PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/us-warns-china-on-border-issue-with-india-first-ti66882f74-0af5-45ed-9393-2bd5c7b03101-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/us-warns-china-on-border-issue-with-india-first-ti66882f74-0af5-45ed-9393-2bd5c7b03101-415x250-IndiaHerald.jpgహెచ్‌-1బీ వీసాకు సంబంధించి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన విధానాన్ని ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కొంతకాలం నిలిపివేశారు. మరలా పాత విధానం లాటరీ పద్ధతినే ఈ ఏడాది డిసెంబరు 31 వరకు కొనసాగించనున్నట్టు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది. కొత్త ప్రక్రియకు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలో మార్పులు చేయడం కోసం ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీకి మరింత గడువు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. హెచ్‌-1బీ వీసాల జారీలో కంప్యూటరైజ్డ్‌ లాటరీ పద్ధతికి స్వస్తిbiden;donald trump;january;court;february;qualification;marchట్రంప్ తీసుకొచ్చిన విధానాలను వాయిదా వేసి పాత పద్ధతుల్లోనే H1B వీసాల జారీ...ట్రంప్ తీసుకొచ్చిన విధానాలను వాయిదా వేసి పాత పద్ధతుల్లోనే H1B వీసాల జారీ...biden;donald trump;january;court;february;qualification;marchFri, 05 Feb 2021 21:20:00 GMTఇటీవలే అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన జో బైడెన్, పరిపాలనలో తన మార్క్ స్టైల్ ని చూపిస్తున్నారు. గతంలో ఉన్న పలు సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక హెచ్‌-1బీ వీసాకు సంబంధించి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన విధానాన్ని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కొంతకాలం నిలిపివేశారు. మరలా పాత విధానం లాటరీ పద్ధతినే ఈ ఏడాది డిసెంబరు 31 వరకు కొనసాగించనున్నట్టు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది. కొత్త ప్రక్రియకు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలో మార్పులు చేయడం కోసం ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీకి మరింత గడువు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. హెచ్‌-1బీ వీసాల జారీలో కంప్యూటరైజ్డ్‌ లాటరీ పద్ధతికి స్వస్తి పలుకుతూ డొనాల్డ్‌ ట్రంప్‌ మార్పులు చేసిన విషయం తెలిసిందే. గరిష్ఠ వేతన స్థాయి, నైపుణ్యం ఆధారంగా వీసాలు జారీచేసేలా ఆయన హాయాంలో కీలక సవరణ చేశారు. హెచ్‌-1బీ ఎంపికలో లాటరీ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు జనవరి 7న తుది ప్రకటన చేసిన యూఎస్‌సీఐఎస్... మార్చి 9 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది.




అయితే, కొత్త విధానానికి అనుగుణంగా హెచ్‌-1బీ నమోదు, ఎంపిక ప్రక్రియలో మార్పులు చేయాల్సి ఉన్నందున దీనిని డిసెంబరు 31 వరకు వాయిదా వేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఓ ప్రకటనలో తెలిపింది. అప్పటివరకు పాత లాటరీ విధానాన్నే కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఇక గతంలో కంప్యూటర్ ప్రోగ్రామర్‌లకు హెచ్ -1 బీ వీసాలకు అర్హత లేదని పేర్కొన్న యూఎస్‌సిఐఎస్.. ఫిబ్రవరి 3న మునుపటి మార్గదర్శకాలను రద్దు చేసింది. యుఎస్ అప్పీలేట్ కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో భారతీయ వ్యక్తిని కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా నియమించుకోవడానికి ఇన్నోవా సొల్యూషన్స్ ప్రయత్నించగా.. అతడికి హెచ్-1బీ వీసాను యూఎస్‌సీఐఎస్ నిరాకరించింది. ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయడంతో అక్కడ అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో యూఎస్‌సీఐఎస్ తన నిబంధనలను సవరించింది.




అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?

ఆచార్య నిజంగా నైజాంలో అంత రాబడుతుందా?

ఆ హీరోయిన్ త్యాగం వల్లే రోజా స్టార్ హీరోయిన్ అయ్యింది..ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..??

జగడ్డ : విశాఖ ఉక్కు మంటల్లో వైసీపీ విలవిల ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>