Crimeyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/killed-daughter28939f1d-76ab-48d5-977f-0510d6fecddd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/killed-daughter28939f1d-76ab-48d5-977f-0510d6fecddd-415x250-IndiaHerald.jpgకన్నబిడ్డలంటే నోరులేని మూగజీవాలకు కూడా వల్లమాలిన ప్రేమ ఉంటుంది. బిడ్డలు ప్రమాదంలో ఉంటే తమ ప్రాణాలను అడ్డు వేసి మరీ కాపాడుకుంటాయి. కానీ ఓ కసాయి తండ్రి మాత్రం క్షణికావేశంలో తన కన్నబిడ్డనే కడతేర్చాడు. తన భుజాలపై ఎత్తుకుని పెంచిన చిట్టి తల్లిని తన చేతులతోనే కొట్టి చంపాడు. ఇంకా దారుణం ఏంటో తెలుసా..?..killed daughter;prema;varsha;vivek;maharashtra - mumbai;district;police;village;love;maharashtra;husband;wife;local language;father;parugu20 నెలల కుమార్తెను కొట్టి చంపిన తండ్రి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..20 నెలల కుమార్తెను కొట్టి చంపిన తండ్రి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..killed daughter;prema;varsha;vivek;maharashtra - mumbai;district;police;village;love;maharashtra;husband;wife;local language;father;paruguFri, 05 Feb 2021 14:08:00 GMTమహారాష్ట్ర: కన్నబిడ్డలంటే నోరులేని మూగజీవాలకు కూడా వల్లమాలిన ప్రేమ ఉంటుంది. బిడ్డలు ప్రమాదంలో ఉంటే తమ ప్రాణాలను అడ్డు వేసి మరీ కాపాడుకుంటాయి. కానీ ఓ కసాయి తండ్రి మాత్రం క్షణికావేశంలో తన కన్నబిడ్డనే కడతేర్చాడు. తన భుజాలపై ఎత్తుకుని పెంచిన చిట్టి తల్లిని తన చేతులతోనే కొట్టి చంపాడు. ఇంకా దారుణం ఏంటో తెలుసా..? కేవలం స్వీట్లు కొనిపెట్టమని అడిగినందుకే కన్న కూతురును ఆ తండ్రి పొట్టనపెట్టుకున్నాడు. ఈ దుర్ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

ఇంటి నుంచి పిల్లలను బయటకు తీసుకొస్తే పిల్లలు అది కావాలి.. ఇది కావాలి అని మారాం చేయడం సర్వసాధారణం. వారిని ఎలాగోలా బుజ్జగించి ఇంటికి తీసుకెళ్తారు తల్లిదండ్రులు. కానీ ఓ దుర్మార్గపు తండ్రి మాత్రం కూతులు స్వీటు కొనుక్కునేందుకు రూ.5 అడిగిందని.. ఒకే ఒక్క కారణంగతో తలుపుకేసి బాది చంపేశాడు. మహారాష్ట్రలోని గోండియా జిల్లా, లోనారా గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

లోనారాలో వివేక్, వర్షా దంపతులకు వైష్ణవి ఒక్కగానొక్క కూతురు. ఆమె వయసు 20నెలలు. గురువారం తనకు స్వీటు కావాలంటూ వైష్ణవి ఏడుస్తోంది. దీంతో వర్ష.. రూ.5 ఇవ్వాలని చెప్పింది. కానీ వివేక్ ఆ డబ్బులు ఇవ్వకపోగా.. వైష్ణవిని విచక్షణారహితంగా కొట్టడం మొదలుపెట్టాడు. తలుపుకేసి కొట్టాడు. ఇంటి మెట్ల మీదకు తీసుకెళ్లి అక్కడ కూడా కొట్టాడు. అడ్డుకోబోయిన వర్షపై కూడా దాడి చేశాడు. దీంతో వర్ష పారిపోయింది.

వివేక్ కొట్టిన దెబ్బలకు వైష్ణవి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కూతురు పరిస్థితి చూసిన వర్ష పరుగున వచ్చి ఆమెను వివేక్ నుంచి లాక్కెళ్లింది. తీవ్రగాయాల పాలైన వైష్ణవిని స్థానిక టిరోడా ఉప జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే బాలిక మరణించిందని వైద్యులు చెప్పారు. దీంతో భార్య వర్ష.. తన భర్త వివేక్‌పై టిరోడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు వివేక్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే కళ్లముందే కూతురు చనిపోయినా కాపాడుకోలేక పోయానని వర్ష కన్నీరుమున్నీరయింది.


ఉడికించిన వేరుశనగ తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..

రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట్లో ప్రత్యేకంగా శాంతి పూజలు.. ఎందుకంటే..!?

జగడ్డ : దీన్నే షాక్ అంటారా ?

బాలయ్య బాబుకు బీపీ చెకింగ్.. అలాగే వస్తుందిలేండని అంతా ఆసక్తి

జగడ్డ: చంద్రబాబు దెబ్బకి అప్పులపాలవుతున్న టీడీపీ నేతలు..

జగడ్డ: ధర్మవరంలో వైసీపీ నేత దౌర్జన్యం...కాళ్ళు చేతులు నరికేస్తానంటూ వార్నింగ్...?

జగడ్డ : అన్నంత పనీ చేసిన నిమ్మగడ్డ.. ఆ జిల్లాల ఏకగ్రీవాలు నిలిపివేత !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>