Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi9d5d352a-8241-4e0d-bec0-0a29f8957f37-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi9d5d352a-8241-4e0d-bec0-0a29f8957f37-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి మాంచి ఫాంలో దూసుకెళుతున్నారు. కుర్రహీరోలకు ఏ మాత్రం తగ్గకుండా వరుస సినిమాలను ప్రకటించేస్తూ అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తున్నారు. ఒకప్పటిలా సినిమాల లీస్ట్ ను పెంచేస్తూ.. తన హవాను మళ్లీ చాటాలనుకుంటున్నారు మెగాస్టార్ . అందుకే ఈ సీనియర్ స్టార్ కథనచ్చితే చాలు ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. ఇప్పటికే చిరు చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం చిరు ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుతో పాటుగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తchiranjeevi;chiranjeevi;ram charan teja;editor mohan;kajal aggarwal;pawan kalyan;raja;ram pothineni;cinema;remake;director;moonవావ్.. చిరు ఇమేజ్ కు తగినట్లుగానే చేస్తున్నారా?వావ్.. చిరు ఇమేజ్ కు తగినట్లుగానే చేస్తున్నారా?chiranjeevi;chiranjeevi;ram charan teja;editor mohan;kajal aggarwal;pawan kalyan;raja;ram pothineni;cinema;remake;director;moonFri, 05 Feb 2021 10:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి మాంచి ఫాంలో దూసుకెళుతున్నారు. కుర్రహీరోలకు ఏ మాత్రం తగ్గకుండా వరుస సినిమాలను ప్రకటించేస్తూ అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తున్నారు. ఒకప్పటిలా సినిమాల లీస్ట్ ను పెంచేస్తూ.. తన హవాను మళ్లీ చాటాలనుకుంటున్నారు మెగాస్టార్ . అందుకే ఈ సీనియర్ స్టార్ కథనచ్చితే చాలు ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. ఇప్పటికే చిరు చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం చిరు ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుతో పాటుగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. తండ్రీ కొడుకులు కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎప్పుడెప్పుడు థియేటర్లలో ప్రత్యక్షమవుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.
కాగా ఈ సినిమాలో ఆచార్య చిరు సరసన చందమామ కాజల్ నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. అతి తొందరలోనే ఈ షూటింగ్ ను పూర్తి చేయనుంది ఈ చిత్ర యూనిట్. అయితే ఈ ఆచార్య షూటింగ్  పూర్తి కాకమునుపే మెగాస్టార్ మలయాళం సూపర్ హిట్ మూవీ‘లూసీఫర్’ సినిమా రీమేక్ లో చాలా బిజీ అయ్యారు. మలయాళంలో మోహన్ లాన్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నారు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్వకత్వం వహిస్తున్నారన్న సంగతి తెలిసిందే. కాగా ఈ మధ్యనే ఈ రీమేక్ సినిమా షూటింగ్ ను షురూ చేశారు దర్శకుడు.

అయితే ఈ  సినిమా పేరుకే రీమేక్ .. కానీ ఇందులో కథను టోటల్ గా మార్పు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ లూసీఫర్ కథను మాత్రమే  తీసుకుని తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా మార్పులు చేర్పులు చేస్తున్నారట. అయితే ఈ మార్పులు, చేర్పులు కూడా చిరు ఇమేజ్ ను ఇంకా పెంచేవిధంగా ఉండేలా చేశారట. ఇందులో ముఖ్యంగా మెగా అభిమానులకు నచ్చే.. చిరు డ్యాన్స్, ఫైటింగ్స్ మాత్రం చిరు అభిమానులు ఎలా అయితే కోరుకుంటారో అలాగే ఉండేలా డైరెక్టర్ మోహన్ రాజా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి ఇది ఎంత వరకు వాస్తవమో తెలియాలంటే మాత్రం ఈ చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన కోసం వేచి చూడక తప్పదు. 


దళపతి విజయ్ మీదున్న వీరాభిమానంతో ఓ యువతీ ఏం చేసిందంటే..!?

చీరాల పంచాయితీ తేల్చేసిన జ‌గ‌న్‌... క‌ర‌ణం, ఆమంచికి ఇలా పంచేశారా ?

ఆ సినిమా ప్రముఖుని కొత్త భార్య గొప్ప రచయిత్రి (ట)!

రామ్మోహన్ బామ్మర్ది చాలా చేస్తున్నాడే...!

ఏపీఎస్‌ ఆర్టీసీలో టికెట్‌ బుక్‌ చేస్తున్నారా.. ఒక్క నిమిషం ఆగండి..!

ఏపీ రెవెన్యూ ఉద్యోగుల్లో భయం భయం..

కాపు వేద‌న‌: ప‌శ్చిమ కాపుల దెబ్బ వాళ్లిద్ద‌రిలో ఎవ‌రికో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>