MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/venkatesh4d0ea5ff-4f27-48e8-bfca-0ce310898a09-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/venkatesh4d0ea5ff-4f27-48e8-bfca-0ce310898a09-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో హీరో వెంకటేష్ గురించి తెలియని వారంటూ ఉండరు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కలియుగ పాండవులు సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన వెంకటేష్ వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోలలో ఒకరిగా మారాడు.venkatesh;venkatesh;anil music;srinivas;hyderabad;tollywood;cinema;hero;kavuru srinivas;f3;jayam manadera;narappaహీరోను కలిసేందుకు నడుచుకుంటూ వెళ్లిన వీరాభిమాని.. కానీ చివరికి??హీరోను కలిసేందుకు నడుచుకుంటూ వెళ్లిన వీరాభిమాని.. కానీ చివరికి??venkatesh;venkatesh;anil music;srinivas;hyderabad;tollywood;cinema;hero;kavuru srinivas;f3;jayam manadera;narappaFri, 05 Feb 2021 16:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో హీరో వెంకటేష్ గురించి తెలియని వారంటూ ఉండరు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కలియుగ పాండవులు సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన వెంకటేష్ వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోలలో ఒకరిగా మారాడు. ఈ మధ్యకాలంలో వెంకీ రీమెక్ సినిమాలు ఎక్కవగా చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం వెంకీ నారప్ప సినిమాలో నటిస్తున్నారు. ఇక చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల అభిమానులు అప్పుడప్పుడు తమ ఫేవరేట్ హీరోల బర్త్ డేలను సెలెబ్రేట్ చేయడం మాములుగా చూస్తుంటాం. కానీ తమ అభిమాన హీరోను కలవడానికి ఎక్కడో చిన్న గ్రామం నుండి సిటీకి కాలినడకన వెళ్లే వీరాభిమానులను అరుదుగా చూస్తుంటాం. అలాంటి వీరాభిమాని ఒకరు తాజాగా వార్తల్లో నిలిచాడు.

ఇక టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ వీరాభిమాని శ్రీనివాస్.. వేరే హీరోల అభిమానులను చూసి స్ఫూర్తి పొంది ఆయనను కలవడానికి హైదరాబాద్ చేరుకున్నాడు. తాండూర్ సమీపంలోని బుద్ధారం అనే తన సొంత గ్రామం నుండి శ్రీనివాస్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోకు చేరుకున్నాడు. ఇంతకుముందు కూడా శ్రీనివాస్ రెండుసార్లు వెంకటేష్ను కలవడానికి హైదరాబాద్కు వచ్చాడట. వచ్చిన ప్రతిసారి వెంకీని కలవలేకపోయాడు. కానీ ఈసారి కలుస్తాను అనే భరోసా పొందాడు.

ఇక నారప్ప షూటింగ్ కారణంగా హైదరాబాద్ లో లేకపోవడంతో శ్రీనివాస్ మళ్లీ కలవలేకపోయాడు. కాబట్టి వెంకీ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు శ్రీనివాస్ కు సమాచారం ఇస్తామని రామానాయుడు స్టూడియో వారు హామీ ఇచ్చారు. ఈ డై-హార్డ్ ఫ్యాన్ ప్రతి సంవత్సరం తన అభిమాన స్టార్ వెంకటేష్ పుట్టినరోజును సెలెబ్రేట్ చేస్తాడట. అయితే ‘జయం మనదేరా’ సినిమా నుండి వెంకీకి పెద్ద అభిమాని అని చెబుతున్నాడు శ్రీనివాస్. ఈ సందర్బంగా శ్రీనివాస్ తమ హీరో ఏదైనా ఉపాధి పొందడానికి సహాయం చేస్తాడనే ఆశతో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం వెంకటేష్ నారప్ప సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా ఇదే ఏడాది విడుదల కాబోతున్నాయి.


ఆచార్యలో ఆ సీన్స్ కి విజిల్స్ పడటం ఖాయమట....

దిల్ రాజుకి షాకిచ్చిన వరంగల్ శ్రీను.. కానీ !

పవన్, మహేశ్ మధ్య వార్ పీక్ స్టేజ్ కు..!

ఉప్పెన ట్రైలర్.. ఓ రేంజ్ లో ట్రోల్స్..!

పవన్ సరసన నిధి క్లారిటీ ఇచ్చేసింది !

రమ్యకృష్ణ ఒక్క రోజు వేతనం ఎంతో తెలిసి తల పట్టుకుంటున్న ప్రొడ్యూసర్స్

జాంబి రెడ్డి ఎలా ఉందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>