PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-govt-not-ready-to-municipal-election94dda699-ffc8-4199-821c-e0c56a9a9b09-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-govt-not-ready-to-municipal-election94dda699-ffc8-4199-821c-e0c56a9a9b09-415x250-IndiaHerald.jpgమున్సిపల్‌ చట్టం ప్రకారం పాలకవర్గాల గడువు ముగింపునకు మూడు నెలల ముందు నుంచే తదుపరి ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాలి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ ప్రభుత్వానికి లేఖ రాసింది.గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లతోపాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు ఒకేదఫా మే నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి.ttd tirumala;kcr;telangana rashtra samithi trs;warangal;andhra pradesh;telangana;panchayati;february;letter;local language;petta;siddipetఆ ఎన్నికలు వాయిదానే!ఆ ఎన్నికలు వాయిదానే!ttd tirumala;kcr;telangana rashtra samithi trs;warangal;andhra pradesh;telangana;panchayati;february;letter;local language;petta;siddipetFri, 05 Feb 2021 09:17:07 GMTఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తోంది ఏపీ ఎస్ఈసీ. ఫిబ్రవరి 9న తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. తర్వాత గత మార్చిలో ఎన్నికల ప్రక్రియ మొదలై... కరోనా కారణంలో మధ్యలోనే వాయిదా పడిన ఎంపీటీసీ , జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుందని తెలుస్తోంది. అయితే తెలంగాణలో కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కాని అక్కడ ఎన్నికలు నిర్వహించకుండా కొంత కాలం ప్రత్యేక అధికారుల పాలనలో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

          తెలంగాణలో ఇప్పటికే మూడు మున్సిపాలిటీలు ప్రత్యేకాధికారుల చేతులలోకి వెళ్లాయి. ఇంకా రెండు కార్పొరేషన్లు, ఒక మున్సిపాలిటీ పాలకవర్గాల గడువు వచ్చేనెలలో ముగిసిపోతుంది. అయితే ఇక్కడ కూడా స్పెషల్ అఫీసర్లను నియమించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించిందని చెబుతున్నారు. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. అందుకే ఇప్పుడే ఈ ఎన్నికలు నిర్వహించకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో కొంత ఆలస్యంగా ఈ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వార్డుల తుది జాబితా రూప కల్సన , రిజర్వేషన్ల ప్రక్రియలో జాప్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మున్సిపల్‌ చట్టం ప్రకారం పాలకవర్గాల గడువు ముగింపునకు మూడు నెలల ముందు నుంచే తదుపరి ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాలి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట పురపాలికల్లో శివారు గ్రామ పంచాయతీలు, ప్రాంతాలు విలీనం కావడంతో వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లను చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో పురపాలికలకు ప్రత్యేకాధికారుల పాలన తప్పదని స్పష్టమవుతోంది.

గడువు మీరిన వాటన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లతోపాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు ఒకేదఫా మే నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి.


రామ్మోహన్ బామ్మర్ది చాలా చేస్తున్నాడే...!

ఏపీఎస్‌ ఆర్టీసీలో టికెట్‌ బుక్‌ చేస్తున్నారా.. ఒక్క నిమిషం ఆగండి..!

ఏపీ రెవెన్యూ ఉద్యోగుల్లో భయం భయం..

కాపు వేద‌న‌: ప‌శ్చిమ కాపుల దెబ్బ వాళ్లిద్ద‌రిలో ఎవ‌రికో ?

హీరోయిన్ న్యూడ్ ఫోటో అడిగిన నెటిజెన్.. మైండ్ బ్లాంక్ అయ్యే పిక్ పెట్టింది..!

కాపు వేద‌న‌: కాపు కోట‌లోనూ వైసీపీ రెడ్ల‌దే హ‌వా ? వీళ్లంతా ల‌బోదిబో ?

స‌జ్జ‌ల సొంత పార్టీలోనే టార్గెట్ అయ్యారే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>