PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-tdp-activists-strong-in-gudivada33a8bd3a-8ece-4128-a434-bb783b56d7cc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-tdp-activists-strong-in-gudivada33a8bd3a-8ece-4128-a434-bb783b56d7cc-415x250-IndiaHerald.jpgకృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉందనే సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడైతే కొడాలి నాని ఎంట్రీ ఇచ్చారో అప్పటినుంచి గుడివాడలో రాజకీయం మారిపోయింది. పూర్తిగా నియోజకవర్గం కొడాలికి అనుకూలంగా మారింది. కొడాలి ఎటు ఉంటే ఆ పార్టీ గెలవడం ఖాయమనే విధంగా తయారైంది. tdp;nani;kodali nani;amarnath cave temple;krishna river;2019;district;assembly;cheque;krishna district;tdp;ycp;partyగుడివాడలో తమ్ముళ్ళు రివర్స్ అవుతున్నారుగా...!గుడివాడలో తమ్ముళ్ళు రివర్స్ అవుతున్నారుగా...!tdp;nani;kodali nani;amarnath cave temple;krishna river;2019;district;assembly;cheque;krishna district;tdp;ycp;partyFri, 05 Feb 2021 02:00:00 GMTకృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉందనే సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడైతే కొడాలి నాని ఎంట్రీ ఇచ్చారో అప్పటినుంచి గుడివాడలో రాజకీయం మారిపోయింది. పూర్తిగా నియోజకవర్గం కొడాలికి అనుకూలంగా మారింది. కొడాలి ఎటు ఉంటే ఆ పార్టీ గెలవడం ఖాయమనే విధంగా తయారైంది.

రెండుసార్లు టీడీపీలో గెలిచిన నాని, వైసీపీలోకి మరో రెండు సార్లు గెలిచేసి ఇప్పుడు మంత్రిగా చక్రం తిప్పుతున్నారు. ఇక ఇక్కడ టీడీపీకి సరైన దిక్కు లేకుండా పోతుంది. ప్రస్తుతం రావి వెంకటేశ్వరరావు ఇన్‌చార్జ్ ఉన్నారు. కాకపోతే ఆయన ఫుల్ యాక్టివ్ గా ఉండటం లేదు. నానికి అధికారం ఉండటంతో రావి కాస్త సైలెంట్ గానే ఉన్నారు.

కానీ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ కేడర్ గట్టిగానే కష్టపడుతుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు బయటకొచ్చిన టీడీపీ కేడర్ పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. కాకపోతే గుడివాడలో వైసీపీకి చెక్ పెట్టడం సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడ అన్నీ మండలాల్లో కొడాలి హవా ఉంది. మెజారిటీ పంచాయితీల్లో వైసీపీ జెండా ఎగిరేలా కనిపిస్తోంది. ఫలితాలు ఎలా వస్తాయో కూడా క్లియర్‌గా అర్ధమైపోతుంది. అయినా సరే తమ్ముళ్ళు వెనక్కి తగ్గట్లేదు. ఎలాగైనా పోటీ చేసి టీడీపీని నిలబెట్టాలని చూస్తున్నారు. చాలా పంచాయితీల్లో ఏకగ్రీవాల కోసం వైసీపీ నేతలు టీడీపీ నేతలని సంప్రదిస్తున్నారు.

అలాగే కొన్ని ఆఫర్లు కూడా ఇస్తున్నారు. కానీ చాలా చోట్ల తమ్ముళ్ళు ఒప్పుకోవడం లేదు. ఎలాగైనా పోటీకి దిగేస్తున్నారు. వైసీపీకి పోటీగా నామినేషన్స్ వేసేశారు. అయితే ఓడిపోయినా పర్లేదు గానీ పోటీలో మాత్రం ఉండాలనే ఉద్దేశంతో గుడివాడ తమ్ముళ్ళు ఉన్నట్లు కనబడుతోంది. తమ నాయకుడు సైలెంట్‌గా ఉన్నా సరే, తెలుగు తమ్ముళ్ళు మాత్రం పార్టీ కోసం నిలబడుతున్నారు. గెలిచినా, ఓడినా పోటీ మాత్రం చేయాలనే కసితో నామినేషన్స్ వేశారు. మరి చూడాలి ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో?




బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!

విజయశాంతి కోలుకోలేని దెబ్బ కొడతారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>