PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mla-nadipelli-dayakar-rao2308af2a-bc73-4a6d-9833-18868bff8259-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mla-nadipelli-dayakar-rao2308af2a-bc73-4a6d-9833-18868bff8259-415x250-IndiaHerald.jpgమంచిర్యాల జిల్లాలో మావోల లేఖ కలకలం రేపుతోంది. మంచిర్యాల ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు మరియు ఆయన తనయుడు భూ దందాలు ఆపాలని హెచ్చరిస్తూ మావోయిస్టుల లేఖ రాశారు. ఈ లేఖ మావోయిస్టు పార్టీ కొలబెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ పేరుతో విడుదలైంది. లేఖలో mla nadipelli dayakar rao;allu aravind;prem;yellampalli;andhra pradesh;congress;court;assembly;mla;letter;local language;reddy;v;mancherial;partyమంచిర్యాల లో మావోల లేఖ కలకలం..ఎమ్మెల్యేకు వార్నింగ్మంచిర్యాల లో మావోల లేఖ కలకలం..ఎమ్మెల్యేకు వార్నింగ్mla nadipelli dayakar rao;allu aravind;prem;yellampalli;andhra pradesh;congress;court;assembly;mla;letter;local language;reddy;v;mancherial;partyFri, 05 Feb 2021 22:52:38 GMTమంచిర్యాల జిల్లాలో మావోల లేఖ కలకలం రేపుతోంది. మంచిర్యాల ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు మరియు ఆయన తనయుడు భూ దందాలు ఆపాలని హెచ్చరిస్తూ మావోయిస్టుల లేఖ రాశారు. ఈ లేఖ మావోయిస్టు పార్టీ కొలబెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ పేరుతో విడుదలైంది. లేఖలో వార్నింగ్ ఇస్తూ మావోలు హెచ్చరించారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా..భూముల సెటిల్మెంట్లు అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీల నాయకులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 2004 సంవత్సరం లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఆ సమయంలో కాంగ్రెస్ నుండి గెలిచిన దివాకర్ రావు ముంపు గ్రామాల ప్రజలను అదుకుంటానని చెప్పి..ఇప్పటి వరకు వారి సమస్యలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే తన అనుచరులు, అధికారులతో కుమ్మక్కై ముంపు గ్రామాల్లో కోట్ల రూపాయలు కాజేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతే కాకుండా గుడిపేటలో ఓ సర్పంచ్ కు కూడా లేఖలో హెచ్చరికలు జారీ చేసారు. ఓ సర్పంచ్ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాడాని తీరు మరకపోతే ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యే అక్కడి నాయకులతో ముంపు గ్రామాల నిర్వాసితులతో కోర్టులో కేసులు వేయించి వారి వద్ద కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా నడిపెళ్ళి దివాకర్ రావు రాజకీయాల్లో కింది స్థాయి నుండి ఎదిగారు. ఆయన మొదట మంచిర్యాల నగరంలో మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిచారు. ఆ తరవాత సింగిల్ విండో ఛైర్మెన్ గా పని చేసారు. పదేళ్ల పాటు కాంగ్రెస్ లో కొనసాగిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లక్షెటిపేట నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2014 లో టిఆర్ఎస్ టికెట్ అందుకుని కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం అరవింద్ రెడ్డి పై భారీ మెజారిటీతో గెలిచారు. మరోవైపు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావుపై 4వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.


ఆర్బీఐ లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

అన్నయ్య రంగంలోకి దిగితే.. రికార్డులన్ని సైడ్ ఇవ్వాల్సిందే..!

RRR సీక్వల్ రాజమౌళి మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!

అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>