Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sbi1ee87d2a-157d-420e-80b9-b3cc559943dd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sbi1ee87d2a-157d-420e-80b9-b3cc559943dd-415x250-IndiaHerald.jpgదేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం తమ కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందిస్తూ దూసుకు పోతుంది అన్న విషయం తెలిసిందే. అధునాతన టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు తమ సర్వీసులను పునరుద్ధరించు కుంటూనే ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ క్రమంలోనే ఎంతో సెక్యూరిటీ తో కూడిన మెరుగైన సర్వీసులు అందిస్తూ రోజురోజుకు బ్యాంకింగ్ రంగంలో దూసుకుపోతు కస్టమర్ల సంఖ్య అంతకంతకూ పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం అతి ఎక్కువ మంది కస్టమర్లు కలిగిన బ్యాంకుగా కూడా స్టేట్ బ్sbi;india;rbi;sbi;bank;king;king 1;banking;customerఎస్బిఐ అదిరిపోయే శుభవార్త.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి..?ఎస్బిఐ అదిరిపోయే శుభవార్త.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి..?sbi;india;rbi;sbi;bank;king;king 1;banking;customerFri, 05 Feb 2021 10:00:00 GMTబ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం తమ కస్టమర్లకు  మెరుగైన సర్వీసులు అందిస్తూ దూసుకు పోతుంది అన్న విషయం తెలిసిందే. అధునాతన టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు తమ సర్వీసులను పునరుద్ధరించు కుంటూనే  ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.  ఈ క్రమంలోనే ఎంతో సెక్యూరిటీ తో కూడిన మెరుగైన సర్వీసులు అందిస్తూ రోజురోజుకు బ్యాంకింగ్ రంగంలో దూసుకుపోతు కస్టమర్ల సంఖ్య అంతకంతకూ పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం అతి ఎక్కువ మంది కస్టమర్లు కలిగిన బ్యాంకుగా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే.



 బ్యాంకింగ్ రంగంలో ఉన్న పోటీని తట్టుకుంటూ తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించడంలో ముందు ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తమ కస్టమర్లకు మరో అదిరిపోయే తీపికబురు చెప్పింది. తమ కస్టమర్లకు  డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందించేందుకు సిద్ధమయ్యింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక ఈ సరికొత్త సర్వీస్ లో  భాగంగా బ్యాంకు కస్టమర్లందరూ కూడా.. ఇక నుంచి బ్యాంకుకు వెళ్లకుండా నే డబ్బులు పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ బెనిఫిట్ అందరికీ అందుబాటులో ఉండదు అన్నది మాత్రం గుర్తుంచుకోవాలి.



 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులను కేవలం 70 ఏళ్లకు పైబడిన వయస్సు కలిగిన వారికి మాత్రమే అందుబాటులో ఉంచేలా నిర్ణయించింది. అయితే ఒకవేళ 70 ఏళ్లకు వయసు పైబడినవారు ఇలా డోర్ స్టెప్ సేవలు పొందాలి అనుకుంటే దీనికోసం ముందుగా బ్యాంక్ అకౌంట్ కేవైసీ పూర్తి అయి ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ కి మొబైల్ నెంబర్ అనుసంధానం కావాలి. ఈ నిబంధనలను అనుసరిస్తూ 70 ఏళ్లకు పైబడిన వారు డోర్ స్టెప్  బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు. ఇక ఈ సేవలో భాగంగా కస్టమర్లు వెయ్యి రూపాయల నుంచి 20వేల వరకు డబ్బులను ఇంటివద్దనే  పొందవచ్చు.  దీనికోసం డోర్ స్టెప్ సర్వీసులను కస్టమర్ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.


దళపతి విజయ్ మీదున్న వీరాభిమానంతో ఓ యువతీ ఏం చేసిందంటే..!?

చీరాల పంచాయితీ తేల్చేసిన జ‌గ‌న్‌... క‌ర‌ణం, ఆమంచికి ఇలా పంచేశారా ?

ఆ సినిమా ప్రముఖుని కొత్త భార్య గొప్ప రచయిత్రి (ట)!

రామ్మోహన్ బామ్మర్ది చాలా చేస్తున్నాడే...!

ఏపీఎస్‌ ఆర్టీసీలో టికెట్‌ బుక్‌ చేస్తున్నారా.. ఒక్క నిమిషం ఆగండి..!

ఏపీ రెవెన్యూ ఉద్యోగుల్లో భయం భయం..

కాపు వేద‌న‌: ప‌శ్చిమ కాపుల దెబ్బ వాళ్లిద్ద‌రిలో ఎవ‌రికో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>