PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anxiety-in-myanmar-tensiona1b6a335-1f05-43fd-9236-c7a70a172276-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anxiety-in-myanmar-tensiona1b6a335-1f05-43fd-9236-c7a70a172276-415x250-IndiaHerald.jpgమయన్మార్‌ కొన్ని దశాబ్దాల పాటు నియంతృత్వ సైనిక పాలనలో మగ్గి ఇప్పుడిప్పుడే పురుడుపోసుకుంటున్న ప్రజాస్వామ్యాన్ని మరోసారి సైన్యం ఖూనీ చేసింది. ఐదు దశాబ్దాల తర్వాత 2015లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడగా.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే, కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న కొద్ది గంటల ముందే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాత్రికి రాత్రే ఎన్ఎల్డీ నేత ఆంగ్ సాన్ సూకీ, అధ్యక్షుడు సహా దాదాపు 400 మంది ఎంపీలను సైన్యం నిర్బంధించిందిmayanmar;pratishta;tiru;american samoa;mp;police;capital;international;partyమయన్మార్ సైనిక తిరుగుబాటుపై వెల్లువెత్తుతున్న విమర్శలు...మయన్మార్ సైనిక తిరుగుబాటుపై వెల్లువెత్తుతున్న విమర్శలు...mayanmar;pratishta;tiru;american samoa;mp;police;capital;international;partyFri, 05 Feb 2021 21:30:00 GMTమయన్మార్‌ కొన్ని దశాబ్దాల పాటు నియంతృత్వ సైనిక పాలనలో మగ్గి ఇప్పుడిప్పుడే పురుడుపోసుకుంటున్న ప్రజాస్వామ్యాన్ని మరోసారి సైన్యం ఖూనీ చేసింది. ఐదు దశాబ్దాల తర్వాత 2015లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడగా.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే, కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న కొద్ది గంటల ముందే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాత్రికి రాత్రే ఎన్ఎల్డీ నేత ఆంగ్ సాన్ సూకీ, అధ్యక్షుడు సహా దాదాపు 400 మంది ఎంపీలను సైన్యం నిర్బంధించి అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. దీంతో మాయన్మార్‌లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే సాకుతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని సైన్యం కూలదోసింది. ఏడాదిపాటు ఎమర్జెన్సీని విధించిన సైన్యం.. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. రాజధాని నేపిడాలో ప్రభుత్వ గృహ సముదాయంలోనే ఎంపీలు నిర్బంధంలోనే ఉన్నారు. బయటకు వెళ్లేందుకు తమను అనుమతించడం లేదని, గృహ సముదాయంలో పోలీసులు, దాని బయట సైనికులు కాపలాగా ఉన్నారని ఓ ఎంపీ చెప్పారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోడానికి, ఫోన్‌లో సంభాషించేందుకు మాత్రం పోలీసులు తమను అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కడికైనా తరలిస్తారేమోనన్న భయంతో సోమవారం రాత్రి నిద్రపోలేదని పేర్కొన్నారు.




మరోవైపు, ఉపాధ్యక్షుడు మయింట్‌ స్వెని తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించిన సైన్యం.. ఆ వెంటనే ఆయన సర్వాధికారాలను సైన్యాధిపతి మిన్‌ ఆంగ్‌ లయాంగ్‌కు బదలాయించారు. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అధికారాలను ఇలా బదలాయించేందుకు మాయన్మార్ రాజ్యాంగం అనుమతిస్తుంది. అలాగే, 13 మంది మాజీ సైనికాధికారులతో కొత్త క్యాబినెట్‌ను లయాంగ్ ఏర్పాటుచేశారు. అందులోని సభ్యులంతా మాజీ సైనికాధికారులే. కాగా మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటుతో యంగూన్ నగరంలోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అనవసర ప్రయాణాలు చేయొద్దని అక్కడి భారతీయులకు సూచించింది. కాగా, మాయన్మార్‌లో సైనిక తిరుగబాటుపై అంతర్జాతీయ సమాజం తీవ్రంగానే స్పందించింది. ఇది ‘ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి’గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభివర్ణించారు. అంతేకాదు, ఆ దేశంపై ఆంక్షల పునరుద్ధరణకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఆంగ్ సాన్ సూకీ సహా నిర్బంధంలో ఉన్న నేతలందరినీ తక్షణమే విడుదల చేయాలని ఉద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాలన్నీ మయన్మార్ దేశ సైనిక చర్యలపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి.




వార్నీ..... ఆ సెన్సేషనల్ మూవీ మహేష్ నుండి పవన్ చేతికి చేరిందా ......??

అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?

ఆచార్య నిజంగా నైజాంలో అంత రాబడుతుందా?

ఆ హీరోయిన్ త్యాగం వల్లే రోజా స్టార్ హీరోయిన్ అయ్యింది..ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>