EditorialParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/editorial/77/foreigner-mla-in-t-assembly-46eeae9f-eff4-4bed-9b4a-e1d846a8732d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/editorial/77/foreigner-mla-in-t-assembly-46eeae9f-eff4-4bed-9b4a-e1d846a8732d-415x250-IndiaHerald.jpgకాగా, ఇటీవల మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తనకు "సిరిసిల్ల & వేములవాడ" రెండు కళ్లని వ్యాఖ్యానించడంపై ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఇక ఇక్కడకు రాడన్నట్లేనని ప్రజలకు సంకేతాలిస్తున్నారా? అని ప్రశ్నించారు. అయినా కేటీఆర్ కు సిరిసిల్లపై ప్రేముంటే అది ఆయన నియోజకవర్గం కాబట్టి అనుకోవచ్చు. మరెందుకు వేములవాడపై అంత ప్రేమ. సాధారణ విషయమైతె ఆ ప్రేమ తెలంగాణలొని అన్ని నియోజకవర్గాలపై ఉండాలి. కాని ఒక్క వేములవాడ పైనె ఎందుకు? ఇలా ప్రజల మదిలొ అనెక ప్రశ్నలforeigner mla in t assembly?;business;view;ktr;ahmed;prema;srinivas;bharatiya janata party;telangana rashtra samithi trs;telugu desam party;bangladesh;germany;telangana;indiaherald group;congress;adinarayanareddy;2019;high court;telugu;court;loksabha;parliment;love;mla;lawyer;minister;letter;tdp;local language;central government;june;election commission;sircilla;kavuru srinivasమనం సిగ్గుపడాల్సిన విషయం: తెలంగాణా శాసన నిర్మాణ సభలొ విదేశీ ప్రాతినిధ్యమా?మనం సిగ్గుపడాల్సిన విషయం: తెలంగాణా శాసన నిర్మాణ సభలొ విదేశీ ప్రాతినిధ్యమా?foreigner mla in t assembly?;business;view;ktr;ahmed;prema;srinivas;bharatiya janata party;telangana rashtra samithi trs;telugu desam party;bangladesh;germany;telangana;indiaherald group;congress;adinarayanareddy;2019;high court;telugu;court;loksabha;parliment;love;mla;lawyer;minister;letter;tdp;local language;central government;june;election commission;sircilla;kavuru srinivasFri, 05 Feb 2021 12:00:00 GMTబంగ్లాదేశ్ ‌లో మంచి జనాదరణ కలిగిన “ఫిర్దోస్ అహ్మద్”  గతంలొ (2019) పశ్చిమ బెంగాల్‌ లోని రాయ్‌గంజ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం ఒక రోడ్‌షో లో పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్ధి (టీఎంసీ) కన్హయ్య లాల్ అగ్రవాల్ ‌కు ఓట్లు వేయాలని స్థానికులను అభ్యర్థించారు. ఆయనతో పాటు పశ్చిమ బెంగాల్‌ కు చెందిన నటులు కొందరు ఈ కార్యక్రమంలో కనిపించారు.


ఈ రోడ్‌షో ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చాయి. వెంటనే ఈ వ్యవహారంపై తీవ్రఅభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.


తాత్కాలిక బిజినెస్ వీసాలపై వచ్చే విదేశీయులకు పన్నెండు నిర్దిష్ట కార్యకలాపాలను చేసుకునేందుకు మాత్రమే అనుమతి ఉన్నట్లు వీసా నిబంధనల్లో స్పష్టంగా ఉందని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఏ విధంగానూ ఆ కార్యకలాపాల పరిధిలోకి రాదని బీజేపీ ఎన్నికల సంఘానికి (ఈసీ)  రాసిన లేఖను "ఏఎన్ఐ వార్తాసంస్థ" వెల్లడించింది.


రాష్ట్ర అత్యున్నత చట్టసభకు జరిగే ఎన్నికల ప్రక్రియలో విదేశీయుడు జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థ మౌలిక సూత్రాలకు పూర్తి విరుద్ధమని బీజీపే అభ్యంతరం తెలిపినట్లు పేర్కొంది. మరి అలాంటి చట్టసభలొ నాడు టిడిపి శాసనసభ్యుడుగా, నేడు టీఅరెస్ శాసనసభ్యుడు గా ఏకంగా పదేళ్ళు కొనసాగటంలొని ఔచిత్యమే కాదు. నేరం కోణములో విచారణ చెపట్టాలి.


విదేశీ పౌరుడెవరైనా మనం చట్టాలు చెసే చట్టసభలో అది, రాష్ట్ర శాసనసభ కావచ్చు, దేశ పార్లమెంట్ కావచ్చు - సభ్యుడుగా ఉంటే జరిగే విపరిణామాలను ఊహించలేం. ఎన్నికల ప్రచారంలొ ఒక విదేశీయుడు పాల్గొంటేనే అది నేరమైనప్పుడు - ఎకాఎకీ ఒక విదెశీపౌరుడు భారత పార్లమెంట్ లేదా రాష్ట్ర విధాన సభల్లొ ప్రజాప్రాతినిధ్యం వహిస్తే ఆనేర పరిమాణం పరిణామం మాటేమిటి?  



విదెశీయ ఆ పౌరులు మన దెశపాలనపై, ముఖ్యంగా రాజకీయాలపై, అంతరంగ వ్యవహారాలపై, రక్షణ వ్యూహాలపై ప్రభావం చూపుతున్నట్లె ఇది చాలా సీరియస్ సమస్య. ఇదె గత పదేళ్ళుగా తెలంగాణా అసెంబ్లీలొ జరుగుతుంది.



అవిభాజ్య ఆంధ్రప్రదెశ్ లొ ఆయన తొలిసారి తెలుగుదేశంద్వారా ప్రజాప్రతినిధిగా అంటే ఎమెల్యెగా ఎన్నికై , ఆ తరవాత తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా, శాసనసభకు ప్రజా ప్రతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికి ఆయన తెలంగాణ శాసనసభ్యుడా?  కాదా? అన్నది తేలవలసి ఉంది. జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈ నేరానికి ఎవరు బాధ్యులు? ఇదె ప్రధాన ప్రశ్న. ఆయనే చన్నమనెని రమెష్.



వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదం పై కేంద్ర హోంశాఖ తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. చెన్నమనేని రమేష్ కి జర్మనీ పౌరసత్వం ఉందని హోంశాఖ అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై త్వరగా విచారణ చేపట్టాలని కేంద్రప్రభుత్వం తరపు న్యాయవాది రవికిరణ్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో వీలైనంత త్వరగా ఆ పిటిషన్‌ను బెంచ్ ముందుంచాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది.


రమేష్ జర్మనీ పౌరసత్వం ఇప్పటికీ కొనసాగుతోందంటూ గతంలో కేంద్ర హోంశాఖ హైకోర్టుకు వివరాలను మెమో రూపంలో సమర్పించింది. మెమో రూపంలో వివరాలు సమర్పించడాన్ని తప్పుబట్టిన హైకోర్టు, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.ఈ నేపథ్యం లోనే కేంద్ర హోంశాఖ తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది.


కాగా, గత 10 సంవత్సరాలుగా జర్మన్ పౌరుడు భారత చట్టసభల్లో సభ్యుడిగా ఉన్న అంశాన్నితీవ్రంగా పరిగణించాలని పిటిషనర్ ఆది శ్రీనివాస్ కోర్టును కోరారు. చెన్నమనేనిపై అనర్హత వేటు ఖాయమని ఆయన భావిస్తున్నారు.


కాగా, ఇటీవల మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తనకు "సిరిసిల్ల & వేములవాడ"  రెండు కళ్లని వ్యాఖ్యానించడంపై ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఇక ఇక్కడకు రాడన్నట్లేనని ప్రజలకు సంకేతాలిస్తున్నారా? అని ప్రశ్నించారు. అయినా కేటీఆర్ కు సిరిసిల్లపై ప్రేముంటే అది ఆయన నియోజకవర్గం కాబట్టి అనుకోవచ్చు. మరెందుకు వేములవాడపై అంత ప్రేమ. సాధారణ విషయమైతె ఆ ప్రేమ తెలంగాణలొని అన్ని నియోజకవర్గాలపై ఉండాలి. కాని ఒక్క వేములవాడ పైనె ఎందుకు? ఇలా ప్రజల మదిలొ అనెక ప్రశ్నలు తలెత్తుతున్నాయి
 
 
ఇందుకు బాధ్యత - నాటి టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వహిస్తారా?  టీఅరెస్ అధ్యక్షుడు కలవకుంట్ల చంద్రశేఖరరావు వహిస్తారా?   ఇది పరిశీలించి త్వరగా అఫిడవిట్ దాఖలు చెయవలసి ఉండగా మెమోలు దాఖలు చేస్తూ కాలయాపన చెసిన కేంద్ర హోంశాఖ వహిస్తుందా?


ఇంత తాత్సారం చేయటంలొని నెపధ్యం ఏమిటో? ప్రజలకు చెప్పవలసిన అగత్యం వీరికి లేదా? ఇంత సీరియస్ విషయాన్ని న్యాయస్థానాలు వెంటనె తెమల్చాల్సిన అగత్యం ఉందని కాంగ్రెస్ నాయకుడు ఆది శీనివాస్ కోరుతున్నారు.


సాధారణంగా చట్టబద్ధమైన పని ప్రయొజనం కంటె నేరాల ద్వారా కలిగే ప్రయొజనం అనంతం. అందుకే కొందరు నేరాలకు పాల్పడతారు. అయితే ఈ అక్రమ విదేశీ పౌరుడు (?)  మన చట్టసభలొ పదేళ్లు సభ్యుడుగా ఉండి పొందిన ప్రయొజనం ఎంత? ఎవరెవరు భాగస్వామ్యులు? ఆ నేర పరిమాణం ఎంత? దాని గత, వర్తమాన, భవిష్యత్ పరిణామాలేమిటి?  దేశం, రాష్ట్రం, సాధారణ పౌరులు తద్వారా ఎమైనా నష్టపోయారా ఇవన్ని తేల్చాల్సిన విషయాలు.


దేశ వ్యాప్తంగా చట్టసభల్లో ఇంకా ఇలా విదేశీయులు ప్రజాప్రతినిధ్యం వహిస్తున్నారా? మన రాష్ట్రంలొ కూడా ఇంకా ఇలాంటి వాళ్లున్నారా? అయితె మనం చెసే చట్టాలు మనవేనా? విదేశీ ప్రతినిధుల ద్వారా ... చట్ట నిర్మాణం జరుగుతుందా? అన్నీ సమాధానాలు రావలసిన ప్రశ్నలు.


"మాటర్ మోస్ట్ సీరియస్"  అయినా అయిదు నెలలు నిరీక్షించాలా? - తదుపరి విచారణను హైకోర్టు జూన్ 16కు వాయిదా వేసింది. 
 


"వారు అక్రమ సంబంధంలొ ఉన్నారని మీ అభిప్రాయమా?" హైకోర్ట్ అధికారులపై సీరియస్

పవన్ సరసన నిధి క్లారిటీ ఇచ్చేసింది !

రమ్యకృష్ణ ఒక్క రోజు వేతనం ఎంతో తెలిసి తల పట్టుకుంటున్న ప్రొడ్యూసర్స్

జాంబి రెడ్డి ఎలా ఉందంటే..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పంచాయ‌తీల్లోనూ బ్రాహ్మ‌ణుల‌కు అన్యాయ‌మే..!

రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట్లో ప్రత్యేకంగా శాంతి పూజలు.. ఎందుకంటే..!?

జగడ్డ : దీన్నే షాక్ అంటారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>