Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmer-protest7a91be75-576d-41de-9d5c-dd917cb25890-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmer-protest7a91be75-576d-41de-9d5c-dd917cb25890-415x250-IndiaHerald.jpgఢిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు భారీ ఎత్తున నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నిరసనకు అనేక మంది సినీ తారలు, విదేశీయులు మద్దతు తెలుపుతున్నారు. అయితే విదేశీయుల మద్దతు వెనక పెద్ద కుట్ర ఉందని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. రైతులకు మద్దతు తెలుపుతున్న విదేశీయుల వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు ఢిల్లీ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. స్వీడిష్ క్లైమేట్ ఛేంజ్ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బర్గ్ తన షేర్ చేసిన టూల్‌కిట్ రూపకర్త ఓ ఖలిస్థాన్ అనుకూల సంస్థ అని పోలీసులు అనుమానిస్తున్నారు.farmer protest;ganga;delhi;ganges;india;pakistan;hosta;police;january;media;2020;love;job;february;indian;punjab;partyవిదేశీ పోస్టుల వెనక వాళ్ళ హస్తం!విదేశీ పోస్టుల వెనక వాళ్ళ హస్తం!farmer protest;ganga;delhi;ganges;india;pakistan;hosta;police;january;media;2020;love;job;february;indian;punjab;partyFri, 05 Feb 2021 22:17:58 GMTన్యూఢిల్లీ : ఢిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు భారీ ఎత్తున నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నిరసనకు అనేక మంది సినీ తారలు, విదేశీయులు మద్దతు తెలుపుతున్నారు. అయితే విదేశీయుల మద్దతు వెనక పెద్ద కుట్ర ఉందని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. రైతులకు మద్దతు తెలుపుతున్న విదేశీయుల వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు ఢిల్లీ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. స్వీడిష్ క్లైమేట్ ఛేంజ్ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బర్గ్ తన షేర్ చేసిన టూల్‌కిట్ రూపకర్త ఓ ఖలిస్థాన్ అనుకూల సంస్థ అని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఫిబ్రవరి 3న గ్రెటా షేర్ చేసిన టూల్‌కిట్‌ను చాలా మంది చదివి, షేర్ చేశారు. రైతులకు న్యాయం జరగాలని  వారికి  ఈ సాగు చట్టాల కారణంగా  ఎంతో అన్యాయం జరిగే అవకాశం ఉందని, రైతులకు సహాయపడాలనుకునేవారు నిర్వహించవలసిన చర్యలను ఈ టూల్‌కిట్‌లో పేర్కొన్నారు.

 దీనిపై పెద్ద ఎత్తున వివాదం దుమారం రేగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ప్రత్యేకంగా ఎవరి పేరునూ ప్రస్తావించలేదని పోలీసులు చెప్ప చెప్పారు. అయితే టూల్ కిట్ ను కెనడాలోని ఖలిస్థాన్ అనుకూల సంస్థ రూపొందించిందని, దీని వెనుక భారీ కుట్ర ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ టూల్ కిట్ ను  ఎవరు తయారు చేశారు అనేదానిపై కూడా  అనేక ఊహలు వస్తున్నాయి. అయితే ఈ టూల్ కిట్ ను పొయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ (పీజేఎఫ్) నేత మో ధలీవాల్ తయారు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  ధలీవాల్ పేరు గతంలో కూడా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.  2017లో కెనడాలో న్యూ డెమొక్రాటిక్ పార్టీ ప్రచారం కోసం ‘‘లవ్ అండ్ కరేజ్’’ అనే నినాదాన్ని వాడారు.

 దీనిని ధలీవాల్ సృష్టించారు. నేను ఖలిస్థానీనంటూ ఆయన పెట్టిన ఫేస్‌బుక్ పోస్ట్‌లో ‘‘నేను ఖలిస్థానీని. నా గురించి ఇది మీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ఖలిస్థాన్ అనేది ఓ సిద్దాంతం. ఖలిస్థాన్ అనేది ఓ జీవనం, శ్వాసించే ఉద్యమం’’ అని  తెలిపారు. అంతేకాకుండా కొంతకాలం క్రితం ఒట్టావాలోని ప్రభుత్వ విధానాల మేధావి వర్గం మెక్‌డొనాల్డ్-లారియర్ ఇన్‌స్టిట్యూట్ ‘‘ఖలిస్థాన్ : ఏ ప్రాజెక్ట్ ఆఫ్ పాకిస్థాన్’’ పేరుతో ఓ నివేదికను ప్రచురించింది. దీనికి వ్యతిరేకంగా సంతకాలు చేయాలని 2020 సెప్టెంబరు 17న మో ధలీవాల్ బహిరంగంగా కోరారు.
 

ఇటీవల 2021 జనవరి 26న ఇండియన్ కాన్సులేట్ బయట జరిగిన నిరసనలో ధలీవాల్ పాల్గొన్నట్లు ఓ వీడియో బయటపడింది. ఈ వీడియో  ఎంతవరకు నిజం అనేది  ఇంకా తేలలేదు. అయితే ధలీవాల్ భారత దేశంలోని కొత్త వ్యవసాయ చట్టాలు, ఖలిస్థాన్ ఉద్యమం గురించి మాట్లాడినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ‘‘కొత్త సాగు చట్టాల రద్దుతో ఈ పోరాటం ముగిసిపోతుందని ఎవరైనా మీకు చెబితే, అది ఎందుకంటే, వాళ్లు  ఈ ఉద్యమం నుంచి శక్తిని కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నారన్నమాట.

 మీరు పంజాబ్ నుంచి వేరు అని, ఖలిస్థాన్ ఉద్యమం నుంచి మీరు వేరు అని వాళ్ళు మీకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మీరు అలా వేరు కాదు. దీనికి ఖలిస్థాన్ గ్రూప్ తీసుకొచ్చిన భావోద్వేగాన్ని మీరు ఏదో ఓ సమయంలో అర్థం చేసుకోవాలి’’ అని ధలీవాల్ చెప్పినట్లు ఈ వీడియోలో ఉందని జాతీయ మీడియా తెలిపింది. మరి ఇ ఈ విషయంలో ఢిల్లీ పోలీసులు ఇకపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.


అల్లరోడు ఈసారైనా ఆకట్టుకుంటాడా ??

అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?

ఆచార్య నిజంగా నైజాంలో అంత రాబడుతుందా?

ఆ హీరోయిన్ త్యాగం వల్లే రోజా స్టార్ హీరోయిన్ అయ్యింది..ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>