SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news7045cc5b-171b-46b6-9b36-c222cd420cde-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news7045cc5b-171b-46b6-9b36-c222cd420cde-415x250-IndiaHerald.jpgటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో ముందువరుసలో ఉంటాడు. ఒక క్రికెట్లోనే కాకుండా పలురకాల సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ ప్రకటనలలో కూడా తన హవా కొనసాగిస్తున్నాడు. గత ఏడాది కాలంగా కరోనా వైరస్‌ ప్రభావం అత్యధికంగా ప్రకటన, వినోద పరిశ్రమలపై అత్యధికంగా పడింది. పలు సినిమాల నిర్మాణం, విడుదల నిలిచిపోవటం వల్ల సినీ రంగం కుదేలుకాగా.. తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు సంస్థలు ముందుకు రాకపోవటంతో ప్రకటనల రంగం దెబ్బతింది. sports news;salman khan;virat kohli;cinema;2020;king;hero;king 1;118;internationalసల్మాన్, షారుక్ లను వెనక్కి నెట్టి అగ్రస్థానం లోకి కింగ్ కోహ్లీ..!!సల్మాన్, షారుక్ లను వెనక్కి నెట్టి అగ్రస్థానం లోకి కింగ్ కోహ్లీ..!!sports news;salman khan;virat kohli;cinema;2020;king;hero;king 1;118;internationalFri, 05 Feb 2021 07:15:26 GMTవిరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో ముందువరుసలో ఉంటాడు. ఒక క్రికెట్లోనే కాకుండా పలురకాల సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ ప్రకటనలలో కూడా తన హవా కొనసాగిస్తున్నాడు. గత ఏడాది కాలంగా కరోనా వైరస్‌ ప్రభావం అత్యధికంగా ప్రకటన, వినోద పరిశ్రమలపై అత్యధికంగా పడింది. పలు సినిమాల నిర్మాణం, విడుదల నిలిచిపోవటం వల్ల సినీ రంగం కుదేలుకాగా.. తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు సంస్థలు ముందుకు రాకపోవటంతో ప్రకటనల రంగం దెబ్బతింది.

ఇలాంటి పరిస్థితులలోకూడా కోహ్లీ బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదు. జాతీయ స్థాయిలో వ్యక్తిగత బ్రాండ్‌ విలువలను గురించి ఓ తాజా అధ్యయనంలో వెల్లడైన వివరాలు చూస్తే కోహ్లీ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు. 2020 సంవత్సరానికి గాను భారత్‌కు చెందిన సెలబ్రిటీల బ్రాండ్‌ విలువలను.. అంతర్జాతీయ గణాంకాల సంస్థ డఫ్‌ అండ్‌ ఫెల్ప్స్‌ ఇటీవల విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం 237.7 మిలియన్‌ డాలర్లు విలువ చేసే బ్రాండ్‌ ఇమేజ్‌తో  క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, అత్యంత విలువైన సెలబ్రిటీగా తన స్థానాన్ని వరుసగా నాలుగోసారి కూడా నిలబెట్టుకున్నాడు. కొవిడ్‌ కాలంలోనూ టీమిండియా సారధి విలువ చెక్కు చెదరకపోవటం గమనార్హం. తొలి పదిస్థానాల్లో కోహ్లీ కాకుండా మిగిలినవన్నీ సినిమా తారలకే దక్కడం మరో విశేషం.  118.9 మిలియన్‌ డాలర్ల బ్రాండ్‌విలువతో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ తన రెండో స్థానాన్ని నిలుపుకొన్నాడు.

మూడో స్థానంలో  రణ్‌వీర్‌ సింగ్‌ బ్రాండ్‌ విలువ 102.9 మిలియన్‌ డాలర్లతో నిలిచాడు.ఇక కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌.. గత సంవత్సరం కంటే తన ర్యాంకు మెరుగుపర్చుకుని 51.1 మిలియన్‌ డాలర్ల విలువతో నాలుగో స్థానానికి చేరాడు. సల్మాన్‌ ఖాన్‌ ఈ సారి కాస్త తగ్గి.. ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.. 45 మిలియన్‌ డాలర్ల బ్రాండ్‌ విలువను సొంతం చేసుకున్నాడు. అయితే ఈ గణాంకాల ప్రకారం పెద్ద.. పెద్ద సెలబ్రిటీలను సైతం వెనక్కి నెట్టి కోహ్లీ అగ్ర స్థానానికి చేరుకోవడం గమనార్హం.


హెరాల్డ్ సెటైర్ : వీర్రాజు కొత్త రూటు ఎందుకు ఎంచుకున్నరబ్బా ?

ఎడిటోరియల్: తెలంగాణ అసెంబ్లీలో పదేళ్లకు పైగా ఎంఎల్ఏ గా కొనసాగుతున్న విదేశీయుడు?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జోగికి ఊహించని షాకులు..పవన్‌తో కష్టమే...

హెరాల్డ్ ఎడిటోరియల్ : రైతుల దెబ్బకు మోడికి దిమ్మతిరుగుతోందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మూడు రాజధానులపై టీడీపీకి కేంద్రం భలే షాకిచ్చిందే ?

గుడివాడలో తమ్ముళ్ళు రివర్స్ అవుతున్నారుగా...!

భూమా అడ్డాలో మారిన రాజకీయం....దెబ్బ పడిపోతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>