PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda9bca9e61-4eb0-4805-9583-4e38d90cbed4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda9bca9e61-4eb0-4805-9583-4e38d90cbed4-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నా... ఏపీ ప్రభుత్వం, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య పంచాయితీ మాత్రం ఆగడం లేదు. జగన్ సర్కార్ కు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. ఏకగ్రీవాల విషయంలో మరింత దూకుడుగా వెళుతున్నారు నిమ్మగడ్డ.nimmagadda;kumaar;raj;roja;jagan;andhra pradesh;mp;district;peddireddy ramachandra reddy;panchayati;mla;minister;tdp;ycp;march;v;dookuduనిమ్మగడ్డ ఎంపీ కాబోతున్నారా?నిమ్మగడ్డ ఎంపీ కాబోతున్నారా?nimmagadda;kumaar;raj;roja;jagan;andhra pradesh;mp;district;peddireddy ramachandra reddy;panchayati;mla;minister;tdp;ycp;march;v;dookuduFri, 05 Feb 2021 20:46:56 GMTఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నా... ఏపీ ప్రభుత్వం, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య పంచాయితీ మాత్రం ఆగడం లేదు. జగన్ సర్కార్ కు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. ఏకగ్రీవాల విషయంలో మరింత దూకుడుగా వెళుతున్నారు నిమ్మగడ్డ. ఏకగ్రీవ ఎన్నికలు ఎక్కువగా జరిగిన గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించవద్దంటూ ఆ రెండు జిల్లాల  కలెక్టర్లకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవరకు ఫలితాలను హోల్డ్‌లో ఉంచాలని పేర్కొంది. తమకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించిన తర్వాతే ఫలితాలు ప్రకటించాలని, ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి నివేదిక పంపాలని చిత్తూరు, గుంటూరు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది.

    ఎస్‌ఈసీ నిర్ణయంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా నేతలు నిమ్మగడ్డపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాకే చెందిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిమ్మగడ్డపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి మేలు చేస్తే ఎమ్మెల్సీ, ఎంపీని చేస్తారని నిమ్మగడ్డ కక్కుర్తి పడుతున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు  సొంత జిల్లాల్లో కావాలనే ఏకగ్రీవాలను  నిమ్మగడ్డ ఆపారని విమర్శించారు. అధికారులు ఎస్‌ఈసీ చెప్పినట్టు వింటామంటే మార్చి 31 తర్వాత చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. తమ ప్రభుత్వం ఉన్నంత వరకు ఆ అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. అధికారులెవరూ ఎస్‌ఈసీ ఆదేశాలను లెక్కపెట్టకూడదని పిలుపునిచ్చారు. ప్రివిలేజ్ కమిటీకి నిమ్మగడ్డ సమాధానం చెప్పాల్సిందేనని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

                  చిత్తూరు జిల్లాకే చెందిన ఎమ్మెల్యే  రోజా కూడా నిమ్మగడ్డపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయినట్టుందంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తనకు కావాల్సిన అధికారులను నియమించుకున్న తరువాత కూడా ఏకగ్రీవ ఎన్నికలను ఆపటంతో ఆయనపై ఆయనకు నమ్మకం లేదనిపిస్తోందని చెప్పారు. అంతేకాకుండా ప్రజల తీర్పును గౌరవించకపోతే బాగుండదని రోజా వ్యాఖ్యానించారు.
        


రూ. 12 వేల కోట్లకు పైగా రైతుల రుణమాఫీ తక్షణమే అమలుచేసిన సీఎం పళనిస్వామి

అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?

ఆచార్య నిజంగా నైజాంలో అంత రాబడుతుందా?

ఆ హీరోయిన్ త్యాగం వల్లే రోజా స్టార్ హీరోయిన్ అయ్యింది..ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>