MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/these-tollywood-dancers-turns-actorsc05e3eaf-d697-4ec0-8bd2-7d35cc418d47-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/these-tollywood-dancers-turns-actorsc05e3eaf-d697-4ec0-8bd2-7d35cc418d47-415x250-IndiaHerald.jpg సినిమా నటీనటులు అంటే కచ్చితంగా డ్యాన్స్ లు వేయడం నేర్చుకోవాలి. హీరో లతో పాటు హీరోయిన్లు కూడా అప్పుడప్పుడు ఫైటింగులు చేయాల్సి ఉంటుంది. దీంతో భాష వచ్చినా, రాకపోయినా డాన్సింగ్, ఫైటింగ్ లు ఈ తరం నటీనటులు నేర్చుకోవడం తప్పనిసరి అయ్యిందిtollywood;shobhana;sudha chandran;abinaya;bhanu;chandran new;cinema;tamil;kannada;hero;heroine;sai pallavi;fidaaఒకప్పుడు డ్యాన్సర్స్ అయిన వీరంతా ఇప్పుడు టాప్ యాక్టర్స్..ఒకప్పుడు డ్యాన్సర్స్ అయిన వీరంతా ఇప్పుడు టాప్ యాక్టర్స్..tollywood;shobhana;sudha chandran;abinaya;bhanu;chandran new;cinema;tamil;kannada;hero;heroine;sai pallavi;fidaaFri, 05 Feb 2021 11:00:00 GMTసినిమా నటీనటులు అంటే కచ్చితంగా డ్యాన్స్ లు వేయడం నేర్చుకోవాలి. హీరో లతో పాటు హీరోయిన్లు కూడా అప్పుడప్పుడు ఫైటింగులు చేయాల్సి ఉంటుంది. దీంతో భాష వచ్చినా, రాకపోయినా డాన్సింగ్, ఫైటింగ్ లు ఈ తరం నటీనటులు నేర్చుకోవడం తప్పనిసరి అయ్యింది. అయితే కొందరు నటీనటులు సినిమాలలో అరంగేట్రం చేయకముందే క్లాసికల్, వెస్ట్రన్ డాన్స్ లు నేర్చుకున్న వారు ఉన్నారు. వారెవరో తెలుసుకుందాం.

హీరోయిన్ శోభన ఓ క్లిసికల్ డాన్సింగ్ బాగా నేర్చుకున్నారు. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టక ముందుకే ఆమె ఎన్నో స్టేజ్ ప్రదర్శనలిచ్చారు. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సినిమాల్లో హీరోయిన్ గా నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె ఓ డ్యాన్సింగ్ ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు.

అద్భుతమైన క్లాసికల్ డాన్సర్ అయిన సీనియర్ నటీమణి భానుప్రియ తన అందమైన కళ్లతో  హావభావాలు పలికిస్తూ.. ప్రేక్షకులను ఫిదా చేసేవారు. ఆమె తన తల్లి కోరిక మేరకు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నారు. ఆ తర్వాత ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఐతే ఆమె డ్యాన్స్ చూసే సినిమాల్లో అవకావశం ఇచ్చారు. ఆ విధంగా తెరంగేట్రం చేసిన భానుప్రియ ఎందరో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులను దోచేసిన సాయి పల్లవి చిన్నతనం నుంచే బాగా డాన్స్ చేసే వారు. ఆమె ఈటీవీ వంటి ప్రముఖ ఛానెల్స్ లో అనేక డాన్స్ ప్రోగ్రాము లలో పాల్గొని మంచి డాన్సర్ గా చిన్నతనంలోనే గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఆమె సినిమాల్లో హీరోయన్ ఛాన్స్ కొట్టేసి.. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యారు.

సుధా చంద్రన్ కూడా చిన్నప్పటి నుంచే డాన్స్ వేసేవారు. ఆమె ప్రొఫెషనల్ డాన్సర్ కాగా.. మయూరి సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. రోడ్డు ప్రమాదంలో ఆమె ఒక కాలు కోల్పోయినా కూడా కృత్రిమ కాలు సాయం తో ఎంతో ఆత్మవిశ్వాసంతో డాన్స్ వేయడం ప్రారంభించి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు.


సుకుమార్ ఈ 8 మంది హీరోల జీవితం ఎలా మార్చేసాడో తెలుసా..?

ఆలయాలపై కొత్త లెక్కలు.. ఆ పాపం టీడీపీ ఖాతాలోకే..

కొన్నాళ్లు గుర్తుండిపోయే 'ఉప్పెన' కథ.. సూపర్ హిట్ సినిమా ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఏంటి బాబోయ్..!

తొలి విడ‌త ఏక‌గ్రీవాల్లో జ‌గ‌న్‌కు క‌డ‌ప‌లో షాక్‌... పెద్దిరెడ్డి ట్విస్ట్ ..!

ఆచార్య లెక్కలు చూసి బెంబేలు పడుతున్న ఇండస్ట్రీ వర్గాలు !

జగడ్డ : విశాఖ ఏకగ్రీవాల్లో అతి పెద్ద రికార్డు ?

చీరాల పంచాయితీ తేల్చేసిన జ‌గ‌న్‌... క‌ర‌ణం, ఆమంచికి ఇలా పంచేశారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>