PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chirala-jagan-mohan-reddy14139ad6-e057-4cb9-a8ce-6091cba02951-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chirala-jagan-mohan-reddy14139ad6-e057-4cb9-a8ce-6091cba02951-415x250-IndiaHerald.jpgఈ ప‌రిస్థితి కొన‌సాగితే వ‌చ్చే ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ, మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో పార్టీ మ‌రింత ఇబ్బందుల్లో ప‌డుతుంద‌నే అధిష్టానం చీరాల పంచాయితీని క్లైమాక్స్‌కు తెచ్చేసింది. బుధ‌వారం తాడేప‌ల్లిలో మంత్రి బాలినేనిని క‌ర‌ణం, ఆయ‌న కుమారుడు వెంక‌టేష్ క‌లిశారు. ఇటు ఆమంచి కూడా మంత్రిని క‌లిశారు. ఇక ఈ వ్య‌వ‌హారంపై పార్టీ కీల‌క నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి కూడా ఆరా తీసిన‌ట్టు తెలుస్తోంది. ఇక చీరాల‌లో ఎవ‌రి బాధ్య‌త‌లు ఏంట‌న్న‌దానిపై జ‌గ‌నే స్వ‌యంగా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌ట‌. మ‌రి కొద్ది రోజుల పాటు వేచి chirala jagan mohan reddy;district;telugu;mla;minister;alla ramakrishna reddy;letter;local language;chirala;ycp;amanchi krishna mohan;reddy;addanki;partyచీరాల పంచాయితీ తేల్చేసిన జ‌గ‌న్‌... క‌ర‌ణం, ఆమంచికి ఇలా పంచేశారా ?చీరాల పంచాయితీ తేల్చేసిన జ‌గ‌న్‌... క‌ర‌ణం, ఆమంచికి ఇలా పంచేశారా ?chirala jagan mohan reddy;district;telugu;mla;minister;alla ramakrishna reddy;letter;local language;chirala;ycp;amanchi krishna mohan;reddy;addanki;partyFri, 05 Feb 2021 09:38:00 GMTప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో అధికార వైసీపీలో నెల‌కొన్న అస‌మ్మ‌తికి సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా పంచాయితీ చేసి తేల్చేసిన‌ట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ మారి వైసీపీ సానుభూతిప‌రుడు అయిన ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాంకు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు మ‌ధ్య పెద్ద వివాద‌మే న‌డుస్తోంది. పార్టీ మారాక నియోజ‌క‌వ‌ర్గంలో పాల‌నా ప‌రంగా ఎమ్మెల్యే బ‌ల‌రాంకు వైసీపీ అధిష్టానం ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్టు కనిపించింది. బ‌లరాంను ఇప్ప‌టి వ‌ర‌కు అధిష్టానంతో పాటు జిల్లా వైసీపీ పెద్ద‌లు కూడా ఎంక‌రేజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ స్వేచ్ఛ‌ను మితిమీరి వాడుకోవ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో అస‌లు సిస‌లు వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు అన్యాయం జ‌ర‌గ‌డంతో పాటు పార్టీకి పెద్ద మైన‌స్ అవుతుంద‌ని భావించిన అధిష్టానం బ‌ల‌రాంతో స‌మానంగా ఆమంచికి కూడా ప్ర‌యార్టీ ఇవ్వాల‌ని నిర్ణయం తీసుకుంది.
ఇక నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు చిర్రుబుర్రులాడుతూ వ‌స్తోన్న పోతుల సునీత‌కు ఎమ్మెల్సీ ఇవ్వ‌డంతో ఆమె సైలెంట్ అయిపోయారు. తాజాగా స‌ర్పంచ్ ఎన్నిక‌లు జ‌రుగుతోన్న రామ‌న్న‌పేట పంచాయ‌తీలో ఆమంచి, క‌ర‌ణం వ‌ర్గాల మ‌ధ్య వివాదం మ‌రింత పెద్ద‌ది అయ్యింది. ఈ ప‌రిస్థితి కొన‌సాగితే వ‌చ్చే ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ, మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో పార్టీ మ‌రింత ఇబ్బందుల్లో ప‌డుతుంద‌నే అధిష్టానం చీరాల పంచాయితీని క్లైమాక్స్‌కు తెచ్చేసింది. బుధ‌వారం తాడేప‌ల్లిలో మంత్రి బాలినేనిని క‌ర‌ణం, ఆయ‌న కుమారుడు వెంక‌టేష్ క‌లిశారు. ఇటు ఆమంచి కూడా మంత్రిని క‌లిశారు.
ఇక ఈ వ్య‌వ‌హారంపై పార్టీ కీల‌క నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి కూడా ఆరా తీసిన‌ట్టు తెలుస్తోంది. ఇక చీరాల‌లో ఎవ‌రి బాధ్య‌త‌లు ఏంట‌న్న‌దానిపై జ‌గ‌నే స్వ‌యంగా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌ట‌. మ‌రి కొద్ది రోజుల పాటు వేచి చూశాక‌.. బ‌ల‌రాం కుటుంబానికి పూర్తిగా అద్దంకి బాధ్య‌త‌లు ఇవ్వ‌నున్నార‌ట‌. అస‌లు బ‌ల‌రాం కుటుంబాన్ని పార్టీలో చేర్చుకున్న‌ప్పుడే అద్దంకి బాధ్య‌త‌లు ఇస్తామ‌న్న హామీని కూడా మ‌రోసారి అధిష్టానం గుర్తు చేసింద‌ట‌. అయితే క‌ర‌ణం ప్ర‌స్తుతం చీరాల ఎమ్మెల్యేగా ఉండ‌డంతో ఇక్క‌డ కొద్ది రోజుల పాటు ప్ర‌యార్టీ ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది.
ఇక చీరాల వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఈ హోదాలోనే కంటిన్యూ అవ్వ‌డంతో పాటు పార్టీ ప‌రంగా రాష్ట్ర స్థాయిలో ఆయ‌న‌కు మ‌రింత బాధ్య‌త అప్ప‌గించ‌నున్నారు. అలాగే ప్ర‌కాశం జిల్లాలో సామాజిక స‌మీక‌ర‌ణ‌ల ప‌రంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న ప‌రుచూరు, అద్దంకి నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా ప్ర‌ధాన బాధ్య‌త తీసుకోవాల‌ని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింద‌ట‌. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి చీరాల పార్టీ పూర్తి బాధ్య‌త‌లు అన్నీ ఆమంచి క‌నుస‌న్న‌ల్లోనే ఉండేలా అధిష్టానం రూట్ మ్యాప్ ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తోంది. దీనిపై రెండు, మూడు రోజుల్లోనే క్లారిటీ రానుంది. 


దళపతి విజయ్ మీదున్న వీరాభిమానంతో ఓ యువతీ ఏం చేసిందంటే..!?

ఆ సినిమా ప్రముఖుని కొత్త భార్య గొప్ప రచయిత్రి (ట)!

రామ్మోహన్ బామ్మర్ది చాలా చేస్తున్నాడే...!

ఏపీఎస్‌ ఆర్టీసీలో టికెట్‌ బుక్‌ చేస్తున్నారా.. ఒక్క నిమిషం ఆగండి..!

ఏపీ రెవెన్యూ ఉద్యోగుల్లో భయం భయం..

కాపు వేద‌న‌: ప‌శ్చిమ కాపుల దెబ్బ వాళ్లిద్ద‌రిలో ఎవ‌రికో ?

హీరోయిన్ న్యూడ్ ఫోటో అడిగిన నెటిజెన్.. మైండ్ బ్లాంక్ అయ్యే పిక్ పెట్టింది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>