PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsb61e3320-d14f-4e9a-b3b2-9426c42be59d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsb61e3320-d14f-4e9a-b3b2-9426c42be59d-415x250-IndiaHerald.jpgపంచాయతీ ఎన్నికల సమరం ఏపీలో రాజకీయ రచ్చకు తావు ఇస్తోంది. సరిగ్గా రెండేళ్ళ తరువాత మళ్లీ క్యాడర్ కి పని పడింది. ఇంతకాలం నేతలు మీడియా బేబీలుగా మారి అటూ ఇటూ సవాళ్ళు చేసుకోవడమే అంతా చూశారు. ఇపుడు అందరూ బరిలోకి దిగిపోయారు. ఇజ్జత్ మే సవాల్ అంటూ పంచాయతీ ఎన్నికల్లో జెండా పాతేసేందుకు ఎవరి మటుకు వారు తయారు అయ్యారు. jagan-nimmagadda-elections;godavari river;2019;telugu;media;panchayati;tdp;ycp;izzat;partyపంచాయతీ షాక్ ఎవరికి...?పంచాయతీ షాక్ ఎవరికి...?jagan-nimmagadda-elections;godavari river;2019;telugu;media;panchayati;tdp;ycp;izzat;partyFri, 05 Feb 2021 16:53:57 GMTపంచాయతీ ఎన్నికల సమరం ఏపీలో రాజకీయ రచ్చకు తావు ఇస్తోంది. సరిగ్గా రెండేళ్ళ తరువాత మళ్లీ క్యాడర్ కి పని పడింది. ఇంతకాలం నేతలు మీడియా బేబీలుగా మారి అటూ ఇటూ సవాళ్ళు చేసుకోవడమే అంతా చూశారు. ఇపుడు అందరూ బరిలోకి దిగిపోయారు. ఇజ్జత్ మే సవాల్ అంటూ పంచాయతీ ఎన్నికల్లో జెండా పాతేసేందుకు ఎవరి మటుకు వారు తయారు అయ్యారు.

ఈ నేపధ్యంలో ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలీంగ్ మరో నాలుగు రోజుల్లో జరగనుంది. గడువు దగ్గపడింది. ఏపీలోని ఒక్క విజయనగరం జిల్లాను తప్పించి మిగిలిన పన్నెండు జిల్లాలలో ఈ నెల 9వ పోలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధిన ఏర్పాట్లు ఒక వైపు చకచక సాగుతున్నాయి.

ఇంకో వైపు చూస్తే రాజకీయ పార్టీలు దూకుడు చేస్తున్నాయి. ఎపుడు ఎన్నికలు వచ్చినా కూడా విజయం తమదేనని జబ్బలు చరచిన తెలుగుదేశం ఒక వైపు ఉంటే మరో వైపు అధికారంలో ఉన్న వైసీపీ తన 2019 నాటి బంపర్ విక్టరీని రిపీట్ చేయాలనుకుంటోంది. ఇపుడు ఏపీలో సీన్ చూస్తే రాయలసీమలో వైసీపీ గట్టిగానే ఉంది. ఆ పార్టీ బలం ఎక్కడా తగ్గలేదు. ఇక్కడ మాత్రం పాత ఫలితాలు పునావృత్తం  అవుతాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో చూసుకుంటే టీడీపీ బాగానే పుంజుకుంది అంటున్నారు. అయినా సరే ఇక్కడ వైసీపీ పై చేయి సాధిస్తుంది అన్న మాట కూడా ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.  ఇక క్రిష్ణా, గుంటూరు జిల్లాల్లో ఢీ అంటే ఢీ అన్న సీన్ ఉంది. ఇక్కడ టీడీపీకి పరిస్థ్తి అనుకూలిస్తాయ‌ని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా చూస్తే వైసీపీ కి టీడీపీ గట్టిగానే పోటీ ఇస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరో వైపు ఉత్తరాంధ్రాలో కూడా గత ఫలితాల కంటే మెరుగ్గా ఉంటామని టీడీపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మొత్తానికి చూస్తే పంచాయతీ ఎన్నికల్లో రెండు పార్టీలు విజయం తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.




ఎంతపని చేస్తివిగారా.. కేవలం ఐదు రూపాయలకే భార్యతో గొడవపడి కన్న కూతురినే చంపేస్తావా ?

జగడ్డ : విశాఖ ఉక్కు మంటల్లో వైసీపీ విలవిల ?

నిజ జీవితంలో కార్తీక దీపం సౌందర్య, కార్తీక్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

వావ్ గ్రేట్‌..! పెళ్లి ప‌త్రిక‌ల‌పై రైతు ఉద్య‌మ నినాదం...

దిల్ రాజుకి షాకిచ్చిన వరంగల్ శ్రీను.. కానీ !

పవన్, మహేశ్ మధ్య వార్ పీక్ స్టేజ్ కు..!

ఉప్పెన ట్రైలర్.. ఓ రేంజ్ లో ట్రోల్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>