PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-revenue-staff-back-steps-from-covid-vaccine39d14eaa-d87a-4ca8-b902-92a90bf73db5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-revenue-staff-back-steps-from-covid-vaccine39d14eaa-d87a-4ca8-b902-92a90bf73db5-415x250-IndiaHerald.jpgపంచాయతీ ఎన్నికలకు వెళ్లాలంటే ముందు మాకు వ్యాక్సినేషన్ పూర్తి చేయండి, ఆ తర్వాత ఎన్నికలు పెట్టుకోండి అంటూ ఆమధ్య కోర్టుల వరకూ వెళ్లారు ఏపీ రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు. తీరా వ్యాక్సినేషన్ వేయించుకోండి అంటూ రెండో విడత మొదలు పెట్టే సరికి మాత్రం సగానికి సగం మంది పారిపోతున్నారు. తొలి విడద వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ వేయించిన కేంద్రం, రెండో విడత ఫ్రంట్ లైన్ వారియర్స్ లో భాగంగా రెవెన్యూ సిబ్బందికి టీకాలు ఇవ్వాలని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. ఆమేరకు రాష్ట్రవ్యాప్తంగా టీకాల పంపిణీ మొదలు కాగా.. రెవెన్యూ ఉదap vaccination;india;andhra pradesh;panchayati;court;central governmentఏపీ రెవెన్యూ ఉద్యోగుల్లో భయం భయం..ఏపీ రెవెన్యూ ఉద్యోగుల్లో భయం భయం..ap vaccination;india;andhra pradesh;panchayati;court;central governmentFri, 05 Feb 2021 09:00:00 GMTపంచాయతీ ఎన్నికలకు వెళ్లాలంటే ముందు మాకు వ్యాక్సినేషన్ పూర్తి చేయండి, ఆ తర్వాత ఎన్నికలు పెట్టుకోండి అంటూ ఆమధ్య కోర్టుల వరకూ వెళ్లారు ఏపీ రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు. తీరా వ్యాక్సినేషన్ వేయించుకోండి అంటూ రెండో విడత మొదలు పెట్టే సరికి మాత్రం సగానికి సగం మంది పారిపోతున్నారు. తొలి విడద వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ వేయించిన కేంద్రం, రెండో విడత ఫ్రంట్ లైన్ వారియర్స్ లో భాగంగా రెవెన్యూ సిబ్బందికి టీకాలు ఇవ్వాలని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. ఆమేరకు రాష్ట్రవ్యాప్తంగా టీకాల పంపిణీ మొదలు కాగా.. రెవెన్యూ ఉద్యోగుల్లో సగానికి సగం మంది భయపడుతున్నట్టు తెలుస్తోంది. టీకా పంపిణీ మొదలై రెండు రోజులు గడిచినా కూడా కనీసం 15శాతం సిబ్బంది కూడా టీకా వేయించుకోడానికి ముందుకు రాలేదట.

మరోవైపు టార్గెట్ పూర్తి చేయడానికి ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉద్యోగులందరూ కచ్చితంగా టీకా వేయించుకోవాల్సిందేనంటూ మౌఖిక ఆదేశాలిస్తున్నారు. వైద్య సిబ్బందే పలు కారణాలతో వెనకడుగు వేసిన వేళ, రెవెన్యూ సిబ్బంది ఎందుకు ఉత్సాహం చూపిస్తారు. టీకాపై అవగాహన లేక కొందరు, భయంతో మరికొంతమంది వెనకడుగు వేస్తున్నారు.  ప్రభుత్వ సిబ్బందే వెనకడుగు వేస్తే, రేపు ప్రజలు ముందుకొస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు ఉన్నతాధికారులు.

టీకా కంపల్సరీ కాదని ఇదివరకే కేంద్రం ప్రకటించింది. అయితే ప్రతి ఒక్కరూ టీకా వేయించుకుంటేనే.. దాని ప్రభావం సమాజంపై పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. కరోనా వచ్చిన తొలినాళ్లలో టీకా కోసం ఆతృతగా ఎదురు చూసిన ప్రజలు, అసలిప్పుడు ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు, రోజువారీ పనుల్లో బిజీగా మారిపోయారు. టీకా లేకుండానే అన్ని పనులు సజావుగా సాగుతున్న వేళ, టీకాతో కొత్త తలనొప్పి ఎందుకని ఆలోచిస్తున్నారు. టీకా వేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కనిపించే ప్రమాదం ఉంది. అయితే భారత్ లో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయనే ప్రచారం ఉంది. టీకా కారణం కాకపోయినా, దానిపై ఉన్న అపోహలే దీనికి కారణం అంటున్నారు. పోనీ కారణం ఏదయినా కొంతమంది టీకా వేయించుకున్నాక చనిపోయారనే వార్తలే మరింత భయాందోళనలు కలిగిస్తున్నాయి. అలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే కఠినంగా శిక్షిస్తామంటూ ప్రభుత్వం హెచ్చరిస్తుంది కానీ, కనీస అవగాహన పెంచేందుకు మాత్రం ముందడుగు వేయడంలేదు.


వరంగల్ శ్రీను... దిల్ రాజు కి సరైనోడు దొరికాడే..అన్ని పెద్ద సినిమాలు ఆయనకే..?

హీరోయిన్ న్యూడ్ ఫోటో అడిగిన నెటిజెన్.. మైండ్ బ్లాంక్ అయ్యే పిక్ పెట్టింది..!

కాపు వేద‌న‌: కాపు కోట‌లోనూ వైసీపీ రెడ్ల‌దే హ‌వా ? వీళ్లంతా ల‌బోదిబో ?

స‌జ్జ‌ల సొంత పార్టీలోనే టార్గెట్ అయ్యారే ?

జగడ్డ: చంద్రబాబు మైకంలో నిమ్మగడ్డ -వైసీపీ మహిళానేత సంచలన వ్యాఖ్యలు

హెరాల్డ్ సెటైర్ : వీర్రాజు కొత్త రూటు ఎందుకు ఎంచుకున్నరబ్బా ?

ఎడిటోరియల్: తెలంగాణ అసెంబ్లీలో పదేళ్లకు పైగా ఎంఎల్ఏ గా కొనసాగుతున్న విదేశీయుడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>