SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newse11fac73-d1d2-4f85-a82f-6a7087c0da51-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newse11fac73-d1d2-4f85-a82f-6a7087c0da51-415x250-IndiaHerald.jpgఅంతర్జాతీయ క్రికెట్ లో మేటి జట్లుగా ఉన్న టీమిండియా - ఇంగ్లాండ్ మద్య ఆసక్తికర పోరు మరి కొద్ది క్షణాలలో ప్రారంభం కానుంది. సుదీర్ఘ పర్యటన కోసం భారత్ వచ్చిన ఇంగ్లాండ్ జట్టు టీమిండియా తో మొదటి టెస్ట్ చెన్నై లోని చెపాక్ స్టేడియంలో తలపడుతుంది. ఇరు జట్లు కూడా ప్రస్తుతం ఉత్తమ ఆటగాళ్లతో బరిలోకి దిగానున్నట్లు తెలుస్తుంది. అటు ఆసీస్ టూర్ లో టెస్టు క్రికెట్లోనే చిరస్మరణీయ విజయం అందుకుని జోరు మీద ఉంది టీమిండియా. ఇటు ఇంగ్లాండ్ శ్రీలంక పర్యటనలో ప్రత్యర్థి లంక జట్టుపై క్లీన్ స్వీప్ చేసి పూర్తి ఆత్మ విశ్వాసంతో sports news;naina;sundar;virat kohli;cricket;washington sundar;india;england;sri lanka;rishabh pant;chennai;letter;international;chepaukనేడే టెస్ట్ సిరీస్ పోరు..పలు సమీకరణలు !!నేడే టెస్ట్ సిరీస్ పోరు..పలు సమీకరణలు !!sports news;naina;sundar;virat kohli;cricket;washington sundar;india;england;sri lanka;rishabh pant;chennai;letter;international;chepaukFri, 05 Feb 2021 08:14:52 GMTఅంతర్జాతీయ క్రికెట్ లో మేటి జట్లుగా ఉన్న టీమిండియా - ఇంగ్లాండ్ మద్య ఆసక్తికర పోరు మరి కొద్ది క్షణాలలో ప్రారంభం కానుంది. సుదీర్ఘ పర్యటన కోసం భారత్ వచ్చిన ఇంగ్లాండ్ జట్టు టీమిండియా తో మొదటి టెస్ట్ చెన్నై లోని చెపాక్ స్టేడియంలో తలపడుతుంది. ఇరు జట్లు కూడా ప్రస్తుతం ఉత్తమ ఆటగాళ్లతో బరిలోకి దిగానున్నట్లు తెలుస్తుంది. అటు ఆసీస్ టూర్ లో   టెస్టు క్రికెట్లోనే చిరస్మరణీయ విజయం అందుకుని జోరు మీద ఉంది టీమిండియా. ఇటు ఇంగ్లాండ్ శ్రీలంక పర్యటనలో ప్రత్యర్థి లంక జట్టుపై క్లీన్ స్వీప్ చేసి పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉంది. దీంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండడంతో పోరు హోరాహోరీగా ఉండనుంది.

అలాగే నాలుగు టెస్టుల ఈ సిరీస్‌ను దక్కించుకోవడంతో పాటు ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్లో చోటు చేజిక్కించుకోవడం కూడా రెండు జట్ల లక్ష్యంగా కనిపిస్తోంది. దీని కోసం భారత్‌ కనీసం 2-0 లేక 2-1తో నైనా ఈ సిరీస్‌ గెలవాలి. స్వదేశంలో 2012 నుంచి ఒక్క టెస్టు సిరీస్‌ను కోల్పోని కోహ్లీసేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇక్కడ చివరి (2016) పర్యటనలో ఇంగ్లండ్‌ 0-4తో సిరీ్‌సను ఓడింది. అయితే ఇరువురి మధ్య జరిగిన ఆఖరి 5 టెస్టుల్లో 4-1తో రూట్‌సేన పైచేయి సాధించింది. ఇక టీమిండియా లో  కోహ్లీ, ఇషాంత్‌, అశ్విన్‌, బుమ్రా, పాండ్యా ఇలా కీలక ఆటగాళ్లంతా జట్టులో చేరడంతో టీమిండియా పటిష్టంగా కనిపిస్తుంది.

దాంతో ఆసీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో సత్తా చాటిన మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు బెంచ్ కె పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే రిషబ్ పంత్ స్థానం ఖాయమని కెప్టెన్ కోహ్లీ స్పష్టం చేసిన నేపథ్యంలో సాహా కు నిరాశే ఎదురైంది. ఇక ఇంగ్లాండ్ విషయానికొస్తే ఓపెనర్‌ జాక్‌ క్రాలే గాయంతో తొలి రెండు టెస్టులకు దూరమవడం గట్టి దెబ్బే అని చెప్పాలి. దీంతో రోరీ బర్న్స్‌, డామ్‌ సిబ్లే ఓపెనింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఏడాది తరువాత స్వదేశంలో జరుగుతున్నా మొదటి టెస్ట్ లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి . 


ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వార్డు, సచివాలయ ఉద్యోగులు అలా చేస్తేనే జీతాలు..?

జగడ్డ: చంద్రబాబు మైకంలో నిమ్మగడ్డ -వైసీపీ మహిళానేత సంచలన వ్యాఖ్యలు

హెరాల్డ్ సెటైర్ : వీర్రాజు కొత్త రూటు ఎందుకు ఎంచుకున్నరబ్బా ?

ఎడిటోరియల్: తెలంగాణ అసెంబ్లీలో పదేళ్లకు పైగా ఎంఎల్ఏ గా కొనసాగుతున్న విదేశీయుడు?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జోగికి ఊహించని షాకులు..పవన్‌తో కష్టమే...

హెరాల్డ్ ఎడిటోరియల్ : రైతుల దెబ్బకు మోడికి దిమ్మతిరుగుతోందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మూడు రాజధానులపై టీడీపీకి కేంద్రం భలే షాకిచ్చిందే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>