TVMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/karthikadeepam8a584a6e-eaea-4853-b7b1-7653cb77c19d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/karthikadeepam8a584a6e-eaea-4853-b7b1-7653cb77c19d-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై నెంబర్ వన్ సీరియల్ గా ఎంతగానో ఆకట్టుకుంటుంది కార్తీక దీపం. ప్రతి రోజూ సీరియల్ సమయానికి ప్రేక్షకులు అన్ని పనులు వదిలేసుకుని టీవీ ముందు కూర్చుంటారంటే అతిశయోక్తి కాదు.అందులో నటిస్తున్న దీప, సౌందర్య, కార్తీక్ , మోనిత కారెక్టర్లకు మంచి పేరు వచ్చింది. అందరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. karthikadeepam;karthik;soundarya;anasuya bharadwaj;archana;deepa;jeevitha rajaseskhar;omkar;prema;tara;korcha;january;kanna lakshminarayana;television;businessman;marriage;writer;love;car;february;ohmkar;heroine;success;anasuya 1నిజ జీవితంలో కార్తీక దీపం సౌందర్య, కార్తీక్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారునిజ జీవితంలో కార్తీక దీపం సౌందర్య, కార్తీక్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారుkarthikadeepam;karthik;soundarya;anasuya bharadwaj;archana;deepa;jeevitha rajaseskhar;omkar;prema;tara;korcha;january;kanna lakshminarayana;television;businessman;marriage;writer;love;car;february;ohmkar;heroine;success;anasuya 1Fri, 05 Feb 2021 14:14:56 GMTటీవీ ముందు కూర్చుంటారంటే అతిశయోక్తి కాదు.అందులో నటిస్తున్న దీప, సౌందర్య, కార్తీక్ , మోనిత కారెక్టర్లకు మంచి పేరు వచ్చింది. అందరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. వారి పేర్లు చెబితే గుర్తు పట్టని వారుండరు.

ఈ సీరియల్ లో కార్తీక్ గా మాటల రచయిత ఓంకార్ కొడుకు నిరుపమ్ నటిస్తున్నాడు. కార్తీక్ కు తల్లిగా సౌందర్య పాత్రలో అర్చనా అనంత్ నటిస్తున్నారు. సౌందర్య పేరుకు తగ్గట్టుగానే ఆమె అంత అందంగానూ ఉంటుంది. కలర్ ఫుల్ చీరలు, దానికి తగ్గ జ్యువెల్లరీతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఒకవైపు కొడుకు మీద ప్రేమ చూపిస్తూ.. కోడలికి అండగా ఉండే అత్త పాత్రలో అర్చన జీవించేస్తుంది.

అర్చనా అనంత్ కర్ణాటకలో పుట్టి పెరిగారు. బుల్లితెరపైకి రాకముందు బ్యూటీషియన్ గా చేసేవారట. బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అర్చన 1988 జనవరి 3న జన్మించారు.

కొడుకు పాత్రలో చేస్తున్న నిరుపమ్ కూడా 1988, ఫిబ్రవరి 15న పుట్టారు. తనతో హీరోయిన్ గా నటించిన మంజులను వివాహమాడారు. ఈ జంటకు కూడా ఒక బాబు ఉన్నాడు. కార్తీకదీపంలో తల్లీకొడుకులుగా నటిస్తున్నా.. వారిద్దరి మద్య వయసులో పెద్దగా వ్యత్యాసం లేదు. కార్తీక్ కన్నా సౌందర్య 43 రోజులు పెద్దది. వయసు మించిన పాత్రలో అర్చన నటిస్తున్నారు. కానీ సౌందర్యగా ఎనలేని క్రేజ్ ఏర్పడింది. అత్తగా, అమ్మగా, నానమ్మగా అదరగొడుతున్నారు. అందుకే ఆమె ఇంటికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. మొత్తానికి బుల్లితెరను ఏలేస్తున్న ఈ సౌందర్య.. ఇప్పుడు వెండితెరపై మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. అంటే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అనసూయ నటించిన థ్యాంక్యు బ్రదర్స్ లో అర్చన కీలక పాత్ర పోషిస్తున్నారు. బుల్లితెరపై సక్సెస్ అయిన ఈ సౌందర్య వెండితెరను కూడా షేక్ చేస్తారేమో వేచి చూడాలి


ఉడికించిన వేరుశనగ తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..

రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట్లో ప్రత్యేకంగా శాంతి పూజలు.. ఎందుకంటే..!?

జగడ్డ : దీన్నే షాక్ అంటారా ?

బాలయ్య బాబుకు బీపీ చెకింగ్.. అలాగే వస్తుందిలేండని అంతా ఆసక్తి

జగడ్డ: చంద్రబాబు దెబ్బకి అప్పులపాలవుతున్న టీడీపీ నేతలు..

జగడ్డ: ధర్మవరంలో వైసీపీ నేత దౌర్జన్యం...కాళ్ళు చేతులు నరికేస్తానంటూ వార్నింగ్...?

జగడ్డ : అన్నంత పనీ చేసిన నిమ్మగడ్డ.. ఆ జిల్లాల ఏకగ్రీవాలు నిలిపివేత !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>