Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/cyberabad-police7a0a4299-991b-4c87-a98c-0caa4b647255-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/cyberabad-police7a0a4299-991b-4c87-a98c-0caa4b647255-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో పోలీసులు కూడా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, కర్ణాటక, కేరళ, తెలంగాణ.. ఇలా అన్ని రాష్ట్రాల్లో పోలీసులు ప్రజలకు అన్ని రకాలుగా దగ్గరవుతున్నారు. ముఖ్యంగా ట్విటర్‌లో పోలీసులు పెట్టే ట్వీట్లు చాలా అద్భుతంగా ఉండడమే కాకుండా.. ప్రజలను చైతన్యం చేసేలా ఉంటున్నాయి. వీరిలో తెలంగాణకు చెందిన సైబరాబాద్ పోలీసులు మరో..cyberabad police;kranthi;kranti;maya;naga chaitanya;tara;tiru;makar sakranti;kerala;mumbai;delhi;karnataka - bengaluru;telangana;sankranthi;police;twitter;karnataka 1;february;chennai;traffic police;gift;mahindra;chaitanya 1;valentines day;fidaaపోలీసులు కూడా ఇలాంటి ట్వీట్లు చేస్తారా..? ఎక్కడా తగ్గడం లేదుగా..!పోలీసులు కూడా ఇలాంటి ట్వీట్లు చేస్తారా..? ఎక్కడా తగ్గడం లేదుగా..!cyberabad police;kranthi;kranti;maya;naga chaitanya;tara;tiru;makar sakranti;kerala;mumbai;delhi;karnataka - bengaluru;telangana;sankranthi;police;twitter;karnataka 1;february;chennai;traffic police;gift;mahindra;chaitanya 1;valentines day;fidaaFri, 05 Feb 2021 14:33:00 GMTఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో పోలీసులు కూడా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, కర్ణాటక, కేరళ, తెలంగాణ.. ఇలా అన్ని రాష్ట్రాల్లో పోలీసులు ప్రజలకు అన్ని రకాలుగా దగ్గరవుతున్నారు. ముఖ్యంగా ట్విటర్‌లో పోలీసులు పెట్టే ట్వీట్లు చాలా అద్భుతంగా ఉండడమే కాకుండా.. ప్రజలను చైతన్యం చేసేలా ఉంటున్నాయి. వీరిలో తెలంగాణకు చెందిన సైబరాబాద్ పోలీసులు మరో అడుగు ముందుకేసి తమ ట్వీటర్లకు కొంత కామెడీని కూడా జోడిస్తున్నారు. తాజాగా అలాంటి ట్వీటే మరొకటి సైబరాబాద్ పోలీస్ ట్వీటర్ ఖాతాలో దర్శనమిచ్చింది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు పోలీసుల హ్యూమర్‌కు ఫిదా అవుతున్నారు.

సైబరాబాద్ పోలీసులు సాధారణంగా తాము విచారణ చేస్తున్న కేసులు, సైబర్ క్రైమ్‌కు సంబంధించిన హెచ్చరికలను పోస్ట్ చేస్తూ ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. ఆన్‌లైన్ డేటా మోసాలు ఎక్కువైపోయాయని, ఎన్ని ప్రకటనలు చేసిన కొంతమంది ప్రజలు మోసపోతూనే ఉన్నారని, చివరకు మాకు న్యాయం చేయమంటూ పోలీసుల చుట్టూ తిరుగుతుంటారు.

అలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, బ్యాంకు ఖాతాల వివరాలు కానీ, కేవైసీ, ఏటీఎం కార్డు అప్ డేట్ పేరుతో వచ్చే కాల్స్‌కు స్పందించవద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రిస్ట్ మస్, న్యూఇయర్, సంక్రాంతి సందర్భంగా ఇలాంటి మోసాలు భారీగా జరుగుతాయని, వాటిపై అలర్ట్‌గా ఉండాలని ట్విటర్‌లో హెచ్చరిస్తుంటారు. తాజాగా కూడా అలాంటి ట్వీటే ఒకటి చేశారు.

‘అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు అంటారు, మరి ఎవరో గిఫ్ట్ ఇస్తాడు అంటే ఎలా నమ్ముతారు? ‘ అని సైబరాబాద్ పోలీసులు ట్విటర్‌లో షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ ట్వీట్‌కు వారు బ్రహ్మానందం డైలాగ్ మీమ్ జతచేయడంతో ఇది మరింత వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే ఇటీవల సోషల్ మీడియాలో డీమార్ట్, టాటా కంపెనీ, మహీంద్రా హాలిడే, యూరో లాటరీ వంటి పాపులర్ పేర్లతో కొన్ని లింక్స్ షేర్ అవుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీల పేర్లతో ప్రజలను నమ్మించి వారి ఖాతాలలో ఉండే డబ్బును మాయం చేసేందుకు కేటుగాళ్లు పక్కా ప్లాన్ వేశారు. ఇక ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే ఉండడంతో దీనిని కూడా కేటుగాళ్లు వదలడం లేదు. గిఫ్ట్స్, లక్కీ డ్రా వంటి మెసేజ్‌లు కానీ. కాల్స్ కానీ వస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
" style="height: 370px;">
" style="height: 370px;">





బ్రాహ్మ‌ణ ఘోష‌: పంచాయ‌తీల్లోనూ బ్రాహ్మ‌ణుల‌కు అన్యాయ‌మే..!

రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట్లో ప్రత్యేకంగా శాంతి పూజలు.. ఎందుకంటే..!?

జగడ్డ : దీన్నే షాక్ అంటారా ?

బాలయ్య బాబుకు బీపీ చెకింగ్.. అలాగే వస్తుందిలేండని అంతా ఆసక్తి

జగడ్డ: చంద్రబాబు దెబ్బకి అప్పులపాలవుతున్న టీడీపీ నేతలు..

జగడ్డ: ధర్మవరంలో వైసీపీ నేత దౌర్జన్యం...కాళ్ళు చేతులు నరికేస్తానంటూ వార్నింగ్...?

జగడ్డ : అన్నంత పనీ చేసిన నిమ్మగడ్డ.. ఆ జిల్లాల ఏకగ్రీవాలు నిలిపివేత !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>