PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-politics27526f94-0b71-484a-8d95-3904f150945f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-politics27526f94-0b71-484a-8d95-3904f150945f-415x250-IndiaHerald.jpgఆంద్ర ప్రదేశ్ లో ముఖ్యంగా రెండు పార్టీలు మాత్రమే రాజ్యమేళుతున్నాయి. ఒకటే చంద్రబాబు అద్యక్షతన ఉన్న తెలుగుదేశం పార్టీ కాగా మరొకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం ఈ రెండు పార్టీల జోరు మాత్రమే ఏపీ లో అధికంగా ఉందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉన్నప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో ఆ పార్టీ ప్రభావం చూపడం లేదు అనేది కాదనలేని వాస్తవం. ఇక కాంగ్రెస్ పార్టీ ఏపీ లో అసలు కనుమరుగు అయింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతున్న బి‌జే‌పి పార్టీ ఏపీలో పట్టు కోసం ఇంకా ap politics;pawan;kalyan;bharatiya janata party;telugu desam party;andhra pradesh;janasena;y. s. rajasekhara reddy;congress;district;telugu;backward classes;letter;tdp;ycp;janasena party;reddy;party;gurazalaబాబోరు,జగనోరు అలా చెయ్యగలరా ..??బాబోరు,జగనోరు అలా చెయ్యగలరా ..??ap politics;pawan;kalyan;bharatiya janata party;telugu desam party;andhra pradesh;janasena;y. s. rajasekhara reddy;congress;district;telugu;backward classes;letter;tdp;ycp;janasena party;reddy;party;gurazalaFri, 05 Feb 2021 09:10:22 GMT ఆంద్ర ప్రదేశ్ లో ముఖ్యంగా రెండు పార్టీలు మాత్రమే రాజ్యమేళుతున్నాయి. ఒకటే చంద్రబాబు అద్యక్షతన ఉన్న తెలుగుదేశం పార్టీ కాగా మరొకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం ఈ రెండు పార్టీల జోరు మాత్రమే ఏపీ లో అధికంగా ఉందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉన్నప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో ఆ పార్టీ ప్రభావం చూపడం లేదు అనేది కాదనలేని వాస్తవం. ఇక కాంగ్రెస్ పార్టీ ఏపీ లో అసలు కనుమరుగు అయింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతున్న బి‌జే‌పి పార్టీ ఏపీలో పట్టు కోసం ఇంకా పోరాడుతూనే ఉంది.

అయితే ప్రస్తుతం ఏపీలో హవా కొనసాగిస్తున్న వైసీపీ, టి‌డి‌పి పార్టీలు స్వపరిపాలన ను కొనసాగిస్తూ ఇతరులకు అవకాశాలు ఇవ్వడంలో చిన్న చూపు వహిస్తున్నాయని పలువురి రాజకీయ విశ్లేషకుల వాదన. ఎందుకంటే టి‌డి‌పి గెలిస్తే ఆ పార్టీ తరుపున ముఖ్యమంత్రిగా చంద్రబాబు తప్ప ఇతరులకు ఇంతవరకు అవకాశం కల్పించలేదు. పార్టీలో ఎంతో బలమైన నాయకులు, ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు, ప్రజా పలుకుబడి పుష్కలంగా ఉన్న వాళ్ళు చాలమంది ఉన్నప్పటికి ఇంత వరకు సి‌ఎం అభ్యర్థిగా ఇతరులకు అవకాశం ఇవ్వలేదు. అలాగే ప్రస్తుతం సి‌ఎం గా కొనసాగుతున్న జగనోరు కూడా భవిష్యత్తు లో తన పార్టీ తరుపున ఇతరులను  సి‌ఎం రేస్ లో నిలబెడతారా అంటే ప్రశ్నార్థకమే అని చెప్పాలి.

అయితే తాజాగా బి‌జే‌పి రాష్ట్ర అద్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి తీరతామని సోము వీర్రాజు ప్రకటించారు.  ఇటీవల విజయవాడలో గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ వర్గీయులు బీజేపీలో చేరిన ఈ సందర్భంగా వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా కుటుంబ పార్టీలైన వైసీపీ, టీడీపీ పార్టీలు అలా చేయగలవా అని సవాల్‌ విసిరారు. మరి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఈయన చేసిన వ్యాఖ్యలు సరికొత్త రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి. .


ఆ ఎన్నికలు వాయిదానే!

రామ్మోహన్ బామ్మర్ది చాలా చేస్తున్నాడే...!

ఏపీఎస్‌ ఆర్టీసీలో టికెట్‌ బుక్‌ చేస్తున్నారా.. ఒక్క నిమిషం ఆగండి..!

ఏపీ రెవెన్యూ ఉద్యోగుల్లో భయం భయం..

కాపు వేద‌న‌: ప‌శ్చిమ కాపుల దెబ్బ వాళ్లిద్ద‌రిలో ఎవ‌రికో ?

హీరోయిన్ న్యూడ్ ఫోటో అడిగిన నెటిజెన్.. మైండ్ బ్లాంక్ అయ్యే పిక్ పెట్టింది..!

కాపు వేద‌న‌: కాపు కోట‌లోనూ వైసీపీ రెడ్ల‌దే హ‌వా ? వీళ్లంతా ల‌బోదిబో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>