MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-worked-with-young-heroesac37557e-db8d-4280-956b-629b25448003-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-worked-with-young-heroesac37557e-db8d-4280-956b-629b25448003-415x250-IndiaHerald.jpgస్టార్‌ హీరోస్‌తో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ కావాలని చాలామంది కలలు కంటారు. కాని అందరికీ ఈ ప్లాన్‌ వర్కవుట్‌ కాదు. కొంతమందికి రెండు సినిమాలతోనే స్టార్ హీరోస్‌తో రొమాన్స్‌ చేసే ఛాన్స్‌ వస్తే, మరికొంతమందికి ఎన్నేళ్లు గడిచినా టాప్ హీరోయిన్‌ ఇమేజ్‌ అందని ద్రాక్షలానే మిగిలిపోతోంది. కొంతమంది హీరోయిన్ లు ఇలాంటి బ్యాడ్‌ఫేజ్‌నే ఫేస్ చేస్తున్నారు. worked with young heroes;ntr;nani;naga chaitanya;pooja hegde;karthikeya;kartikeya;raashi khanna;raasi;rashmika mandanna;ravi teja;cinema;telugu;hero;heroine;nandamuri taraka rama rao;lavakusa;world famous lover;rashi khanna;oohalu gusagusalade;jai lavakusa;loverఇప్పుడు గోళ్లు కొరుక్కుంటే ఏం లాభం..!ఇప్పుడు గోళ్లు కొరుక్కుంటే ఏం లాభం..!worked with young heroes;ntr;nani;naga chaitanya;pooja hegde;karthikeya;kartikeya;raashi khanna;raasi;rashmika mandanna;ravi teja;cinema;telugu;hero;heroine;nandamuri taraka rama rao;lavakusa;world famous lover;rashi khanna;oohalu gusagusalade;jai lavakusa;loverFri, 05 Feb 2021 20:13:06 GMTహీరోయిన్ కావాలని చాలామంది కలలు కంటారు. కాని అందరికీ ఈ ప్లాన్‌ వర్కవుట్‌ కాదు. కొంతమందికి రెండు సినిమాలతోనే స్టార్ హీరోస్‌తో రొమాన్స్‌ చేసే ఛాన్స్‌ వస్తే, మరికొంతమందికి ఎన్నేళ్లు గడిచినా టాప్ హీరోయిన్‌ ఇమేజ్‌ అందని ద్రాక్షలానే మిగిలిపోతోంది. కొంతమంది హీరోయిన్ లు ఇలాంటి బ్యాడ్‌ఫేజ్‌నే ఫేస్ చేస్తున్నారు.

పూజా హెగ్డే, రష్మిక మందన్న ఇద్దరూ చాలా తక్కువ టైమ్‌లోనే టాప్‌ లీగ్‌లోకి వచ్చేశారు. కానీ వీళ్లకంటే ముందే తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన లావణ్య త్రిపాఠి, రాశిఖన్నా మాత్రం ఇంకా స్టార్‌లీగ్‌కి దూరంగానే ఉన్నారు. లావణ్య ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతున్నా ఇంకా టాప్‌ హీరోస్‌తో సినిమాలు చేసే అవకాశాలు రావడం లేదు.

లావణ్య త్రిపాఠి ఫస్ట్ మూవీ 'అందాలరాక్షసి' 2012లో రిలీజ్ అయ్యింది. ఈ తొమ్మిదేళ్లలో సీనియర్‌ హీరో నాగార్జునతో 'సోగ్గాడే చిన్నినాయనా' తప్ప మరో స్టార్‌తో సినిమా చేయలేదు. నాని, నాగచైతన్య, సాయితేజ్, కార్తికేయ లాంటి హీరోలతోనే సినిమాలు చేస్తోంది. పదేళ్లు అవుతున్నా ఇంకా టాప్‌లీగ్‌కి దూరంగానే ఉంది.

రాశి ఖన్నా 2014లో 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫస్ట్‌ మూవీతోనే ఆడియన్స్‌ని ఇంప్రెస్‌ చేసింది. తర్వాత రెండేళ్లకి జూ.ఎన్టీఆర్‌తో కలిసి 'జై లవకుశ' సినిమా చేసింది. అయితే తారక్‌తో కలిసి సినిమా చేసినా రాశీ ఖన్నా గ్రాఫ్‌కి పెద్దగా కలిసిరాలేదు.

రాశీ ఖన్నా జూ.ఎన్టీఆర్, రవితేజ లాంటి హీరోలతో సినిమాలు చేసినా టాప్‌ లీగ్‌కి మాత్రం దగ్గరకాలేదు. ఇప్పటికీ యంగ్‌స్టర్స్‌తోనే సినిమాలు చేస్తోంది. 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫ్లాప్ తర్వాత తెలుగులో రాశికి పెద్దగా సినిమాలు కూడా రావడం లేదు. దీంతో వీళ్లు మీడియం రేంజ్ హీరోయిన్స్‌గానే రిటైర్ అవుతారేమో అనే కామెంట్స్‌ వస్తున్నాయి. మొత్తానికి ఏళ్లు గడుస్తున్నా.. కొందరు హీరోయిన్ లు టాప్ లీగ్ కు దగ్గరవ్వలేదు. స్టార్ హీరోలతో సినిమాలు చేయలేక పోతున్నారనే గుసుగసలు సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.







ప్చ్ .... పాపం, ఆ భూతం మహేష్ ని కూడా వదలడం లేదు .....??

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?

ఆచార్య నిజంగా నైజాంలో అంత రాబడుతుందా?

ఆ హీరోయిన్ త్యాగం వల్లే రోజా స్టార్ హీరోయిన్ అయ్యింది..ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..??

జగడ్డ : విశాఖ ఉక్కు మంటల్లో వైసీపీ విలవిల ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>