PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections763afe8d-23cc-4528-8058-225d2c206fd1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections763afe8d-23cc-4528-8058-225d2c206fd1-415x250-IndiaHerald.jpgవిశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు' అంటూ రెండవ రోజు శుక్రవారం కార్మికుల ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. వందల సంఖ్యలో స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. దీంతో కూర్మన్నపాలెం సెంటర్‌లో భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. స్టీల్ ఫ్లాంట్ ప్రైవీటీకరణను నిరసిస్తూ అఖిలపక్ష సంఘాలు, కార్మికులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో జీవీఎంసీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్మికుల ఆందోళనకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ప్రాణాలు త్యాగం చేసైనా విశాఖ ఉక్కును సాధించుకుంటామని నినాదాలు చేశారు. jagan-nimmagadda-elections;jagan;nara lokesh;narendra modi;vishakapatnam;police;cm;bike;tdp;kakinada;lokesh kanagaraj;reddyజగడ్డ: ఎన్నికల ముంగిట తెలుగు దేశానికి కొత్త అస్త్రం.. లోకేష్ కీలక ప్రకటన !జగడ్డ: ఎన్నికల ముంగిట తెలుగు దేశానికి కొత్త అస్త్రం.. లోకేష్ కీలక ప్రకటన !jagan-nimmagadda-elections;jagan;nara lokesh;narendra modi;vishakapatnam;police;cm;bike;tdp;kakinada;lokesh kanagaraj;reddyFri, 05 Feb 2021 16:27:34 GMTవిశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు' అంటూ రెండవ రోజు శుక్రవారం కార్మికుల ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. వందల సంఖ్యలో స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. దీంతో కూర్మన్నపాలెం సెంటర్‌లో భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. స్టీల్ ఫ్లాంట్ ప్రైవీటీకరణను నిరసిస్తూ అఖిలపక్ష సంఘాలు, కార్మికులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో జీవీఎంసీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్మికుల ఆందోళనకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ప్రాణాలు త్యాగం చేసైనా విశాఖ ఉక్కును సాధించుకుంటామని నినాదాలు చేశారు. 



ఆంధ్రుల గుండెకాయలాంటి విశాఖ ఉక్కు పరిశ్రమను మోదీ ప్రభుత్వం లోపాయికారీగా ప్రైవేటుపరం చేయడానికి సిద్ధమైంది. ఇలా చేయడం వల్ల ఎంత మందికి నష్టం జరుగుతుంది అనేది ఆలోచించలేదు.. అంటూ కొందరు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయం పై టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ బాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కుని తన స్వార్ధ ప్రయోజనాల కోసం సీఎంజగన్ రెడ్డి తాకట్టు పెడుతున్నాడు.. 28 మంది వైకాపా ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం లాభం? 32 మంది ప్రాణాలు త్యాగంచేసి సాధించుకున్న స్టీల్‌ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. 



వేలాది మంది ప్ర‌త్య‌క్షంగా,ల‌క్ష‌లాదిమంది ప‌రోక్షంగానూ ఉపాధి పొందుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికే మ‌ణిహారంగా వెలుగొందుతోన్న విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని అమ్మేస్తుంటే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి మౌనం దాల్చ‌డం అవమానకరం. ఇలా ఒక్కో ప‌రిశ్ర‌మా అమ్మేయ‌డం,అడ‌వులు-కొండ‌ల్ని క‌బ్జా చేయ‌డ‌మేనా ప‌రిపాల‌నా అంటూ లోకేశ్ బాబు ప్రశ్నలు కురిపించారు. కాకినాడ పోర్టు విజ‌యసాయిరెడ్డి అల్లుడికి వ‌ర‌క‌ట్నంగా రాసిచ్చేశారు. విశాఖ ఏజెన్సీలో లేట‌రైట్ గ‌నులు బాబాయ్ సుబ్బారెడ్డికి బ‌హూక‌రించారు.త‌న దోపిడీ మ‌త్తుకి మంచింగ్‌గా మ‌చిలీప‌ట్నం పోర్టుని నంజుకు తింటున్నారు.ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ని తన సూట్ కేసు కంపెనీలతో తుక్కు రేటుకి కొని దోపిడీ వికేంద్రీక‌ర‌ణ ప‌రిపూర్ణం చేసుకోబోతున్నారు. ఇలా ఒక్కొక్కటి లాక్కుంటూ ప్రజల రక్తాన్ని తాగుతున్నారు..ప్రజలు అధికారం నుంచి దించే సమయం దగ్గరపడింది.. అంటూ మండిపడ్డారు..





ఆ సినిమాకు 5 కోట్లు పెడితే, కేవలం 14 లక్షలు వచ్చాయి.. కారణం అదే..

వావ్ గ్రేట్‌..! పెళ్లి ప‌త్రిక‌ల‌పై రైతు ఉద్య‌మ నినాదం...

దిల్ రాజుకి షాకిచ్చిన వరంగల్ శ్రీను.. కానీ !

పవన్, మహేశ్ మధ్య వార్ పీక్ స్టేజ్ కు..!

ఉప్పెన ట్రైలర్.. ఓ రేంజ్ లో ట్రోల్స్..!

పవన్ సరసన నిధి క్లారిటీ ఇచ్చేసింది !

రమ్యకృష్ణ ఒక్క రోజు వేతనం ఎంతో తెలిసి తల పట్టుకుంటున్న ప్రొడ్యూసర్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>