MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar-changed-these-tollywood-heros-styleb923526f-60bd-4357-89ed-04cf418572c1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar-changed-these-tollywood-heros-styleb923526f-60bd-4357-89ed-04cf418572c1-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఉండే ప్రతిఒక్కరికి ఒక్కో డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. అలాగే సినిమాను డైరెక్ట్ చేసే దర్శకుడు ఆలోచించే విధానం కూడా భిన్నంగా ఉంటుంది.సినిమా విజయ పధంలో ముందుకు వెళ్లాలంటే దర్శకుడు తనలోని ప్రతిభను సినిమా సినిమాకు డిఫరెంట్ గా చూపిస్తూ ఉండాలి. కధ విషయంలో గాని, హీరో క్యారెక్టర్ విషయంలో కానీ ఒక్కో దర్శకుడు ఒక్కో స్టైల్ మైంటైన్ చేస్తూ ఉంటారు. sukumar;mahesh;ntr;naga chaitanya;kumaar;allu arjun;arya;jeevitha rajaseskhar;jr ntr;naga;ram pothineni;sukumar;tollywood;cinema;naga aswin;school;love;audience;director;temper;hero;traffic police;nandamuri taraka rama rao;devadas;arjun 1;arya 2;gangothri;aryaa;mass;loverసుకుమార్ ఈ 8 మంది హీరోల జీవితం ఎలా మార్చేసాడో తెలుసా..?సుకుమార్ ఈ 8 మంది హీరోల జీవితం ఎలా మార్చేసాడో తెలుసా..?sukumar;mahesh;ntr;naga chaitanya;kumaar;allu arjun;arya;jeevitha rajaseskhar;jr ntr;naga;ram pothineni;sukumar;tollywood;cinema;naga aswin;school;love;audience;director;temper;hero;traffic police;nandamuri taraka rama rao;devadas;arjun 1;arya 2;gangothri;aryaa;mass;loverFri, 05 Feb 2021 11:44:40 GMT
సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రతిఒక్కరికి ఒక్కో డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. అలాగే సినిమాను డైరెక్ట్ చేసే దర్శకుడు  ఆలోచించే విధానం కూడా  భిన్నంగా ఉంటుంది.సినిమా విజయ పధంలో ముందుకు వెళ్లాలంటే దర్శకుడు తనలోని ప్రతిభను సినిమా సినిమాకు డిఫరెంట్ గా చూపిస్తూ ఉండాలి.  కధ విషయంలో గాని, హీరో క్యారెక్టర్ విషయంలో కానీ ఒక్కో దర్శకుడు ఒక్కో స్టైల్ మైంటైన్ చేస్తూ ఉంటారు. అలా తమకంటూ ప్రేక్షకుల్లో ఒక  గుర్తింపును తెచ్చుకుని ఫేమస్ అయిపోతారు. అలా మన  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో డిఫరెంట్ స్టైల్ మైంటైన్ చేసే దర్శకులలో సుకుమార్ కూడా ఒకరు. సినిమా సినిమాకి వేరియేషన్స్ చూపించడంలో సుకుమార్  దిట్ట. ఆయన సినిమాలో నటించే హీరోల క్యారెక్టర్ లు, వాళ్ళ లుక్, అప్పియరెన్స్ ల విషయం లో సినిమా సినిమాకి తేడా చూపిస్తాడు. ఒకసారి సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమాల  లిస్ట్ పరిశీలిస్తే మీరు కూడా సినిమా సినిమాకి ఉన్న వైవిధ్యాన్ని గ్రహిస్తారు



 సుకుమార్  యంగ్ హీరో రామ్ తో కలిసి చేసిన  దేవదాస్, జగడం రెండు సినిమాలోనూ రామ్ మాస్ క్యారెక్టర్ లోనే చేసారు. కానీ ఈ రెండు మాస్ క్యారెక్టర్ల ను గమనిస్తే ఈ రెండింటికి చాలా  వేరియేషన్ ఉంటుంది. అది సుకుమార్ దర్శకత్వంలో ప్రత్యేక మార్క్. అలాగే అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమాలో స్కూల్ పిల్లాడిలా కనిపిస్తాడు. కానీ  ఆ తరువాత ఆర్య సినిమాతో ఒక్కసారిగా స్టైలిష్ స్టార్ అయిపోయేలా చేసాడు మన డైరెక్టర్. అలాగే అదే అల్లు అర్జున్ తో ఆర్య 2 కూడా తీశారు. కానీ ఈ రెండు సినిమాల్లోనూ కధ, హీరో స్టైల్, ఆటిట్యూడ్, క్యారెక్టర్ అన్నీ కొత్తగా చూపించాడు..ఒకదానికి ఒకటి పొంతన ఉండదు. హీరో లుక్స్ విషయంలో కూడా చాలా వెరైటీ గా ఆలోచిస్తాడు సుకుమార్. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంచుకునే పాత్రలు వెరైటీ గా ఉంటాయి. టెంపర్ సినిమాలో కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ గా మాస్ ఆడియన్స్ ని అలరించిన ఎన్టీఆర్ ను నాన్నకు ప్రేమతో సినిమాలో ఒక  అల్ట్రా స్టైలిష్ హీరోగా మార్చేశాడు సుకుమార్. ఎన్టీఆర్ గడ్డంతో ఈ సినిమాలో కనిపిస్తాడు. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సాఫ్ట్ గా కూల్ గా ఉన్న మహేష్ బాబు ని నేనొక్కడినే సినిమా ద్వారా ఒక్కసారిగా  రాక్ స్టార్ గా మార్చేశాడు



సుకుమార్ కి  అల్లు అర్జున్ కి బాగా సెట్ అవుతుంది. వీళ్ళ కాంబినేషన్ అంటే సినిమా మాములుగా ఉండదు. అల వైకుంఠ పురం సినిమాలో ఒక మధ్య తరగతి అబ్బాయి నుంచి పుష్ప సినిమా ద్వారా ఊర మాస్ గెట్ అప్ లోకి మార్చేశాడు. ఈ మేక్ ఓవర్ చూస్తే సుకుమార్ క్రియేటివిటీ అర్ధం అవుతుంది కదా. అలాగే నాగచైతన్య నటించిన ఏమాయ చేసావే సినిమాకి, 100 % లవ్ సినిమాకి చాలా తేడా ఉంటుంది.  క్లాస్ లవర్ బాయ్ లుక్ నుంచి  నుంచి కన్నింగ్ ఇంటెలిజెంట్ బాయ్ గా  నాగ చైతన్యని మార్చేశాడు మన సుకుమార్. ఇలా సినిమా సినిమాకి వేరియేషన్స్ చూపిస్తూ, హీరోలను డిఫరెంట్ స్టైల్స్ తో ప్రేక్షకులకు పరిచయం చేయడంలో సుకుమార్ కి సాటి ఎవ్వరు లేరు.. !!


ఆలయాలపై కొత్త లెక్కలు.. ఆ పాపం టీడీపీ ఖాతాలోకే..

కొన్నాళ్లు గుర్తుండిపోయే 'ఉప్పెన' కథ.. సూపర్ హిట్ సినిమా ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఏంటి బాబోయ్..!

ఒకప్పుడు డ్యాన్సర్స్ అయిన వీరంతా ఇప్పుడు టాప్ యాక్టర్స్..

తొలి విడ‌త ఏక‌గ్రీవాల్లో జ‌గ‌న్‌కు క‌డ‌ప‌లో షాక్‌... పెద్దిరెడ్డి ట్విస్ట్ ..!

ఆచార్య లెక్కలు చూసి బెంబేలు పడుతున్న ఇండస్ట్రీ వర్గాలు !

జగడ్డ : విశాఖ ఏకగ్రీవాల్లో అతి పెద్ద రికార్డు ?

చీరాల పంచాయితీ తేల్చేసిన జ‌గ‌న్‌... క‌ర‌ణం, ఆమంచికి ఇలా పంచేశారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>