court-sensational-decision-on-ewatch-app99650249-696b-4a6f-995d-5e01d4f06e62-415x250-IndiaHerald.jpgఈవాచ్ యాప్ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 9వరకు అమల్లోకి తీసుకురావొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. యాప్ కు సంబంధించి భద్రతా ధృవపత్రం అందలేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ధ్రువపత్రానికి ఐదు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేసింది హైకోర్టు.ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల పర్యవేక్షణ కోసం.. ఎస్‌ఈసీ ఈ-వాచ్‌ పేరిట కొత్త యాప్‌ను తీసుకురావడం వివాదాస్పదమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న యాప్‌లను కాదనిhigh court sensational decision on ewatch app;andhra pradesh;panchayati;lawyer;fire;central government;ycp;election commissionఈవాచ్ యాప్ పై హైకోర్టు సంచలన నిర్ణయం..!ఈవాచ్ యాప్ పై హైకోర్టు సంచలన నిర్ణయం..!high court sensational decision on ewatch app;andhra pradesh;panchayati;lawyer;fire;central government;ycp;election commissionFri, 05 Feb 2021 14:30:00 GMTన్యాయవాది చెప్పారు. ధ్రువపత్రానికి ఐదు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేసింది హైకోర్టు.  

ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల పర్యవేక్షణ కోసం.. ఎస్‌ఈసీ ఈ-వాచ్‌ పేరిట కొత్త యాప్‌ను తీసుకురావడం వివాదాస్పదమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న యాప్‌లను కాదని సొంతంగా ఈ యాప్‌ను రూపొందించింది ఎస్ ఈసీ. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఈ యాప్‌ను ఇప్పటికే లాంచ్‌ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు, ప్రలోభాల పై ఫిర్యాదులు అందుకోవటం కోసమే ఈ యాప్ అంటోంది ఎస్‌ఈసీ.

అయితే ఈ యాప్‌ను ఎక్కడ తయారు చేశారు, ఎవరు నిర్వహిస్తున్నారు? డేటా బేస్‌ ఎక్కడ స్టోర్‌ అవుతుంది? యాప్‌లో పొందుపరిచిన సమాచారం పై భద్రత ఎంత? ఫిర్యాది దారులు పంపించే ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్‌, ఎడిటింగ్‌ చేసే అవకాశాల పై ఉన్న అనుమానాలు, ఒక వర్గం వారి ఫిర్యాదులను మాత్రమే యాప్‌లో డిస్‌ప్లే చేసే సాంకేతిక వెసులుబాటు... తదితర అంశాలపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీన్ని వెంటనే నిలుపుదల చేయాలంటూ.. తిరిగి ఎస్‌ఈసీకే ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు.

అనుమానాల పై ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా.. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఈ వాచ్‌ యాప్‌ను విడుదల చేయడంతో కోర్టు తలుపు తట్టింది ప్రభుత్వం. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పంచాయతీ రాజ్‌ శాఖ రూపొందించిన యాప్‌ అందుబాటులో ఉంది. అదే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీ- విజిల్‌ పేరుతో ఒక యాప్‌ అందుబాటులో ఉంచింది. వీటిని ఉపయోగించుకోకుండా వివిదాస్పద యాప్‌ విడుదల చేయాల్సిన అవసరం ఏంటని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఎస్‌ఈసీకి పోటీగా.. నేత్ర పేరుతో మరో యాప్‌ను తీసుకొచ్చింది వైసీపీ. దీంతో, ఇప్పటికే ఉన్న నిప్పుల కుంపటికి ఈ యాప్‌ మరింత ఆజ్యం పోసిందనే అభిప్రాయం రాష్ట్ర రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.









పోలీసులు కూడా ఇలాంటి ట్వీట్లు చేస్తారా..? ఎక్కడా తగ్గడం లేదుగా..!

రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట్లో ప్రత్యేకంగా శాంతి పూజలు.. ఎందుకంటే..!?

జగడ్డ : దీన్నే షాక్ అంటారా ?

బాలయ్య బాబుకు బీపీ చెకింగ్.. అలాగే వస్తుందిలేండని అంతా ఆసక్తి

జగడ్డ: చంద్రబాబు దెబ్బకి అప్పులపాలవుతున్న టీడీపీ నేతలు..

జగడ్డ: ధర్మవరంలో వైసీపీ నేత దౌర్జన్యం...కాళ్ళు చేతులు నరికేస్తానంటూ వార్నింగ్...?

జగడ్డ : అన్నంత పనీ చేసిన నిమ్మగడ్డ.. ఆ జిల్లాల ఏకగ్రీవాలు నిలిపివేత !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>