PoliticsSashank Saurabheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elecitons4c28bc23-881d-4b90-a954-ddead14bc29f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elecitons4c28bc23-881d-4b90-a954-ddead14bc29f-415x250-IndiaHerald.jpgఎన్నికలు అంటేనే జనం తీర్పు కోసం ఎదురుచూడడం. అలాగే మరో మాట చెప్పుకోవాలంటే ప్రజలకు ఒక అవకాశం ఇవ్వడం. మరి వారి మాట ఏంటో చూడకుండా కొంతమంది కూడబలుక్కుని ఏకగ్రీవం చేసుకుంటే అది ప్రజస్వామ్యానికి మంచిదేనా అన్న మాట చర్చకు వస్తోంది. jagan-nimmagadda-elecitons;bhavana;heaven;partyజగడ్డ : ఏకగ్రీవాలే ఎన్నికలా..సై అంటే సై ?జగడ్డ : ఏకగ్రీవాలే ఎన్నికలా..సై అంటే సై ?jagan-nimmagadda-elecitons;bhavana;heaven;partyFri, 05 Feb 2021 19:46:00 GMTఎన్నికలు అంటేనే జనం తీర్పు కోసం ఎదురుచూడడం. అలాగే మరో మాట చెప్పుకోవాలంటే ప్రజలకు ఒక అవకాశం ఇవ్వడం. మరి వారి మాట ఏంటో చూడకుండా కొంతమంది కూడబలుక్కుని ఏకగ్రీవం చేసుకుంటే అది ప్రజస్వామ్యానికి మంచిదేనా అన్న మాట చర్చకు వస్తోంది.

నిజానికి బలమున్న వాడు చేసేది పొరాటానికి దిగడం. విజయమో వీర స్వర్గంలో అన్నట్లుగా రణ క్షేత్రంలోకి దిగి వీరోచితంగా పోరు సలపాలి. గెలుపునకు దగ్గర దారులు ఉండవు, జనం ఓటేసై గెలిపిస్తే ఆ కుర్చీకి వచ్చే దర్జా మరోలా రాదు అన్నది కూడా వాస్తవాం. అయితే గ్రామాల్లో అంతా ఒక్క మాట మీదకు వచ్చి ఈ గొడవలు వద్దు అంటూ తమలో ఒకరిని ఎంచుకుంటే దాన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం. లేదు.

ఎందుకంటే గ్రామ కక్షలు రేగకుండా ఒకరిని ఒకరు మానసికంగా మరో విధంగా గాయపరచుకోకుండా కుమ్ములాటలు లేకుండా ఎన్నికలు జరిగితే అది మంచిదే అన్న భావన కూడా ఉంది. అయితే ఇపుడు పల్లెల్లోకి పార్టీలు వచ్చేశాయి. పార్టీలు రంగులు లేని చోట ఏకగ్రీవాలు అన్న మాటకు అర్ధం ఉంటుందేమో కానీ ఇపుడు జరిగేది మాత్రం అచ్చమైన అధికార పెత్తనమే అన్న విమర్శలు ఉన్నాయి.

అదేదో కేవలం ఇపుడు అధికారంలో ఉన్న పార్టీ వరకే పరిమితం కాదు, గతంలోనూ అధికారంలో ఉన్న పార్టీలు ఏకగ్రీవాల పేరుతో ఇలాగే చేశాయి. అందువల్ల ఒకరిని ఒకరు తప్పు పట్టుకోవడం కూడా మంచిది కాదు, అయితే ఇక్కడ ఎన్నికల సంఘం ఏకగ్రీవాలు అయిన వాటిని విత్ హెల్డ్ లో పెట్టడం ఎంతవరకూ సమంజసం అన్న మాట కూడా ఉంది. పైన చెప్పుకున్నట్లుగా అధికార బలమో అంగబలమో ఉపయోగించి ఏకగ్రీవం చేసినా కూడా దానికి తగిన‌ ఆధారాలు ఉండాలిగా. ఇక ఒక ఊరులో అందరూ ఒకే మాట మీద ఉంటారని కూడా లేదు. మెజారిటీ మాట్లాడుకుని ఏకాభిప్రాయానికి వస్తే అది తప్పు అనడం కూడా మంచిది కాదేమో అన్న చర్చ కూడా ఉంది. ఏదిఏమైనా కూడా అసలైన ఎన్నికలను వదిలేసి ఏకగ్రీవాల వెంట రాజకీయ పార్టీలు  పడడం ఎండమావుల వెంట పడడమే అని అంటున్నారు.





నిమ్మగడ్డ ఎంపీ కాబోతున్నారా?

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?

ఆచార్య నిజంగా నైజాంలో అంత రాబడుతుందా?

ఆ హీరోయిన్ త్యాగం వల్లే రోజా స్టార్ హీరోయిన్ అయ్యింది..ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..??

జగడ్డ : విశాఖ ఉక్కు మంటల్లో వైసీపీ విలవిల ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sashank Saurabh]]>